పచ్చదనానికి ఎన్టీపీసీ ప్రత్యేక చర్యలు | NTPC greenery, special actions | Sakshi
Sakshi News home page

పచ్చదనానికి ఎన్టీపీసీ ప్రత్యేక చర్యలు

Published Mon, Jun 6 2016 2:55 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

పచ్చదనానికి ఎన్టీపీసీ ప్రత్యేక చర్యలు

పచ్చదనానికి ఎన్టీపీసీ ప్రత్యేక చర్యలు

89.2 శాతం బూడిద వినియోగం
ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్  ప్రశాంత్‌కుమార్ మహాపాత్ర

 
 
జ్యోతినగర్ : ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో పచ్చదనం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ప్రశాంత్‌కుమార్ మహాపాత్ర అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎన్టీపీసీ పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో పర్మనెంట్ టౌన్‌షిప్‌లో ఏర్పాటు చేసిన ప్రభాత ర్యాలీని జెండా ఊపి ప్రాంరంభించారు. మొక్కలు నాటడంతోపాటు వాటిని పర్యవేక్షించే బాధ్యతలను సంస్థ తీసుకుంటోందన్నారు. వ్యప్రాణులను రక్షించేందుకు అడవులను నరకడం మానాలన్నారు. ఎన్టీపీసీ నుంచి విద్యుత్ ఉత్పత్తిలో విడుదలవుతున్న బూడిద 89.2 శాతం వివిధ అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.

అనంతరం మొ క్కలు నాటారు. తెలంగాణ హరితహారంలో విధిగా తమ వంతు బాధ్యతను పోషిస్తామన్నా రు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు ఎస్.ఆర్.భావరాజు, యూకే.దాస్‌గుప్తా, రాజన్, వై.శ్రీని వాస్, మాథ్యూస్‌వర్గీస్, ఈఎంజీ విబాగం ఏజీఎం బూపేంద్రకుమార్ గర్గ్, భవాని, కార్తీకేయన్, నర్సయ్య, క్రచ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మధునాగేందర్, ప్రదానకార్యదర్శి యుగంధర్‌రావు, లక్ష్మణ్‌బాబు, రవీందర్, దీప్తి మహిళా సమితి సభ్యులు, బాలభవన్ సభ్యు లు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది, వివిధ యూనియన్ల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement