Special groups
-
సోషల్ మీడియాకు అండగా ‘వైఎస్సార్సీపీ’ ప్రత్యేక బృందాలు
సాక్షి,అమరావతి: సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ తరపున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ బృందాలు పనిచేస్తాయి. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్‌సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ బృందాలు పనిచేస్తాయి. -
ఆన్లైన్ స్నేహాలు
మెసేజ్‌లతో పెరుగుతున్న అనుబంధాలు వాట్సప్, ఫేస్‌బుక్‌ల్లో ప్రత్యేక గ్రూపులు నేడు ఫ్రెండ్షిప్ డే సిద్దిపేట రూరల్ / జోగిపేట: స్నేహం.. ఓ మధురానుభూతి. అది కలకాలం నిలిచిపోతుంది. దీనికి గుర్తుగా ఓ మంచి బహుమతి ఇవ్వాలని స్నేహితులు ఆరాటపడుతుంటారు. ఏటా ఆగస్టు తొలి ఆదివారం జరుపుకొనే ఫ్రెండ్‌షిప్‌డే కోసం చిన్నపెద్దా ఎదురుచూస్తుంటారు. స్నేహనికి మధురస్మృతిగా చక్కటి బహుమతితో ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతారు. కానీ నేడు కొంచెం ట్రెండ్ మారింది. సోషల్ మీడియా అనుబంధాలకు వేదికగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరికి అరచేతిలోనే టెక్నాలజీని వాడేస్తున్నారు. వాట్సప్, ఫేస్బుక్ గ్రూపులు ఉండడంతో ప్రతి పండుగకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఒక్క మెసేజ్ పోస్టుతో స్నేహితులందరికి శుభాకాంక్షలను సులువుగా చెపుతున్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... ఫ్రెండ్షిప్ బాండ్లు కడతారు.. ఎస్.ఎం.ఎస్ లతో గ్రీటింగ్స్ చెబుతారు.. కుదిరితే కవ్పు కాఫీ, కాకుంటే కబుర్లు చెవ్పుకుని సరదాగా గడువుతారు. స్నేహితులు లేని మనిషి జీవితం ఒయాసిస్ లేని ఎడారిలాంటిదనే చెప్పవచ్చు. ’నీ వెంట నేనున్నా’ అనే భరోసా ఇచ్చేవాడే స్నేహితుడు. ఓటమిలో ఓదార్చేవాడే స్నేహితుడని చెప్పవచ్చు. ప్రస్తుత హైటెక్ యుగంలో.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి చేతులో వాట్సప్, ఫేస్బుక్ ఉంటుంది. వీటికి భలే క్రేజీ ఉంది. ఈ రోజుల్లో చాలా మంది ఆన్లైన్ స్నేహితులే ఎక్కువగా ఉన్నారు. వాట్సప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ప్రతి ఒక్కరు పలకరించుకునే అవకాశం లభిస్తుంది. స్నేహితులు వాట్సప్, ఫేస్‌బుక్‌ల్లో ప్రత్యేకంగా గ్రూపులను ఏర్పాటు చేసుకుంటున్నారు. గ్రూపుల్లో మంచి, చెడులను పోస్టు చేస్తున్నారు. పోస్టులకు లైక్‌లు కొడుతూ, షేర్లు చేస్తూ అభిరుచులను పంచుకుంటున్నారు. సిద్దిపేటలో 2005లో టెన్త్ క్లాస్ పాసైన విద్యార్థులంతా కలిసి ‘స్కూల్‌మెట్స్’ అని వాట్సప్ గ్రూపును క్రియేట్ చేశారు. ఇందులో ఒకరినొకరు పలకరిస్తూ, స్నేహభావాన్ని పంచుకుంటున్నారు. స్నేహితులతో, బంధువులతో, కుటుంబ సభ్యులతో, ఉద్యోగులు ఇలా గ్రూపులను ఏర్పాటు చేసుకుని స్నేహ సౌరభాన్ని ఆన్లైన్ వేదికగా కొనసాగిస్తున్నారు. ఒక్క స్మార్ట్ ఫోన్లో సుమారు 10కి పైగానే గ్రూపులు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. స్నేహంలో స్వార్థం ఉండకూడదు ఆపదలో ఉండి ధైర్యాన్ని ఇచ్చే వాడే నిజమైన స్నేహితుడు. స్వార్థంతో స్నేహం చేయడం మోసమే. స్నేహితుల మధ్య పెరిగేది స్నేహం పెరగాలే తప్ప తగ్గకూడదు. ఓటమిలోనూ నీవెంట నేనున్నానంటూ ధైర్యమివ్వాలి. ఏళ్ల తరబడి స్నేహం చేసిన వారు ఈ సమాజంలో ఉన్నారు. కష్ట, సుఖాలలో కలిసి జీవించే వాడినే స్నేహితులుగా ఎన్నుకోవడం మంచిది. - అశోక్, చేనేత సహకార సంఘం చైర్మన్ నాకు తల్లిదండ్రులు స్నేహితులే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు స్నేహితులే. నేను పుట్టినప్పటి నుంచి అంధుడిగా ఉండడం వల్ల నా ఆలనా పాలనా చూస్తూనే స్నేహితులుగా నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. తల్లిదండ్రుల కంటే స్నేహితులంటేనే నాకు తృప్తి ఉంటుంది. స్నేహితుల కంటే ఎక్కువగా అన్ని విషయాల్లోనూ నాతో చర్చిస్తుంటారు. భగవంతుడు మరో జన్మలో కూడా ఇలాంటి తల్లిదండ్రులనే ఇవ్వాలని కోరుకుంటాను. - విజయ్‌కుమార్, లెక్చరర్ -
హుదూద్ నష్టం రూ. 65 వేల కోట్లు!?
