special class
-
ఇషాన్ కిషన్‌కు క్లాస్ పీకిన రోహిత్ శర్మ.. విషయమేంటి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంరతం యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్‌కు స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. బ్యాటింగ్‌లో కాస్త ఇబ్బంది పడినట్లుగా కనిపించిన ఇషాన్ 42 బంతుల్లో 35 పరుగులు చేశాడు. మంచి ఇన్నింగ్స్ అయినప్పటికి టి20 స్పెషలిస్ట్ అని చెప్పుకున్న ఇషాన్ నుంచి ఈ ప్రదర్శన రావడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా స్పిన్ ఆడడంలో ఇషాన్ బాగా ఇబ్బంది పడ్డాడు. అందుకే రోహిత్ ఇషాన్‌కు బ్యాటింగ్ టెక్నిక్ గురించి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. రోహిత్ క్లాస్ తీసుకోవడంపై మరొక కారణం కూడా ఉంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మెగావేలంలో ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ రూ. 15.25 కోట్లుకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ ఓపెనర్‌గా రాబోతున్నాడు. అదే ముంబై ఇండియన్స్‌కు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఓపెనింగ్ కాకపోతే మిడిలార్డర్లో ఎలా ఆడాలనేదానిపై రోహిత్.. ఇషాన్‌కు బ్యాటింగ్ టెక్నిక్ వివరించాడు. చదవండి: అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం.. అదరగొట్టాడు ఇక ఇషాన్‌కు క్లాస్ తీసుకోవడంపై రోహిత్ పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ కార్యక్రమంలో పేర్కొన్నాడు. ''ఇషాన్ కిషన్ బ్యాటింగ్ బాగానే ఉన్నప్పటికి స్పిన్ బౌలింగ్ ఆడడంలో ఇబ్బంది పడ్డాడు. టీమిండియా జట్టులో ఓపెనర్.. మిడిలార్డర్లో ఎక్కడ వచ్చినా సరే ఎలా ఆడాలో అతనికి వివరించా. ఇండియన్ జెర్సీ వేసుకొని ఆడుతున్నామంటేనే సహజంగా ఒత్తిడి నెలకొంటుంది. ఇషాన్‌కు ఆ ఒత్తిడి మరింత ఎక్కువైంది. అందుకే అతడికి క్లాస్ తీసుకున్నా. ముందు నీలో ఒత్తిడి తొలగించి స్ట్రైక్ రొటేట్ చేయడంపై ఎక్కువ దృష్టి సారించాలని'' పేర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా వెస్టిండీస్‌పై తొలి టి20లో 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 158 పరుగుల లక్ష్యతో బరిలోకి దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. రోహిత్ శర్మ(40), ఇషాన్ కిషన్(35), సూర్యకుమార్(34 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్(24 నాటౌట్) రాణించారు. అంతకముందు వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 ఫిబ్రవరి 18(శుక్రవారం) జరగనుంది. చదవండి: జోష్ మీదున్న టీమిండియాకు దెబ్బ.. రెండో టి20కి ఆ ఇద్దరు డౌటే! -
కరెస్పాండెంట్ కుమారుల లైగింక వేధింపులు
కర్నూలు, బొమ్మలసత్రం: స్టడీ క్లాస్‌ల పేరుతో విద్యార్థులను ఇంటికి పిలిపించుకుని ఓ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ కుమారులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడడంతోపాటు వాటిని సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్నారు. బాధితులైన విద్యార్థులు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇవీ.. నంద్యాల పట్టణం ఎన్జీవోస్ కాలనీలో ఓ ప్రైవేట్ పాఠశాలను కరెస్పాండెంట్ కుమారులు యశ్వంత్ , కార్తీక్ నిర్వహిస్తున్నారు. వీరి స్నేహితుడు చరణ్ అదే పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. పాఠశాలలో చదువుతున్న 9,10 వ తరగతిచదువుతున్న కొందరు విద్యార్థులు స్కూల్ ఎదురుగా ఉన్న కరెస్పాండెంట్ ఇంటికి స్టడీక్లాస్‌ల కోసం రాత్రి వెళ్లేవారు. మద్యం సేవించిన యశ్వంత్, కార్తీక్, చరణ్‌లు.. విద్యార్థులను వేధింపులకు గురిచేసేవారు. లోడ్రాయర్ వేసుకురాని వారిని వరుసగా నిలబెట్టి వారి మర్మాంగాన్ని స్కేలుతో కొలిచేవారు. ఈ దృశ్యాన్ని సెల్ఫోన్లతో చిత్రీకరించి తోటి విద్యార్థులకు చూపించి వేధించేవారు. విద్యార్థులు ఎదురుతిరిగితే గొడ్డును బాదినట్లు బాదేవారు. విద్యార్థులు భయపడి ఈ విషయంపై ఎక్కడా నోరుమెదిపేవారు కాదు. రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావటంతో భరించలేని విధ్యార్థులు విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు నేరుగా నంద్యాల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు..యశ్వంత్, కార్తీక్, చరణ్‌ల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు. పాఠశాలలో చదువుతున్న బాలికలపై కూడా వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు రావటంతో దర్యాప్తు చేస్తున్నారు. -
స్పెషల్ క్లాస్
