Special actions
-
ఎన్నికల్లో ప్రలోభాలను అరికట్టాలి
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ లు ప్రలోభాలకు గురికాకుం డా నగ దు లావాదేవీలపై ప్రత్యేక నిఘా పెట్టా లని జిల్లా కలె క్టర్ రామ్మో హన్ రావు ఆదా య పన్ను శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. బ్యాంకుల్లో పది లక్షలకు పైన జరిగిన లావాదేవీలను ఐటీ శాఖకు ప్రతిరోజు అందజేస్తార ని తెలిపారు. అక్రమంగా తరలిస్తు న్న నగదును పసిగట్టేందుకు నిఘా పెటాలని, బస్టాండు, రైల్వేస్టేషన్లు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలన్నారు. అవసరమైన సందర్భంలో అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటీఏడీ లక్ష్మన్బాబుకు సూచించారు. నోడల్ అధికారులతో సమీక్ష... ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల దరఖాస్తులకు 24 గంటల్లోగా అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ నోడల్ అధికారులకు సూచించారు. తన చాంబర్లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. వాహనాలు, సమావేశాలు, ర్యాలీ, హెలికాప్టర్ ల్యాండింగ్ తదితర అనుమతుల కోసం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సువిధ వెబ్‌సైట్‌కు 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతి మాత్రమే జిల్లా ఎన్నికల అధికారి పరిశీలన చేసి అనుమతి జారీ చేస్తారన్నారు. రవాణా, ఆర్అండ్బీ, పోలీసులు ఇతర సంబంధిత అధికారులు ఆర్ఓ కార్యాలయానికి లైజన్ అధికారులను నియమించాలన్నారు. ఈ అధికారులందరూ ఆర్ఓ కార్యాలయంలోనే అందుబాటులో ఉండాలని, ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం బాధ్యతగా సత్వరమే నివేదికలు అందజేయడానికి కృషి చేయాలన్నారు. ఎన్నికలకు అవసరమైన ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలను గుర్తించి సోమవారం వరకు నివేదిక అందజేయాలని ఆర్టీఓ వెంకటేశ్వర్ రెడ్డిని ఆదేశిం చారు. పోలీసు, రవాణా శాఖ అధికారులు కలిసి వాహనాలను తనిఖీ చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ సమకూర్చేందుకు టెండర్ పిలిచి తక్కువ ధరకు రేటు కోడ్ చేసిన వారిచే సరఫరా చేయించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్లు సరఫరా చేసే సందర్భంలో వాహనాలను సిద్ధం చేయాలని మెటీరియల్ నోడల్ అధికారి చతుర్వేదికి సూచించారు. అక్రమ మద్యం రవాణా జరగకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు సాలూర, కందకుర్తిల వద్ద తనిఖీలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఆర్వో అంజయ్య, అడిషనల్ డిప్యూటీ సీపీ శ్రీధర్ రెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
విజయనగరం టౌన్: రోడ్డు భద్రతా కమిటీతో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన భద్రతా చర్యలను వి«విధ శాఖాధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ యూసీజీ నాగేశ్వరరావు, ఎస్పీ ఎల్‌కెవి.రంగారావులు నిర్వహించిన సమీక్షలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలలో కారణాలను అధికారులకు విశ్లేషించారు. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను విస్తరించాలని, ఆక్రమణలు తొలగించాలని, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. అధిక లోడ్లతో వెళ్లే వాహనాలను సీజ్ చేయాలని, ప్రత్యేక దాడులను పోలీసులు, ఆర్టీవో, ఆర్టీసీ అధికారులతో సంయుక్తంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై ట్రక్ బేలను మరింతగా విస్తరించాలన్నారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో మున్సిపల్ శాఖాధికారులు రాత్రి సమయాల్లో ఎక్కువ కాంతి ఉండే విధంగా లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారులపై ట్రామా కేర్ సెంటర్లు మరింతగా ఏర్పాటు చేయాలని, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రేడియం, రిఫ్లక్టివ్ టేప్‌లను , హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై మద్యం షాపులను తొలగించాలని జాతీయ రహదారులకు కనీసం 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ అధికారులకు ఎస్పీ సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టేప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు మరింత సమర్ధవంతంగా రూపొందించాలని జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనరు కృష్ణవేణి, అదనపు ఎస్పీ ఎవి.రమణ, ఆర్టీసీ రీజనల్ మేనేజరు అప్పారావు, మెడికల్ అండ్ హెల్త్ అధికారులు, విజయనగరం డీఎస్పీ ఎవి.రమణ, బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.రాజేశ్వరరావు, రోడ్డు భద్రతా నోడల్ అధికారి త్రినాథరావు, మున్సిపల్ కమిషనరు నాగరాజు, జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులు, జాతీయ రహదారుల నిర్మాణ కాంట్రాక్టర్లు, పోలీస్, ఆర్టీసీ, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖాధికారులు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు
అనంతపురం సిటీ : అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు నోడ్‌ల్ ఆఫీసర్ సీఈ రవిబాబు తెలిపారు. శనివారం ఆయన ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరామ్నాయక్తో కలిసి అనంతపురం జిల్లాలోని చియ్యేడు, పూల కుంట, మడకశిర, మడకశిర సమీప గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పాటు శ్రీరామరెడ్డి తాగునీటి ప్రధాన పైపులైన్ పనులు జరుగుతుండడం వల్ల నీటి సమస్య ఏర్పడిందన్నారు. ఈ పనులు త్వరలో పూర్తికాగానే చాలా గ్రామాల్లో ఈ సమస్య ఉండదన్నారు. పైప్‌లైన్ పనులు పూర్తయితే సమస్య తీరుతుందన్నారు. సమస్య తీవ్రతను బట్టి గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరందించాలని అధికారులకు సూచించామన్నారు. మరిన్ని మార్గాలు అన్వేషించి గ్రామాల్లో శాశ్వత తాగు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
విద్యాభివృద్ధికి పెద్దపీట
న్యాల్కల్: విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ ఎండీ ఫరీదొద్దీన్ అన్నారు. ఆయన నివాసంలో ఆదివారం న్యాల్కల్ మండల టీఎస్‌యూటీఎఫ్ నూతన క్యాలెం డర్‌ను ఆయన అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యారంగాన్ని అభివృద్ధి పర్చడంలో భాగంగా రాష్ట్రంలో అనేక నూతన గురుకుల, సంక్షేమ పాఠశాలలను ప్రారంభించినట్టు తెలిపారు. అంకిత భావంతో పని చేసి నాణ్యతతో కూడిన విద్యనందించాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన అవి పూర్తి స్థాయిలో విజయ వంతం కావాలంటే ఉపాధ్యాయుల పాత్ర కూడా ముఖ్యమైందన్నారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు కిషన్ పవర్, విజయ్‌కుమార్, చంద్రప్ప, నర్సింహారెడ్డి, పాండురంగారెడ్డి, వీరారెడ్డి, గౌసోద్దీన్, టీఎస్‌యూటీఎఫ్ నాయకులు ఎండీ.సమీయోద్దీన్, గంగామోహన్, కాశీనాథ్, ప్రశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బయోమెట్రిక్ అమలయ్యేనా..?
