spices board
-
వెల్లుల్లి కూరగాయ లేదా సుగంధ ద్రవ్యమా? హైకోర్టు ఏం చెప్పిందంటే..
వెల్లుల్లి మసాలాకు చెందిందా, కూరగాయనా అనే సందేహం ఎప్పుడైనా వచ్చింది. కానీ అది పెద్ద చర్చనీయాంశంగా మారి సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారితీసింది. చివరికి హైకోర్టు తీర్పుతో ఆ న్యాయ పోరాటానికి తెరపడింది. వంటగదికి మసాలాకు చెందిన ఈ వెల్లుల్లి విషయంలో హైకోర్టు ఏం పేర్కొంది?. అసలు ఏం జరిగింది అంటే..భారతీయ వంటకాలలో ప్రధానమైన వెల్లుల్లి మధ్యప్రదేశ్‌లో కూరగాయ? లేదా మసాలాకు చెందిందా? అనే వర్గీకరణపై సుదీర్ఘ న్యాయపోరాటానికి కారణమయ్యింది. ఈ వివాదాన్ని ఇటీవలే మధ్యప్రదేశ్ హైకోర్టు పరిష్కరించింది. ఇది రైతులు, వ్యాపారుల పై గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. 1972 వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ చట్టం కారణంగా ఈ వివాదం మొదలయ్యింది. ఇది వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా వర్గీకరించింది. నిర్దిష్ట మార్కెట్లలో దాని అమ్మేలా పరిమితం చేసింది. ఇది రైతులను మరింత సమస్యల్లోకి నెట్టేసింది. వారు వ్యవసాయ మార్కెట్లలో అమ్ముకునే వీలులేక ఇబ్బందులు పడేవారు. దీంతో 2007లో మాంద్‌సౌర్‌కు చెందిన ఒక వెల్లుల్లి వ్యాపారి ఈ వర్గీకరణను సవాలు చేస్తూ, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో వెల్లుల్లిని విక్రయించడానికి అనుమతి కోరడం జరిగింది. పొటాటో ఆనియన్ కమీషన్ అసోసియేషన్ నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, మండి బోర్డు మొదట్లో వెల్లుల్లి విక్రయానికి కొంత వెసులుబాటు కల్పించింది. ఐతే ఎప్పుడైతే వ్యవసాయ మార్కెట్లలో మాత్రమే వెల్లుల్లి విక్రయించాలని మధ్యప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆదేశించారో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అసంతృప్తి చెందిన వ్యాపారులు హైకోర్టుని ఆశ్రయించగా చివరికి రైతులకు అనుకూలంగా తీర్పునిస్తూ..వెల్లులిని ఏ మార్కెట్లో అయినా విక్రయించేందుకు అనుమతిచ్చింది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు డబుల్ బెంచ్ సమర్థించింది, వెల్లుల్లి వ్యవసాయ ఉత్పత్తి హోదాను పునరుద్ఘాటించింది. అయితే, పొటాటో ఆనియన్ కమీషన్ అసోసియేషన్ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ధర్మాసనం దీన్ని తోసిపుచ్చి మరీ వ్యవసాయ లేదా కూరగాయల మార్కెట్లలో వెల్లుల్లిని విక్రయించడానికి రైతులకు వెసులుబాటును మంజూరు చేసింది. అంతలా వివాదం రేకెత్తించిన ఈ వెల్లుల్లితో చేసే వంటకాలేంటో చూద్దామా..వెల్లుల్లి చట్నీఇది ప్రధానంగా వెల్లుల్లి, ఎర్ర మిరపకాయలు, మసాలా దినుసుల మిశ్రమంతో తయారుచేసే ఘాటైన చట్నీ. వెల్లుల్లిని చూర్ణం చేసి, ఆపై మిరపకాయలతో కలిపి పేస్ట్ తయారు చేస్తారు. ఇది తరచుగా చింతపండు, నిమ్మరసం లేదా వెనిగర్‌తో కలిపి పుల్లటి రుచితో ఉంటుంది. ఈ చట్నీని సాధారణంగా పకోరాలు లేదా సమోసాల వంటి స్నాక్స్‌తో పాటుగా వడ్డిస్తారు.