టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంరతం యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్‌కు స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. బ్యాటింగ్‌లో కాస్త ఇబ్బంది పడినట్లుగా కనిపించిన ఇషాన్ 42 బంతుల్లో 35 పరుగులు చేశాడు. మంచి ఇన్నింగ్స్ అయినప్పటికి టి20 స్పెషలిస్ట్ అని చెప్పుకున్న ఇషాన్ నుంచి ఈ ప్రదర్శన రావడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా స్పిన్ ఆడడంలో ఇషాన్ బాగా ఇబ్బంది పడ్డాడు. అందుకే రోహిత్ ఇషాన్‌కు బ్యాటింగ్ టెక్నిక్ గురించి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. రోహిత్ క్లాస్ తీసుకోవడంపై మరొక కారణం కూడా ఉంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మెగావేలంలో ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ రూ. 15.25 కోట్లుకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ ఓపెనర్‌గా రాబోతున్నాడు. అదే ముంబై ఇండియన్స్‌కు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఓపెనింగ్ కాకపోతే మిడిలార్డర్‌లో ఎలా ఆడాలనేదానిపై రోహిత్.. ఇషాన్‌కు బ్యాటింగ్ టెక్నిక్ వివరించాడు.
చదవండి: అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం.. అదరగొట్టాడు
ఇక ఇషాన్‌కు క్లాస్ తీసుకోవడంపై రోహిత్ పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ కార్యక్రమంలో పేర్కొన్నాడు. ''ఇషాన్ కిషన్ బ్యాటింగ్ బాగానే ఉన్నప్పటికి స్పిన్ బౌలింగ్ ఆడడంలో ఇబ్బంది పడ్డాడు. టీమిండియా జట్టులో ఓపెనర్.. మిడిలార్డర్‌లో ఎక్కడ వచ్చినా సరే ఎలా ఆడాలో అతనికి వివరించా. ఇండియన్ జెర్సీ వేసుకొని ఆడుతున్నామంటేనే సహజంగా ఒత్తిడి నెలకొంటుంది. ఇషాన్‌కు ఆ ఒత్తిడి మరింత ఎక్కువైంది. అందుకే అతడికి క్లాస్ తీసుకున్నా. ముందు నీలో ఒత్తిడి తొలగించి స్ట్రైక్ రొటేట్ చేయడంపై ఎక్కువ దృష్టి సారించాలని'' పేర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా వెస్టిండీస్‌పై తొలి టి20లో 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 158 పరుగుల లక్ష్యతో బరిలోకి దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. రోహిత్ శర్మ(40), ఇషాన్ కిషన్(35), సూర్యకుమార్(34 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్(24 నాటౌట్) రాణించారు. అంతకముందు వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 ఫిబ్రవరి 18(శుక్రవారం) జరగనుంది.
చదవండి: జోష్ మీదున్న టీమిండియాకు దెబ్బ.. రెండో టి20కి ఆ ఇద్దరు డౌటే!
Comments
Please login to add a commentAdd a comment