దిల్సుఖ్నగర్ పేలుళ్లపై తీర్పు వాయిదా
హైదరాబాద్: 2013 దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసుపై తుది తీర్పును డిసెంబర్13కు వాయిదా వేస్తున్నట్లు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం పేర్కొంది. పేలుళ్ల ఘటనలో 18మంది మరణించగా, 138మంది గాయాలపాలయ్యారు. రియాజ్ భత్కల్, అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, జియ ఉర్ రహమాన్, ఎజాజ్ షేక్ లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
వీరిలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. నిందితులపై దేశద్రోహం, హత్యానేరం, పేలుడు పదార్ధాల యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో 157మంది సాక్షులను విచారించిన కోర్టు.. ఇందుకు సంబంధించిన 502 డాక్యుమెంట్లను పరిశీలించింది.