బంజారాహిల్స్‌లో మూడు భవన్లు
సాక్షి, హైదరాబాద్: బంజారాలు, ఆదివాసీల కోసం రాజధాని నడిబొడ్డున ప్రత్యేక భవన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆయా వర్గాలకు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో బంజారా భవ న్, ఆదివాసీ భవన్‌తోపాటు జగ్జీవన్‌రామ్ భవన్‌ను కూడా నిర్మించాలని కేసీఆర్ ఆదేశించారు. మూడు భవనాలకు ఒక్కో ఎకరం చొప్పున మొత్తం మూడెకరాలు, ఒక్కో భవనానికి రెండున్నర కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఫైలుపై శుక్రవారం సంతకం చేశారు. ఈ నెల 11న ఈ భవనాలకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు.