Spell Bee competition
-
స్పెల్లింగ్ బీ విజేతగా భారత సంతతి దేవ్ షా
అమెరికాలో ఏటా జరిగే ప్రతిష్టాత్మక స్పెల్లింగ్ బీ పోటీల్లో ఈ ఏడాది భారత సంతతికి చెందిన 14 ఏళ్ల కుర్రాడు దేవ్ షా విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 2023 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ట్రోఫీతో పాటు 50వేల డాలర్ల(మన కరెన్సీలో 41 లక్షల రూపాయలకు పైనే..) క్యాష్ ప్రైజ్ అందుకుని వార్తల్లోకి ఎక్కాడు. psammophile అనే పదానికి కరెక్ట్‌గా స్పెల్లింగ్ చెప్పాడు దేవ్ షా (14). psammophile అంటే డిక్షనరీ మీనింగ్.. ఇసుకలో ఉండే జీవులు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పోటీలో ఈమారు మొత్తం కోటి పది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తుది దశకు చేరుకున్న 11 మందిలో దేవ్ షా కూడా ఒకరు. గత 24 ఏళ్లలో ఈ పోటీల్లో గెలిచిన 22వ దక్షిణాసియా సంతతి వ్యక్తిగా దేవ్ షా నిలవడం గమనార్హం. ‘స్పెల్లింగ్ బీ’ విజేతగా నిలిచినందుకు దేవ్ షా సంబరపడిపోయాడు. ‘‘ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను. నా కాళ్లు ఇంకా వణుకుతున్నాయి’’ అని వ్యాఖ్యానించాడు. ఇక వర్జీనియా రాష్ట్రానికి చెందిన 14 ఏళ్ల షార్లెట్ వాల్ష్ ఈ పోటీలో రెండో స్థానంలో నిలిచింది. దేవ్ తండ్రి దేవల్ 29 ఏళ్ల కిందట అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ఆయన కుటుంబం ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉంటోంది. గతంలో దేవ్ షా రెండుసార్లు ఈ పోటీల్లో పాల్గొన్నాడు. మూడేళ్ల వయసు నుంచే సరైన స్పెల్లింగ్స్ చెప్పడం దేవ్ షా ప్రారంభించాడని, ప్రస్తుతం ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందని దేవల్ సంబురపడిపోతున్నారు. 1925లో అమెరికాలో నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి.. పోటీల్లో ఇండో-అమెరికన్ల ఉత్తమ ప్రదర్శన కొనసాగుతోంది. పోటీల్లో అడిగే కఠినమైన ఆంగ్ల పదాల అక్షర క్రమాన్ని సరిగ్గా చెప్పే వారు విజేతలు అవుతారు. ఎనిమిదవ గ్రేడ్ లోపు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. 2020లో కరోనా కారణంగా పోటీ నిర్వహించలేదు.. తిరిగి 2021లో స్వల్ప మార్పులతో ఈ పోటీలు జరిగాయి. ఇక కిందటి ఏడాది టెక్సాస్‌లో జరిగిన పోటీల్లో హరిణి లోగన్ విజేతగా నిలిచింది. మరో భారత అమెరికన్ విక్రమ్ రాజుపై ఆమె గెలుపొందింది. ఇదీ చదవండి: డేంజర్‌బెల్స్.. ఎటు చూసినా రెడ్ సిగ్నల్స్ -
సాక్షి మ్యాథ్స్ బీ తెలంగాణ ఫైనల్స్ కేటగిరి 1
-
సాక్షి మ్యాథ్స్ బీ కేటగిరి 2 గ్రాండ్ ఫైనల్స్
-
స్పెల్ 'బీ' రెడీ
స్కూల్ఎడ్యుకేషన్ స్పెల్లింగ్ బీలో.. ‘బీ’ అంటే తేనెటీగ అని అర్థం. ఎలాగైతే తేనెటీగ అనేక పుష్పాల నుంచి మకరందాన్ని సేకరిస్తుందో.. అలాగే విద్యార్థులు అక్షరాలను కూర్చి పదం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడంతా ఇంగ్లిష్ చదువులమయం. ఇంగ్లిష్ రాకుంటే భవిష్యత్ లేదనుకునే పరిస్థితి. నిజానికి ఇంగ్లిష్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కమ్యూనికేషన్‌కు ఉపయోగించుకోవచ్చు. అది దాని ప్రత్యేకత. ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, ఉన్నత వ్యక్తులతో మాట్లాడాలంటే ఇంగ్లిష్ అత్యవసరం. అందుకే ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికే కార్పొరేట్ కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందువల్లే ఇంగ్లిష్ చదువులకు ఆదరణ పెరిగింది. ఇంగ్లిష్ వొకాబులరీపై పట్టు సాధించేందుకు స్పెల్లింగ్ బీ (స్పెల్ బీ) పోటీలు తోడ్పడతాయి. స్పెల్లింగ్ బీ అనేది ఇంగ్లిష్ పదాలకు సంబంధించిన ఒక పోటీ. ఇందులో పృచ్ఛకులు (ప్రశ్నలు అడిగేవారు) అడిగిన ఇంగ్లిష్ పదానికి విద్యార్థులు తప్పులు లేకుండా స్పెల్లింగ్ చెప్పాల్సి ఉంటుంది. ఈ పోటీలు మొదట అమెరికాలో జరిగాయి. అమెరికాలో జాతీయ స్పెల్లింగ్ బీ పోటీలను 1925లో ప్రారంభించారు. ఈ పోటీల్లో ఇటీవలి కాలంలో భారత సంతతి విద్యార్థులే రాణిస్తున్నారు. భారత్‌లో కూడా ప్రస్తుతం ఈ పోటీలు విరివిగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రైవేటు స్కూళ్లలో స్పెల్ బీ పోటీలు నిర్వహిస్తున్నారు. సాక్షితోపాటు మీడియా, కార్పొరేట్ సంస్థలు కూడా ఈ పోటీలు నిర్వహిస్తూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నాయి. ఉపయోగాలెన్నో.. * స్పెల్ బీ పోటీల వల్ల ముఖ్యంగా ఇంగ్లిష్ వొకాబులరీ (పదజాలం)పై పట్టు వస్తుంది. ఫలితంగా వారికి ఇంగ్లిష్‌లో రాసే, మాట్లాడే నైపుణ్యాలు పెరుగుతాయని స్పోకెన్ ఇంగ్లిష్ నిపుణులు రామేశ్వర్ గౌడ్ చెబుతున్నారు. * విద్యార్థులు ఇంగ్లిష్‌లో నిపుణులుగా తయారవుతారు. * కేవలం ఒక పదానికి సంబంధించిన స్పెల్లింగ్ మాత్రమే కాకుండా ఆ పదం ఉచ్ఛారణ, నిర్వచనం, మూలం తెలుసుకోవచ్చు. ఈ దిశగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని ప్రభుత్వ పాఠశాల ఇంగ్లిష్ అధ్యాపకులు డి.హనుమంతరావు చెప్పారు. వొకాబులరీని పెంచుకునే మార్గాలు.. * ఎంత చదివితే అంత వొకాబులరీ మీ సొంతం అవుతుంది. ముఖ్యంగా నవలలు, కథలు, మ్యాగజైన్లు, న్యూస్పేపర్లను వీలైనంత ఎక్కువగా చదువుతూ ఉండాలి. వీటిలో కొత్తగా కనిపించిన పదాలను ఒక పుస్తకంలో రాసుకోవాలి. వాటి అర్థాలు, ఉచ్ఛారణను నిఘంటువు సాయంతో తెలుసుకోవాలి. తర్వాత వీలైనన్ని ఎక్కువసార్లు ఆ పదాలను చదవడం ద్వారా ఎప్పటికీ గుర్తుంచుకోవచ్చు. * ఎప్పుడూ మీ వద్ద ఒక ప్రామాణిక ఇంగ్లిష్ నిఘంటువు, థెసారస్ (పర్యాయ పదకోశం) ఉంచుకోండి. రోజూ ఒక కొత్త ఇంగ్లిష్ పదం నేర్చుకోండి. * ఇతరులతో మాట్లాడటం వల్ల కూడా కొత్త పదాలను తెలుసుకోవచ్చు. అలాగే దాన్ని ఎలా ఉచ్చరిస్తున్నారో కూడా తెలుస్తుంది. -
స్పెషల్ సిస్టర్ అండ్ బ్రదర్
ఇంగ్లిష్ పదాలు మేధావులను సైతం తికమకపెడతాయి. ఆ పదాలను స్పెలింగ్తో సహా చెప్పమంటే.. పెద్దలు కూడా నీళ్లు నములుతారు. కానీ, సాక్షి ఇండియా నిర్వహిస్తున్న స్పెల్ బీ పోటీల్లో మాత్రం బుడతలు ఇంగ్లిష్తో చెడుగుడు ఆడుతున్నారు. ఎలాంటి కఠినమైన పదం స్పెలింగ్ అయినా తడుముకోకుండా చెప్పేస్తున్నారు. ఇదే కోవలో విద్యానగర్‌లోని శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఎల్.హ్రిద్యా, ఎల్.రిషభ్ రెడ్డి ప్రతిభ కనబరచి సెమీఫైనల్ చేరుకున్నారు. రెండో తరగతి చదువుతున్న ఆరేళ్ల రిషభ్ కేటగిరీ వన్‌లో, మూడో తరగతి చదువుతున్న హ్రిద్యారెడ్డి కేటగిరి టూలో మాస్టర్లు అడిగే పదాలకు చటుక్కున స్పెలింగ్స్ రాస్తూ ఔరా అనిపిస్తున్నారు. రోజూ ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు, కథల పుస్తకాలు, డిక్షనరీ చదవడం వల్ల స్పెలింగ్స్పై పట్టు పెరిగిందంటారు ఈ చిన్నారులు. సాక్షి ఇండియా ఇచ్చిన స్పెల్ బీ పుస్తకం కూడా ఎంతో హెల్ప్ చేసిందని చెబుతున్నారు. ‘మా అమ్మానాన్నలు శిరీష, వెంకటరామిరెడ్డిల గెడైన్‌స ఎంతో ఉపయోగపడుతుంద’ని తెలిపారు.