సాగర్ భద్రతను పరిశీలించిన ఎస్పీఎఫ్ కమాండెంట్
నాగార్జునసాగర్ భద్రతను ఎస్పీఎఫ్ కమాండెంట్ మాధవరావు శుక్రవారం పరిశీలించారు. ప్రధాన డ్యామ్‌తో పాటు ఎడమ, కుడి కాల్వలు, ఎర్త్‌డ్యామ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. భద్రతా చర్యలపై ఎస్పీఎఫ్ ఆర్ఐని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రంతో పాటు కుడి, ఎడమ కాల్వలపై గల విద్యుదుత్పాదక కేంద్రాల వద్ద చేపట్టిన భద్రత చర్యలను పరిశీలించారు. ఆయన వెంట ఆర్ఐ భాస్కర్, జెన్కో ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ రమేశ్‌బాబు, సిబ్బంది ఉన్నారు.