గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం
గుంటూరు: గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
బైపాస్ పై వేగంగా వస్తున్న ఓ కారు ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్ధానికుల సమాచారం మేరకు ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.