ఆర్కామ్పై ఐటీ కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు!
న్యూఢిల్లీ: రిలయన్స కమ్యూనికేషన్స (ఆర్కామ్)కు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దాఖలు చేసిన ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. మంగళవారం కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, 2006-07 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.1.5 బిలియన్ డాలర్ల (రూ.6,485 కోట్లు) సమీకరణకు సంబంధించి ఫారిన్ కరెన్సీ కన్వెర్టబుల్ బాండ్లను (ఎఫ్సీసీబీ) జారీ చేసింది.
అరుుతే ఈ మొత్తాన్ని ‘అన్ఎక్స్ప్లైన్డ క్యాష్ క్రెడిట్’ (వివరణ ఇవ్వన్ని నగదు వసూళ్ల) కింద పరిగణిస్తూ, దీనిపై ఐటీ శాఖ రూ.4,800 కోట్ల పన్ను డిమాండ్ చేసింది. దీనిని ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్లో ఆర్కామ్ సవాలు చేసింది. కంపెనీకి అనుకూలంగా తీర్పు రావడంతో ఐటీ శాఖ బొంబారుు హైకోర్టును ఆశ్రరుుంచింది. అక్కడా తీర్పు వ్యతిరేకంగా రావడంతో సుప్రీంను ఆశ్రరుుంచింది. ఇప్పుడు అక్కడా పిటిషన్ వీగిపోరుుంది.