ప్రభుత్వ, ప్రైవేటు, సేవా రంగాల ఆస్తులకు కలిగిన నష్టం విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలను కుదుపు కుది పేసిన హుదూద్ తుపాను కలిగించిన నష్టం అంచనాలకు అందకుండా ఉంది. నష్టా న్ని అంచనాకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తోంది. కాగా హుదూద్ వల్ల కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, సేవా రంగ, ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టంపై ఇప్పటికే ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చింది. తుపాను వల్ల విశాఖపట్నంతోపాటు నాలుగు జిల్లాల్లో 44 మండలాలు దెబ్బతిన్నాయి. అన్నింటా కలిపి దాదాపు రూ.65వేలకోట్లకుపైగా భారీ నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. -
కోతలకు కత్తెర!
- విద్యుత్ సరఫరా మెరుగుదలపై దృష్టి సారించిన ఈపీడీసీఎల్ - సమూల ప్రక్షాళనకు ప్రతిపాదనలు - రంగంలోకి ప్రత్యేక బృందాలు సాక్షి, ఏలూరు : జిల్లాలో విద్యుత్ కోతలకు కత్తెర పడనుందా.. అవుననే అంటున్నారు తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) అధికారులు. వారు చెప్పేదానిని బట్టిచూస్తే పూర్తిగా కాకపోరుునా.. కొంతమేరైనా విద్యుత్ కోతలు తగ్గే అవకాశాలు లేకపోలేదు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిచేయడం ద్వారా కోతలను చాలావరకు నివారించవచ్చని ఈపీడీసీఎల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తు మొదలుపెట్టామని చెబుతున్నారు. ఇవీ లోపాలు ఓ పక్క విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంటే మరోపక్క వినియోగం పెరిగిపోతోంది. దీంతో కోత లు విధించడం అనివార్యమవుతోంది. అయితే విద్యుత్ కొరత వల్ల వచ్చే కోతల కంటే స్థానిక సమస్యలు, లోపాల వల విధించే కోతలే ఎక్కువగా ఉంటున్నాయి. సబ్‌స్టేషన్ నుంచి వినియోగదారుడికి విద్యుత్ చేరేలోపు చాలావరకూ వృథా అవుతోంది. పాడైన లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వల్ల లో-ఓల్టేజీ సమస్య తలెత్తుతోంది. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎయిర్ బ్రేక్ స్విచ్‌లు లేకపోవడంతో బ్రేక్‌డౌన్ ఇబ్బం దులు తలెత్తుతున్నారు. ఫలితంగా మెరుగైన విద్యుత్‌కు నోచుకోక వినియోగదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఈ సమస్యపై తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) దృష్టి సారించింది. ప్రత్యేక బృందాలను నియమించి జిల్లావ్యాప్తంగా లైన్లు, ఫీడర్ల తనిఖీలు నిర్వహిస్తోంది. లోపాల విషయంలో సమగ్ర ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వృథాకు అడ్డుకట్ట ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 1.40 కోట్ల యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. కోటా తక్కువగా ఇవ్వడంతో గంటల తరబడి కోత విధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాకు వచ్చే ప్రతి యూనిట్‌ను వృథా కానివ్వకుండా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ప్రస్తుతం 196 విద్యుత్ సబ్స్టేషన్లున్నాయి. వాటిపై లోడ్‌ను తగ్గించేందుకు, విద్యుత్ సరఫరాలో హై-ఓల్టేజీ, లో ఓల్టేజీ సమస్యలు (లైన్‌లాస్) తగ్గించి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఈపీడీసీఎల్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందుకు జిల్లాలో కొత్తగా 27 సబ్స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ పనులు చేయడానికంటే ముందు విద్యుత్ వృథాను అరికట్టి సరఫరా మెరుగుపరచాలని భావిస్తున్నారు. విస్తృత తనిఖీలు ఇద్దరు సభ్యులు గల 100 ప్రత్యేక బృందాలు జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తున్నాయి. 1,189 ప్రాంతాల్లో లో-ఓల్టేజి సమస్యలు ఉన్నట్లు ఇప్పటివరకూ నిర్వహించిన తనిఖీల్లో తేలింది. 178 ఫీడర్లపై గల వ్యవసాయ విద్యుత్ సర్వీసులను ఇతర సర్వీసుల నుంచి వేరు చేయాల్సి ఉందని గుర్తించారు. 331 ఎయిర్ బ్రేక్ (ఏబీ) స్విచ్‌లను పాక్షికంగా బాగుచేయాలని, 1,020 ఏబీ స్విచ్‌లను లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద కొత్తగా ఏర్పాటు చేయడం ద్వారా బ్రేక్ డౌన్లు ఇతర అవసరాలకు అనుకూలంగా ఉంటుందని తేల్చారు. 33 కేవీ ఫీడర్లపై 27 లైన్లు, 11 కేవీ ఫీడర్లపై 50 లైన్లను ఇంటర్ లింకింగ్ చేయాలని గ్రహించారు. త్వరలోనే వీటి ప్రక్షాళన పనులు చేపట్టనున్నారు. -
‘సార్వత్రికం’పై ప్రత్యేక నిఘా
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు సమస్యాత్మక వ్యక్తులను వెంటాడేందుకు ప్రత్యేక బృందాలు కర్నూలు, న్యూస్‌లైన్: మే 7న నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకోవడంతో ఈ సారి పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. శనివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా మావోయిస్టు, ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలలో నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. పల్లెల్లో పార్టీల వారీగా మద్దతుదారుల జాబితాను ఎస్పీ రఘురామిరెడ్డి సేకరిస్తున్నారు. అలాగే 53 మండలాల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలు సేకరిస్తున్నారు. షాడో పార్టీలే కీలకం.. రానున్న ఎన్నికల్లో షాడో పార్టీలే కీలకం కానున్నాయి. ఈ బృందాలు రౌడీ షీటర్లు, ప్యాక్షనిస్టులు, వివాదాస్పద వ్యక్తుల కదలికలపై పూర్తి నిఘా ఉంచడంతో పాటు ఎప్పటికప్పుడు వారిని నీడలా వెంటాడుతూ పని తీరును అంచనా వేస్తుంటాయి. పరిస్థితి చేయి దాటుతుందని అనుకుంటే వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసేలా వ్యూహం రూపొందిస్తున్నారు. ఇప్పటికే అలాంటి వారిపై కేసులు నమోదయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు అదనపు బలగాలు రప్పించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. కౌన్సెలింగ్, బైండోవర్ల ప్రక్రియ ద్వారా ముందస్తు పూచీకత్తులతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై డేగ కన్ను.. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని బుధవారపేట, ఎర్రబురుజు, వడ్డెగేరి, సాయిబాబా సంజీవయ్యనగర్, గరీబ్‌నగర్, బండిమెట్ట, ఖడక్‌పుర, గనిగల్లీ, కల్లావీధుల్లోని మొత్తం 35 పోలింగ్ స్టేషన్లను ఇప్పటికే సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించారు. ఆళ్లగడ్డలో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎర్రగుడిదిన్నె పోలింగ్‌స్టేషన్ నం.159లో 90 శాతం పైగా ఓట్లు పోల్ కాగా ఒకే వ్యక్తికి 75 శాతం ఓట్లు పోల్ అయినట్లు గుర్తించారు. శ్రీశైలంలోని ఎనిమిది పోలింగ్ కేంద్రాల్లో 70 శాతం పైగా ఎస్సీ, ఎస్టీ ఓటర్లున్నట్లు గుర్తించారు. 108, 109, 131, 137, 139, 140, 152, 173 నంబర్లు గల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. అలాగే వెలుగోడు మండలం మోత్కూరు గ్రామంలో 108 పోలింగ్ స్టేషన్లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రిగ్గింగ్ పాల్పడినట్లు గుర్తించారు. ఎమ్మిగనూరులో 1, మంత్రాలయంలో 2, పత్తికొండ నియోజకవర్గంలో అటికెలగుండు, పందికోన, నలకదుద్ది, బసినేపల్లి, ఎం.అగ్రహారం, బురుజుల, రాంపల్లి, గొందిమడుగుల, జి.ఎర్రగుడి, షెభాష్పురం, పగిడిరాయి, పుల్లగుమ్మి, రత్నపల్లి, బుక్కాపురం, ఎరుకలిచెరువు, గోకులపాడు, చిట్యాల, అమ్మకతాడు ప్రాంతాల్లోని మొత్తం 43 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించారు. నంద్యాలలో 4, బనగానపల్లెలో 2, ఆలూరు నియోజకవర్గంలోని హొళగుంద, నెరిణికి తండా, అరికెరతండా, ఆలూరు టౌన్, మొలగవెల్లి, మొలగవెల్లి కొట్టాల గ్రామాల్లోని 10 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా రిగ్గింగ్ పాల్పడే అవకాశం ఉండడంతో ముందస్సుత చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.