Special Attractions
-
కుంచె గీసిన చిత్రం..
నగరంలోని పలు కూడళ్లు రంగులద్దుకుంటున్నాయి. విభిన్న కళాకృతులతో ఫ్లై ఓవర్ పిల్లర్లు, అండర్ పాస్ గోడలు కలర్ ఫుల్ పెయింటింగ్స్‌తో కళకళలాడుతున్నాయి. ఒక్కో సెంటర్‌కు ఒక్కో రకమైన థీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గత రెండు నెలలుగా కళాకారులు తమ ప్రతిభతో ఎంతో అందమైన కళాఖండాలను తీర్చిదిద్దుతున్నారు. ఆ దారిన పోయే ప్రయాణికులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణం, ఆరోగ్యం, నగర, గ్రామీణ ప్రజల జీవన శైలి, జంతువులు, పక్షులు, క్రీడలు ఇలా విభిన్న రంగాలకు చెందిన చిత్రాలు నడయాడినట్లు దర్శనమిస్తున్నాయి. ఇందులో కళాకారులతో పాటు, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు సైతం పాలుపంచుకుంటున్నారు. ఎల్బీనగర్ నుంచి లింగంపల్లి వరకూ.. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకూ.. హైటెక్ సిటీ నుంచి ఉప్పల్ సచివాలయం వరకూ.. ఇలా ఎటు చూసినా వంతెనల పిల్లలర్ల మీద, వంతెనల గోడలపైనా ఇటీవల కాలంలో కొత్త సొబగులద్దుకుంటున్నాయి. రేవంత్ సర్కార్ వచ్చిన తరువాత వాల్ పెయింటింగ్స్‌తో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కార్యాచరణలోకి దిగారు. ప్రతి ఫ్లై ఓవర్ వంతెన, అండర్ పాస్ గోడలు, పిల్లర్లకు అందమైన ఆకృతుల్లో చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. ఒక్కో సెంటర్లో ఒక్కో రకమైన థీమ్‌తో చిత్రాలు వేస్తున్నారు. ఎల్బీ నగర్ కూడలిలో వంతెన పిల్లర్లకు ఓ వైపు సంప్రదాయ నృత్యాలు, మైరో వైపు పాప్ డ్యాన్సర్స్ చిత్రాలు తీర్చిదిద్దారు. ఫ్లెక్సీ ప్రింటింగ్‌తో ముప్పు..ఒకప్పుడు ఆర్టిస్టులకు చేతినిండా పని ఉండేది. దీంతో బ్యానర్లపై రాతలు రాయడం, గోడలపై చిత్రాలు వేయడం, రాజకీయ, సినీ ప్రముఖుల కటౌట్లను సిద్ధం చేయడం, వివిధ సందర్భాల్లో ఆరి్టస్టులకు చేతినిండా పని దొరికేది. దీంతో గతంలో ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే ఆలోచన ఎక్కువ మందిలో కనిపించేది. అయితే ఇటీవలి కాలంలో మార్కెట్లోకి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ అందుబాటులోకి రావడంతో తక్కువ ఖర్చు, వేగంగా పని పూర్తవుతుండడంతో పలువురు దీనిపై మక్కువ చూపుతున్నారు. దీంతో పెయింటింగ్ ఆరి్టస్టులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని పలువురు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం, ఉపాధి మార్గాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాపోతున్నారు.36 ఏళ్లుగా ఇదే వృత్తి..1988లో ఆరి్టస్టుగా ప్రయాణం మొదలు పెట్టాను. ప్రభుత్వం వాల్ పెయింటింగ్స్‌కు అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. కళాకారులకు పని దొరుకుతుంది. రోజుకు రూ.2 వేలు ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఏ రకమైన పెయింటింగ్స్ వేయాలని సూచిస్తే వాటినే చిత్రిస్తున్నాం. ఈ పని ఎన్నాళ్లు ఉంటుందో తెలీదు. పదేళ్ల క్రితం వరకూ చేతినిండా పని ఉండేది. ఫ్లెక్సీ ప్రింటింగ్ వచ్చిన తరువాత నెలలో కొన్ని రోజులు పనిలేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. – అశోక్, కళాకారుడు, హయత్నగర్ఆరు నెలలు పని కలి్పంచాలి.