మిర్యాలగూడ టౌన్ : అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్‌పెట్టేందుకు బయోమెట్రిక్ విధానం అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందుకు సంబంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 9 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా ఈ ప్రాజెక్టు పరిధిలో 2059 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఐసీడీఎస్ ప్రాజెక్టులో చాలా మంది సూపర్వైజర్లు డిప్యూటేషన్‌పైనే ఉంటున్నారు. నూతన సాంకేతిక వ్యవస్థ ద్వారా పోషకాహార లేమితో బాధపడే చిన్నారుల పరిస్థితులను ఎప్పటికప్పుడు అంతర్జాలంలో అధికారులు తనిఖీ చేసి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నారుు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఎంత మంది వస్తున్నారు. వారికి పౌష్టికాహారం అందుతుందా..లేదా.. వర్కర్లు సమయానికి కేంద్రానికి వస్తున్నారా..లేదా అని తెలుస్తుంది. ప్రతి సంవత్సరం మాతా శిశు సంరక్షణ కోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్న ఫలితం లేకుండా పోయింది. అంగన్వాడీ కేంద్రాలకు అందించే పౌష్టికాహార వివరాలు, పూర్వ ప్రాథమిక విద్య, గర్భిణులు, బాలింతలు, వ్యాధి నిరోధక టీకాలు, భ్రుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాల వివరాలు, ఆరోగ్యలక్ష్మి, జన, మరణాలు, కిశోర బాలికలు, బాలామృతం, 0-6 నెలల పిల్లలు, 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు, 3 నుంచి 5 ఏళ్లలోపు పిల్లల వివరాలతో పాటు ఐసీడీఎస్‌కు సంబంధించిన పథకాలను ఇంటర్నెట్లో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. డిజిటలైజేషన్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి అంగన్వాడీ కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డిజిటలైజేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక దృష్టిని సారించనున్నది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అన్నీ చర్యలను చేపడుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో బాలామృతం, ఆరోగ్యలక్ష్మి పథకాలను పడక్భందీగా అమలు చేసేందుకు ఆయా కేంద్రాల పరిధిలో ఆరేళ్లలోపు బాలబాలికలందరికి ఆధార్‌కార్డులను జారీ చేయనున్నది. అదే విధంగా బాలింతలు, గర్భిణులు హాజరును తెలుసుకునేందుకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నది. ఈ నూతన విధానాన్ని ప్రతిష్టాత్మకంగా తెలంగాణాలోని అన్నీ అంగన్వాడీ కేంద్రాల్లోఅమలు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుంది. మీ సేవ కేంద్రాల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాలు బాలలకు ఆధార్‌కార్డులను జారీ చేయనున్నారు. వాటి ఆధారంగానే ఆహార పదార్థాలు, రేషన్ సరుకుల అక్రమాలకు పాల్పడకుండా ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. కేంద్రాల్లో నమోదు అయిన గర్భిణులు, బాలింతల్లో కొంత మంది హాజరు కాకపోవడంతో సరుకులు పక్కదారిపడుతున్నారుు. ఈ విధానం పడక్భందీగా అమలు అయితే అంగన్వాడీ వ్యవస్థకు మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వం త్వరలో అందజేయనున్న ల్యాబ్ ట్యాబ్‌లు, బయోమెట్రిక్ విధానాలపై ప్రతి అంగన్వాడీ వర్కర్‌కు శిక్షణ ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. ఎలాంటి సమాచారం రాలేదు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ ల్యాప్‌ట్యాప్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టేందుకు సిద్ధమైంది. కానీ జిల్లాల విభజన తర్వాత ఈ విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. ప్రభుత్వం బయోమెట్రిక్, ల్యాబ్ ట్యాప్‌ల ఏర్పాటుపై చర్యలు తీసుకుంటే తప్పని సరిగా ప్రతి కేంద్రంలో ఏర్పాటు చేస్తాం. - పుష్పలత, జిల్లా సంక్షేమ అధికారిని -
పట్టు ఉత్పత్తికి ప్రత్యేక చర్యలు
– కేంద్ర సిల్క్ బోర్డు చైర్మన్ హనుమంతరాయప్ప హిందూపురం టౌన్ : దేశంలో పట్టు ఉత్పత్తికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సెంట్రల్ సిల్క్ బోర్డు చైర్మన్ హనుమంతరాయప్ప పేర్కొన్నారు. పట్టణంలోని పలు ట్విస్టింగ్, రీలింగ్ యూనిట్లను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం పట్టుగూళ్ల మార్కెట్‌ను పరిశీలించి రైతులతో గిట్టుబాటు ధర లభిస్తోందా లేదా అనే అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పట్టు ఉత్పత్తి తగ్గడంతోనే చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మేకిన్ ఇండియాలో భాగంగా దేశంలో పట్టు ఉత్పత్తి పెంచడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ట్విస్టింగ్, రీలింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం కోసం 75 శాతం సబ్సిడీ అందిస్తోందన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి షెడ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా కల్లూరుకు చెందిన రైతు చెన్నకేశవ షెడ్ల నిర్మాణం కోసం అందించే రూ.80 వేలు చాలా తక్కువగా ఉందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఎక్కువ మొత్తం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సిల్క్ కాలనీలో రీలింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో జేడీ అరుణకుమారి, ఏడీ నాగరంగయ్య, ప్రసాద్, శాస్త్రవేత్తలు మనోహర్‌రెడ్డి, సత్యనారాయణ, ఉమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు
ఇబ్రహీంపట్నం: మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఇబ్రహీంపట్నం ఏసీపీ నారాయణగౌడ్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి (పాత జిల్లాలు) ఎన్ఎస్ఎస్ విద్యార్థినులకు వినోభానగర్‌లోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో 5 రోజుల పాటు ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇచ్చారు. మంగళవారం ముగింపు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఆత్మరక్షణకు మహిళలు కరాటే నేర్చుకోవడం ఎంతో అవసరమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో షీ టీమ్స్, 100 నెంబర్‌కు డయల్ చేయాలని తెలిపారు. ఉస్మానియా వర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పి.విష్ణుదేవ్, కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి, డెరైక్టర్ వంశీకృష్ణ, ఏఓ వెంకట్, సీఐ స్వామి, కరాటే మాస్టర్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. -
పచ్చదనానికి ఎన్టీపీసీ ప్రత్యేక చర్యలు
► 89.2 శాతం బూడిద వినియోగం ► ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ప్రశాంత్‌కుమార్ మహాపాత్ర జ్యోతినగర్ : ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో పచ్చదనం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ప్రశాంత్‌కుమార్ మహాపాత్ర అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎన్టీపీసీ పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో పర్మనెంట్ టౌన్షిప్లో ఏర్పాటు చేసిన ప్రభాత ర్యాలీని జెండా ఊపి ప్రాంరంభించారు. మొక్కలు నాటడంతోపాటు వాటిని పర్యవేక్షించే బాధ్యతలను సంస్థ తీసుకుంటోందన్నారు. వ్యప్రాణులను రక్షించేందుకు అడవులను నరకడం మానాలన్నారు. ఎన్టీపీసీ నుంచి విద్యుత్ ఉత్పత్తిలో విడుదలవుతున్న బూడిద 89.2 శాతం వివిధ అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం మొ క్కలు నాటారు. తెలంగాణ హరితహారంలో విధిగా తమ వంతు బాధ్యతను పోషిస్తామన్నా రు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు ఎస్.ఆర్.భావరాజు, యూకే.దాస్‌గుప్తా, రాజన్, వై.శ్రీని వాస్, మాథ్యూస్వర్గీస్, ఈఎంజీ విబాగం ఏజీఎం బూపేంద్రకుమార్ గర్గ్, భవాని, కార్తీకేయన్, నర్సయ్య, క్రచ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మధునాగేందర్, ప్రదానకార్యదర్శి యుగంధర్‌రావు, లక్ష్మణ్‌బాబు, రవీందర్, దీప్తి మహిళా సమితి సభ్యులు, బాలభవన్ సభ్యు లు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, వివిధ యూనియన్ల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