వెల్లుల్లి సూప్వెల్లుల్లి సూప్ అనేది ఓదార్పునిచ్చే సువాసనగల వంటకం. దీనిని తరచుగా వెల్లుల్లి రెబ్బలను వివిధ రకాల కూరగాయలు లేదా చికెన్ ఉడకబెట్టిన పులుసుతో మరిగించి తయారు చేస్తారు. రెసిపీని సిద్ధం చేయడానికి, వెల్లుల్లిని ముందుగా వేయించి, ఆపై ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి పదార్థాలతో కలుపుతారు. ఈ వేడెక్కడం సుగంధ సూప్ చల్లని సీజన్లో రోజులో ఏ సమయంలోనైనా ఆస్వాదించడానికి అనువైనది.వెల్లుల్లి ఊరగాయవెల్లుల్లి ఊరగాయ అనేది ఆవాల నూనె, సుగంధ ద్రవ్యాల మిశ్రమంలో మొత్తం వెల్లుల్లి రెబ్బలను మెరినేట్ చేయడం ద్వారా తయారు చేయబడిన స్పైసీ ఊరగాయ. కొన్నిసార్లు వెనిగర్ లేదా నిమ్మరసం కూడా ఉపయోగిస్తారు. వెల్లుల్లి, లవంగాల చూర్ణం కూడా జోడిస్తారు. ఇది అన్నం, రోటీ లేదా పరాఠాల్లో బాగుటుంది. వెల్లుల్లి బ్రెడ్గార్లిక్ బ్రెడ్ అనేది రొట్టెతో కూడిన ఒక ప్రియమైన ఆకలి లేదా సైడ్ డిష్. వెన్న, మెత్తగా తరిగిన వెల్లుల్లి, పార్స్లీ వంటి మూలికల మిశ్రమంతో దీన్ని తయారు చేస్తారు. దీనిలో బయట మంచిగా కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండేలా బ్రెడ్‌ని కాల్చుతారు. గార్లిక్ బ్రెడ్ సాధారణంగా పాస్తా లేదా సూప్‌లతో వడ్డిస్తారు.(చదవండి: 'అరంగేట్రం' చేసిన తొలి నర్తకిగా 13 ఏళ్ల చైనా విద్యార్థిని రికార్డు..!) -
ఎంపీ అర్వింద్ ఇప్పటికీ మభ్యపెడుతూనే ఉన్నాడు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, నిజామాబాద్ : బీజేపీ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘‘కరవుతో అల్లాడిన తెలంగాణ రాష్ట్రం ఇవాళ సుభిక్షంగా ఉంది. కేంద్రంతో కొట్లాడినా ధాన్యం కొనకుంటే రాష్ట్రమే కొంటోంది. మరోవైపు ఉద్యోగాల కల్పన, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మహిళల అభివృద్ధి వంటి ఎన్నో పథకాలను టీఆర్ఎస్ తీసుకువచ్చింది. ఈ జిల్లాలో అబద్ధాలు చెప్పి.. ఒట్టును గట్టుమీద పెట్టిన బీజేపీ నాయకులున్నారు. ఎంపీ అరవింద్‌పై ఇప్పటివరకు నేను ఏమీ మాట్లాడలేదు. కానీ, ఇప్పటికీ ఆయన మభ్యపెడుతూనే ఉన్నాడు. పసుపు బోర్దు ఏర్పాటు కోసం ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్‌కు లేఖ కూడా రాశాం. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇతర ముఖ్యమంత్రుల మద్దతు కూడా తీసుకున్నాము. బాబా రాందేవ్, బాలకిషన్ వంటివాళ్లను కూడా తీసుకువచ్చి వారితో కూడా ఇక్కడ పసుపు బోర్డు ఆవశ్యకతను చెప్పించాం. 2015లో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరింది. ఇలా పలుమార్లు విన్నవించినా కేంద్రంలో చలనం లేదు. 2017లో స్పైస్ బోర్డ్ ఆఫీస్, ఫీల్డ్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్ ఇన్ని తీసుకొచ్చినా.. బీజేపీ మాత్రం సాయమందించలేదు. తానే పసుపు రైతులకు అంతా చేసినట్టు అరవింద్ చెబుతున్నాడు. అరవింద్‌వి పసుపు రైతులకు ఉచిత సలహాలు. 