స్కూల్లో, కాలేజీలో చదువుకునేటప్పుడు స్పెషల్ క్లాసులకి వెళుతుంటాం. ఇప్పుడు నాగచైతన్య కూడా వెళుతున్నారు. అయితే ఇది సినిమా స్పెషల్‌క్లాస్ అని ఊహించే ఉంటారు. ఈ క్లాస్ ఎందుకంటే.. తెలంగాణలో మాట్లాడటం కోసం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులోనే నాగచైతన్య తెలంగాణ భాష మాట్లాడబోతున్నారు. అమిగోస్ ఫిలింస్ సమర్పణలో ఏషియన్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్‌రావులు నిర్మాతలు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం అవుతుందట. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సూపర్‌హిట్ చిత్రం ‘ఫిదా’లో మలయాళ ముద్దుగుమ్మ సాయిపల్లవితో తెలంగాణ మాట్లాడిన విషయం తెలిసిందే. ఆమె మాట్లాడిన తీరు అందరికీ నచ్చింది. సాయి పల్లవి అంత పర్ఫెక్ట్గా మాట్లాడటానికి శేఖర్ కమ్ముల కొంతకాలం తర్ఫీదునిచ్చారాయన. ఇప్పుడు నాగచైతన్యకు సెపరేట్ క్లాసులు తీసుకొంటున్నారట. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భాస్కర్ కెమెరా: విజయ్‌కుమార్. -
తమ్ముళ్లకు బాబు క్లాస్?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలకు అధినేత చంద్రబాబు అంక్షింతలు వేశారా..? ఆధిపత్య పోరుతో స్థాయిని మరిచి ఒకరిపై ఒకరు తిట్లదండకం అందుకుంటున్న నాయకులను దారిలోకి తెచ్చే ప్రయత్నం చేశారా..? విజయవాడలో మంగళవారం టీ టీడీపీ నాయకులతో చంద్రబాబు జరిపిన సమావేశం వేడి వేడిగా కొనసాగిందని సమాచారం. సుమారు నాలుగైదు గంటలపాటు రెండు దఫాలుగా సమావేశం జరిగింది. ఈ భేటీకి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. భోజన విరామం వరకు అందరు నాయకులతో కలిపి సమావేశం జరిపిన బాబు అనంతరం రమణ, ఎర్రబెల్లి, రేవంత్‌లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతకు ముందు పార్టీ నాయకుడు లోకేష్ కూడా వీరితో సమావేశమై చర్చించారు. పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్న వివరాల మేరకు.. రాష్ట్ర నాయకులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఎలా..? అంతా కలిసి ఉండండి. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నామన్న సంగతి మరిచిపోవద్దు. నాయకులు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలి. మిమ్ముల్ని మీరు గౌరవించుకోకుంటే పార్టీ కేడర్ ఎలా మిమ్ముల్ని గౌరవిస్తుంది.. అని వీరికి క్లాస్ తీసుకున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి జరగాల్సిన కృషిపైనా వీరికి హితబోధ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని, సాధ్యమైనంత వరకు నేతలు అందరూ కలిసి వెళ్లాలని సూచించారు. జిహెచ్ఎంసిలో సైతం డివిజన్ల వారీగా సమావేశాలు జరపాలని, నారాయణ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగడం ఖాయం కాబట్టి ఆ ఎన్నికకు కూడా సిద్ధం కావాలని టీ టీడీపీ నేతలకు బాబు వివరించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి వరంగల్ ఉప ఎన్నికల్లో టీడీపీకి టికెట్ ఇవ్వమని మిత్రపక్షమైన బీజేపీ అడుగుతానని బాబు వీరికి హామీ ఇచ్చారు. అయితే, ఏ పార్టీ అభ్యర్ధి పోటీ చేసినా, ఎన్డీయే అభ్యర్ధిగా ఉంటారని, విజయం కోసం శ్రమించాలని వీరికి సూచించారు. మరో వైపు వరంగల్‌కు చెందిన పార్టీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్లోకి వెళుతున్న అంశాన్నీ చంద్రబాబు ఆరా తీశారు. ఆమె పార్టీ మారడం వల్ల నష్టమేమీ ఉండదని తెలంగాణ నాయకులు బాబుకు సమాధానం చెప్పారని సమాచారం. వచ్చే నెల 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించాలని, ఆ సమావేశానికి తాను హాజరవుతానని బాబు చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీని పటిష్టం చేయడంపైనే దృష్టి పెట్టాలని వీరికి హిత బోధ చేశారు. రేవంత్‌కు దొరకని అపాయింట్మెంట్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శనివారం జరిగిన సమావేశంలో పార్టీ నాయకుల మధ్య జరిగిన గొడవ, నేతల మధ్య ఉన్న విభేదాలపై చంద్రబాబు అసహనం ప్రద ర్శించారని తెలిసింది. తెలంగాణ నాయకులంతా కలిసి పాల్గొనాల్సిన ఈ సమావేశానికి ముందే సోమవారం రేవంత్‌రెడ్డి విజయవాడకు చేరుకుని బాబు అపాయింట్మెంటు కోరారని, ఆయన నిరాకరించారని సమాచారం. మంగళవారం సమావేశానికి ముందు కూడా వ్యక్తిగతంగా ఒక్కడే కలిసే ప్రయత్నం చేసినా, ఎర్రబెల్లి, రమణలతో కలిసి రావాలని రేవంత్‌కు వెనక్కి పంపినట్లు చెబుతున్నారు. ఈ ముగ్గురు నాయకులను కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్నట్లు సమచారం. కాగా, బాబుతో జరిగిన సమావేశంలో తెలంగాణ అధ్యక్షుడు గడిచిన నెల రోజుల్లో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలు, బంద్, ఢిల్లీ పర్యటన, ఆందోళన కార్యక్రమాల గురించి వివరించారని పార్టీ వర్గాలు తెలిపాయి.