ప్రతి పోలీస్ స్టేషన్లో గ్రీవెన్స్‌సెల్ నిర్వహించాలి ప్రధాన కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం లాడ్జిల్లో దిగే వారి పూర్తివివరాలు సేకరించాకే అద్దెకు ఇవ్వాలి విజయనగరం డీఎస్పీ పి.వి.రత్నం విజయనగరం డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ పీవీ రత్నం తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పోలీస్‌స్టేష న్లలో గ్రీవెన్స్‌సెల్, సీసీ కెమెరాలతో నిఘా వంటి వాటిపై ఆమె ‘సాక్షి’తో ఇలా మాట్లాడారు.... - విజయనగరం క్రైం సాక్షి: దొంగతనాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీఎస్పీ: పది రోజుల క్రితం విజయనగరం పట్టణంలో చైన్‌స్నాచింగ్, కొద్దిగా ఇళ్ల దొంగతనాలు జరిగాయి. వన్‌టౌన్ పరిధిలోనే 17 బీట్లు ఏర్పాటు చేశాం. స్ట్రీట్ హాక్‌లు ఆరు తిరుగుతున్నాయి. ఎక్కువగా దొంగతనాలు జరిగే ప్రాంతాల్లో రాత్రి, పగలు బీట్లను వేశాం. రాత్రి వేళల్లో ప్రత్యేక టీమ్‌లు తిరుగుతుంటాయి. బైక్‌లపై వచ్చి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అలాంటి వాటిని నివారించేందుకు నిరంతరం వాహనాలను తనిఖీ చేసి కేసులు నమోదు చేస్తున్నాం. డివిజన్ పరిధిలో ప్రతి రోజు 300 వరకు వాహనాలను తనిఖీ చేసి కేసులను నమోదు చేస్తున్నాం. సాక్షి: పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టారా? డీఎస్పీ: పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. వారి కదలికలను ఆయా పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న క్రైం పార్టీ సిబ్బంది గమనిస్తూ ఉంటారు. బ్యాంకుల వద్ద, ఆలయాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశాం. గొలుసు దొంగతనాలు మహిళలనే లక్ష్యంగా చేసుకుని పాల్పడుతున్నారు. గొలుసు దొంగతనాలు ఎక్కువగా పాత నేరస్తులు పాల్పడే అవకాశం ఉంటుంది. సాక్షి: లాడ్జిలను దొంగలు ప్రధాన కేంద్రాలుగా వినియోగించుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి? డీఎస్పీ: లాడ్జిలను ప్రతిరోజు సిబ్బంది తనిఖీ చేస్తుంటారు. అనుమానం వచ్చిన ప్రతిసారి కూడా లాడ్జిలను తనిఖీ చేస్తాం. లాడ్జిల్లో దిగేవారి పూర్తి వివరాలు తీసుకోవాలని లాడ్జిల యజమానులకు ఆదేశించాం. ఇతర రాష్ట్రాల నుంచి గ్యాంగ్‌లు వచ్చే సమయాల్లో లాడ్జిల్లోనే బస చేస్తారు. వారి బాష తదితరాలను బట్టి గుర్తించవచ్చు. అందుకే లాడ్జిల్లో దిగేవారి పూర్తి ఆధారాలు చూపించాక అద్దెకు ఇవ్వాలని ఆదేశిస్తున్నాం. లాడ్జిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పాం. సీసీ కెమెరాలు ఉంటే లాడ్జిల్లోకి ఎవరెవరు వస్తున్నారనే విషయాలు తెలుస్తాయి. సాక్షి: ప్రజలు సమస్యలు తెలుసుకునేందుకు స్టేషన్, సర్కిల్, డీఎస్పీ కార్యాలయ స్థాయిలో గ్రీవెన్స్‌సెల్ నిర్వహించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి? డీఎస్పీ: ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రతి సోమవారం డీఎస్పీ కార్యాలయం, సర్కిల్ కార్యాలయంలో సీఐ, పోలీసు స్టేషన పరిధిలో ఎస్ఐలు గ్రీవెన్స్‌సెల్ నిర్వహించాలి. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలి. అక్కడ పరిష్కారం కాకుంటే ఎస్పీకు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. సాక్షి: పట్టణంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎప్పటిలో ఏర్పాటు చేస్తారు? డీఎస్పీ: పట్టణంలో నేరాల నియంత్రణకు ప్రధాన జంక్షన్లలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీసీ కెమెరాలను ప్రధాన జంక్షన్లో ఏర్పాటు చేస్తే నేరస్తులతోపాటు రోడ్డు ప్రమాదాల ఎలా జరిగాయనే విషయాలు తెలుస్తాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం సాక్షి: డివిజన్ పరిధిలో సిబ్బంది కొరత ఉందా? డీఎస్పీ: విజయనగరం డివిజన్ పరిధిలో పోలీసుస్టేషన్ వారీగా సిబ్బంది కొరత ఉంది. ప్రస్తుతం పోలీసు రిక్రూట్మెంట్ జరగలేదు. సిబ్బంది కొరత విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లాం. పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటారు. సాక్షి: రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీఎస్పీ: రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాద స్థలాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల కారణాలు గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటారు.