క్రిస్మస్కు ‘గ్రాండ్’ వెల్కమ్
ఇటు కనువిందు చేసే క్రిస్మస్ ట్రీ.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన పశువుల పాక సెట్లో క్రీస్తు జనన దృశ్యం.. అటు నోరూరించే వంటకాలు.. ఇలా క్రిస్మస్ వేడుకలకు కాకినాడలోని జీఆర్టీ గ్రాండ్ హోటల్లో స్వాగతం పలికారు. వంద కిలోల వివిధ రకాల డ్రైఫ్రూట్స్తోపాటు వైన్, స్కాచ్, బ్రాందీ తదితర స్పిరిట్స్ కలిపి నెల రోజుల క్రితమే ప్రారంభించిన ప్లమ్ కేక్ గురువారం నాటికి ప్రత్యేక రూపు సంతరించుకుంది. దీనిని జీఆర్టీ సిబ్బంది కట్ చేసి అతిథులకు ప్రత్యేకంగా వడ్డించారు.
ఇక టర్కీ కోడి మాంసంతో తయారు చేసిన రోస్టెడ్ టర్కీ, స్పెషల్ టర్కీ బిర్యానీ సహా ఆరు రకాల మాంసాహార పదార్థాలు భోజనప్రియులను నోరూరించాయి. ఇవి కాకుండా 30 డెసెర్ట్స్ (ఇండియన్ బేకరీ) వంటకాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఇలా సందడిగా ప్రారంభమైన వేడుకల్లో హోటల్ జనరల్ మేనేజర్ ఉమామహేశ్వరి, అకామిడేషన్ మేనేజర్ మారుతిరాజ్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ లక్ష్మణ్, ఫుడ్ అండ్ బేవరేజ్ మేనేజర్ జెఫ్రీ తదితరులు పాల్గొన్నారు. - కాకినాడ