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని కల్పించినట్లు సంవత్సరంలో కళాకారులకు కనీసం ఆరు నెలలు పనికల్పించే విధంగా చట్టం చేయాలి. ఒకప్పుడు ఫైన్ ఆర్ట్స్ అంటే సమాజంలో డిమాండ్ ఉండేది. ఫ్లెక్సీలు వచ్చాక క్రమంగా పని తగ్గుతోంది. పదో తరగతి చదివి ఆరి్టస్టుగా స్థిరపడ్డాను. ఇప్పుడు నెలలో 20 రోజులు పని ఉంటే పది రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వమే కళాకారులను ఆదుకుని జీవనోపాధి చూపించాలి. – సత్యం, కళాకారుడు, హయత్‌నగర్ -
అలుగులు పారే.. అందాల జోరే!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామశివారులోని పోచారం ప్రాజెక్టు నిర్మించి సరిగ్గా వందేళ్లవుతోంది. ఇప్పటికీ చెక్కుచెదరని నిర్మాణమది. అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 1917లో శ్రీకారం చుట్టి, 1922లో పూర్తిచేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణవ్యయం రూ.27.11 లక్షలు. నిజాం ప్రభుత్వ ఇంజనీర్ ఆలీ నవాబ్‌జంగ్ బహద్దూర్ ఆధ్వర్యంలో 21 అడుగుల ఎత్తుతో, 1.7 కిలోమీటర్ల పొడవుతో ప్రాజెక్టు కట్టారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం రాళ్లు, డంగు సున్నం మాత్రమే ముడిసరుకుగా వినియోగించారు. ప్రాజెక్టు దిగువన ఉన్న భూములకు సాగునీటిని అందించేలా 58 కిలోమీటర్ల పొడవుతో కాలువ నిర్మించారు. దీనికి 73 డిస్ట్రిబ్యూటరీలను సైతం నిర్మించారు. కాగా, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పోచారం ప్రాజెక్టు పేరొందింది. రెండు మండలాల్లోని 43 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు సరఫరా అందుతోంది. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టును రెండు జోన్లుగా విభజించారు. ఏటా ఖరీఫ్ సీజన్లో రెండు జోన్లకు, రబీలో ఒక ఏడాది ‘ఏ’జోన్‌కు, మరో ఏడాది ‘బీ’జోన్‌కు వంతులవారీగా 10,500 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తున్నారు. ప్రాజెక్టు ఎత్తును ఐదడుగులు పెంచితే నీటినిల్వ సామర్థ్యం పెరిగి ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణతోపాటు మరో ఏడు వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చని అప్పట్లో ప్రతిపాదనలు చేశారు. అయితే ఈ డిమాండ్‌ను పట్టించుకునే నాథుడేలేరు. పోచారం అభయారణ్యంలో జింకల సందడి విదేశీ పక్షుల సందడి పోచారం ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నదంటే విదేశీ పక్షులు వచ్చి సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా నైజీరియాకు చెందిన పక్షులు పెద్దసంఖ్యలో వచ్చి సందడి చేస్తాయి. ప్రాజెక్టు చూడటానికి వచ్చిన పర్యాటకులను పక్షులు ఆకట్టుకుంటాయి. పర్యాటకులు తమ కెమెరాల్లో పక్షుల ఫొటోలను బందిస్తుంటారు. అలుగులు పారే నీరు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ఎంతో శోభను సంతరించుకుంటుంది. పర్యాటకాభివృద్ధి