జగనన్న కోలుకోవాలని...
హైదరాబాద్: ఉక్కు సంకల్పంతో దీక్ష బూనిన జననేతకు యావదాంధ్ర ప్రజ దన్నుగా నిలిచింది. రాష్ట్ర మేలు కోరి ప్రాణాన్ని ఫణంగా పెట్టిన రాజన్న తనయుడికి బాసటగా నిలిచింది. అన్నపానీయాలు ముట్టకుండా ఆరు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న జగనన్న ఆరోగ్యం కుదుటపడాలని దేవుళ్లకు మొక్కుతున్నారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరు సల్పుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.
శ్రీకాకుళం
వైఎస్ జగన్ ఆరోగ్యం మెరుగుపడాలని అరసవెల్లి సూర్య దేవాలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తూర్పుగోదావరి
జననేత కోలుకోవాలని అయినవెల్లి వినాయక ఆలయంలో వైఎస్సార్ సీపీ నేతలు విశ్వరూప్, పిల్లి సుభాష్ చంద్రబోస్, చిట్టబ్బాయి ప్రత్యేక పూజలు చేశారు
కృష్ణా
పెడన నియోజకవర్గ ఇన్ చార్జి ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో జగన్ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మైలవరం నియోజకవర్గ ఇన్ చార్జి జోగి రమేశ్ ఆధ్వర్యంలో ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో పూజలు, ప్రార్థనలు జరిపారు.
అనంతపురం
వైఎస్ జగన్ దీక్ష విజయవంతం కావాలని అనంతపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, ఎర్రి స్వామిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.