అంతంతే.. పోచారం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలున్నాయి. అయితే ఆ దిశగా అడుగులు పడకపోవడం గమనార్హం. అప్పట్లో బోటింగ్ కోసం ప్రయత్నాలు జరిగినా, ముందుకు సాగలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందే నిర్మించిన గెస్ట్‌హౌస్ నిర్వహణ అధ్వానంగా ఉంది. ప్రాజెక్టుకు వెళ్లే ముందు మెదక్ జిల్లాలో ఏడుపాయల దుర్గమ్మ దర్శనం, మెదక్ చర్చి, పోచారం అభయారణ్యం, ప్రాజెక్టుతోపాటు నిజాంసాగర్ ప్రాజెక్టును చూసేలా టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందానికి ఆస్కారముందని జిల్లావాసులు పేర్కొంటున్నారు. వన్యప్రాణుల కోసం అభయారణ్యం... ప్రాజెక్టుకు సమీపంలో పోచారం అభయారణ్యాన్ని 1952 ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్వహణ కామారెడ్డి జిల్లా నీటి పారుదల శాఖ అధీనంలో ఉండగా, అభయారణ్యం నిర్వహణను మెదక్ జిల్లా అటవీ శాఖ చూసుకుంటోంది. అభయారణ్యంలో జింకలు ఎక్కువగా కనిపిస్తాయి. సందర్శకులు వన్యప్రాణులను చూడటానికి అభయారణ్యంలో వాహనాన్ని ఏర్పాటు చేశారు. -
రాజధానికి హంగులు, ఆకర్షణలు: వెంకయ్యనాయుడు
విజయవాడ: రాజధాని నగరానికి కొన్ని హంగులు, ఆకర్షణలు, కొన్ని ప్రత్యేకతలతోపాటు వసతులు ఉండాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అలాలేకపోతే రాజధాని నిలబడదని అన్నారు. రాజధాని విషయంలో కొంతమంది అపరిపక్వతతో మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రపంచం చాలా ముందుకు వెళుతోందన్నారు. ఈమధ్యకాలంలో తాను విదేశాలకు వెళ్లి చూశానని చెప్పారు. రాజధాని అనగానే సచివాలయం, హైకోర్టు, ఎమ్మెల్యేలు, మంత్రుల క్వార్టర్లు అని కొందరు అనుకుంటున్నారు. అలా అని భావిస్తే, పని ఉన్నవారు తప్ప రాజధానికి ఎవరూ రారని చెప్పారు. అలారాకపోతే పెట్టుబడులు రావన్నారు. పర్యాటన కూడా ఎక్కువగా జరగదని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆయా ప్రాంతాలలో ఏదోఒకరి రావాలని చెప్పారు. ఈ విషయమై చంద్రబాబుతో తరచూ మాట్లాడుతున్నానన్నారు. ఆయన కూడా అదేదిశగా ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు. రాజధానిలో విద్య, ఉపాధి, వినోదం, ఆర్థిక కార్యకలాపాలు ఉండాలని తెలిపారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సాయంత్రం అయ్యేసరికి ఎవ్వరూ ఉండరని చెప్పారు. ప్రజల మైడ్‌సెట్ అలా ఉంటుందన్నారు. రాజధాని ఇప్పుడు ఉన్నప్రాంతంలో వద్దంటే, ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పెట్టవచ్చునని అన్నారు. అవకాశాలు, ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపారు. రాజధాని అనకపోతే ఈ ప్రాంతంలో అంత ధర వచ్చేదా? అని ప్రశ్నించారు. విజయవాడలో రేట్లు చూస్తే న్యూయార్కు, శాన్ఫ్రాన్సిస్కో రేట్లు ఉన్నాయని తెలిపారు. తుళ్లూరులో కూడా ఇప్పుడు రేట్లు అలానే ఉన్నాయని అన్నారు. మధ్యలో ఉన్నవారు కల్పించే భ్రమల్లోపడకండి అని చెప్పారు. రాజధాని ప్రాంతంలో రైతులకు న్యాయం చేయాలన్నారు. వారు జీవనాధారాన్ని కోల్పోతారని, అందువల్ల సరిపడా పరిహారం ఇవ్వాలని వెంకయ్యనాయుడు అన్నారు. **