90 వేల మందికి పైగా రైతులు పసుపు పండిస్తే.. ఆయన తీసుకొచ్చిన నిధులు 2 కోట్లు కూడా కాదు. అదే ఈ ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు 50 వేల కోట్లు కేటాయించింది. తెలంగాణ ప్రజలకు నిజమైన సంరక్షణ అందించేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఉత్తరమే రాయలేదంటున్న అరవింద్‌కు మీడియా ముఖంగా మా ప్రభుత్వం రాసిన ఉత్తరాన్ని చూపిస్తున్నా. ఈ మూడేళ్ళలో నాలుకకు మడత లేకుండా అరవింద్ అబద్ధాలు ఆడాడు. అన్ని భాషల్లో హైస్పీడ్ అబద్ధాలు చెప్పడం తప్పితే బీజేపీ చేసిందేమీలేదు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప బీజేపీ ఏమీచేయదు. కావాలంటే కేంద్రంలో బీజేపీ పాలన.. ఇక్కడ టీఆర్ఎస్ పాలనను ప్రజలు పోల్చి చూసుకోవాలి. అబద్ధాలకోరులను ప్రజలు తరిమికొట్టాలి. ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్న అరవింద్.. ఎప్పుడు పసుపు బోర్డు తెస్తాడు.. ఎప్పుడు మద్దతు ధర సాధిస్తాడో చెప్పాలి. మోకాళ్ళ యాత్ర చేస్తారో.. మోకరిల్లుతారోగానీ పసుపు బోర్డు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.. లేకుంటే రైతులే అడుగడుగునా అడ్డుకుంటారు. గ్రూప్ వన్ ఉర్దూ మీడియం పేరిట కొత్త వివాదం లేపకుండా.. కేంద్రం ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తుందో చెప్పాలి. వరికి సంబంధించి మాట్లాడమంటే.. మాట్లాడని రాహుల్.. ఇక్కడ తెలంగాణాలో రైతు సంఘర్షణ సభ పెట్టడంలో అర్థం లేదు. 2014 నుంచి తెలంగాణకు సంబంధించి రాహుల్ గాంధీ ఒక్కమాట కూడా మాట్లాడలేదు’’ అని విమర్శించారు. ఇది కూడా చదవండి: తడిసి ముద్దయిన ధాన్యం.. రైతుల్లో ఆందోళన -
నిజామాబాద్‌లో స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీస్
సాక్షి, న్యూఢిల్లీ: నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఈ అంశంపై పార్లమెంట్ భవనంలో మీడియాతో మాట్లాడారు. ‘నిజామాబాద్ ఎంపీ అభ్యర్థన మేరకు ఆ పట్టణంలో స్పైసెస్ బోర్డు డివిజనల్ ఆఫీస్‌ను అప్‌గ్రేడ్ చేసి రీజినల్ ఆఫీస్ కమ్ ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నాం. నిజామాబాద్‌లో పలు రకాల సుగంధ ద్రవ్యాలు పండుతాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మా కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు వీలుగా ఈ సెంటర్ పనిచేస్తుంది. డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. రెండేళ్లలో ఈ ప్రాంతం నుంచి ఎగుమతులు, ఉత్పత్తులు, నాణ్యత గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. పసుపు, మిర్చిపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఈ ప్రాంతం స్పైసెస్ హబ్‌గా మారుతుంది. టీఐఈఎస్, ఏఈపీ స్కీమ్‌ల ద్వారా మౌలిక వసతులు మెరుగుపరుస్తాం. తెలంగాణలో సుగంధ ద్రవ్యాల పంటల ప్రగతికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. కేంద్ర వ్యవసాయ శాఖ, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖ, వాణిజ్య శాఖల మధ్య ప్రభావవంతమైన సమన్వయం ఏర్పడుతుంది. గతంలో పసుపు బోర్డు గురించి మాట్లాడేవారు. అది చాలా చిన్నది. ఇన్ని అధికారాలు దక్కేవి కాదు. ఇంత సమన్వయం, మంత్రిత్వ శాఖల మద్దతు ఉండేది కాదు. అందుకే ఈ సెంటర్ తెచ్చాం. ఇది రైతుల ఆదాయం రెట్టింపయ్యేందుకు దోహదపడుతుంది. బోర్డుకు ఉండే అన్ని అధికారాలు దీనికి ఉంటాయి. ఈ ప్రాంతంలో టర్మరిక్ క్లస్టర్లు ఉన్నాయి. వాటికి ఈ సెంటర్ అండగా ఉంటుంది’అని వివరించారు. పంటకు ఎక్కువ ధరే లక్ష్యం... నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ... ‘స్పైసెస్ బోర్డు రీజినల్ సెంటర్ కమ్ ఎక్స్టెన్షన్ సెంటర్ ప్రకటన హర్షణీయం. టైస్ స్కీమ్ కింద ఎగుమతుల వృద్ధి, మౌలిక వసతులు పెంచడానికి, క్లస్టర్ స్కీమ్ కింద విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. పసుపు బోర్డు కోసం నిజామాబాద్ రైతులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ బోర్డు వాణిజ్య శాఖకు మాత్రమే పరిమితమవుతుంది. వివిధ శాఖలతో సమన్వయం చేసే అధికారాలు ఉండవు. రైతుల ఆదాయం రెట్టింపయ్యేందుకు మోదీ ప్రభుత్వం తెచ్చిన పథకాలేటైస్, క్లస్టర్. పసుపు ఎగుమతులకు అవకాశం పెరగడంతో డిమాండ్ అధికం అవుతుంది. దీంతో రానున్న రోజుల్లో ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది. అంతిమంగా రైతుకు పంట మీద ధర ఎక్కువ రావాలన్నదే మన లక్ష్యం. రైతులు డిమాండ్ చేసిన దాని కంటే కేంద్రం ఎక్కువే ఇచ్చింది’అని పేర్కొన్నారు. రైతులు.. పసుపు బోర్డు అడిగితే సుగంద ద్రవ్యాల బోర్డు ఇవ్వడాన్ని ఎలా చూడాలని మీడియా ప్రశ్నించగా.. ‘అంబాసిడర్ కారు కావాలా, మెర్సిడెస్ బెంజి కారు కావాలా? అని ఆలోచించి బెంజి కారు ఇచ్చింది. పసుపు బోర్డు డిమాండ్ చాలా కాలంనాటిది. అది ఇప్పుడు ఇచ్చినా ప్రభావవంతంగా ఉండదు’అని పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల... నిజామాబాద్‌లోని స్పైసెస్ బోర్డు డివిజనల్ ఆఫీస్‌ను రీజినల్ ఆఫీస్ కమ్ ఎక్స్టెన్షన్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ అదనపు డైరెక్టర్ ఆర్.పి.కంచన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ సెంటర్‌కు డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారని, ఎగుమతుల వృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్పత్తులు, సంబంధిత అంశాలను సమన్వయం చేస్తారన్నారు. అలాగే సుగంధ ద్రవ్యాల బోర్డు డైరెక్టర్(మార్కెటింగ్) రెండేళ్లపాటు ఈ ప్రాంతీయ కార్యాలయం కార్యక్రమాలను ప్రతి నెలా పర్యవేక్షిస్తారని అన్నారు. దానిపై మంత్రిత్వ శాఖకు నివేదిక ఇస్తారని వివరించారు. రైతులను మభ్య పెడుతున్నారు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పసుపు రైతులను మభ్యపెడుతూ మరోసారి మోసం చేయడానికి ఎత్తుగడ వేస్తోందని పసుపు రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు ఆరోపించారు. నిజామాబాద్ కేంద్రంగా మసాల దినుసులు, సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు ఏర్పాటుపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రకటనపై మంగళవారం జిల్లాలోని ఆర్మూర్‌లో కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. -
30న స్పైసెస్ ఎక్స్టెన్షన్ ట్రైనీస్ ఎంపిక పరీక్ష
బాలసముద్రం : స్పైసెస్ బోర్డు–వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో పనిచేసేందు కు స్పైసెస్ ఎక్స్టెన్షన్ ట్రైనీస్ కోసం ఇంటర్వూ్యను ఈనెల 30న నిర్వహించనున్నట్లు బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు. ఈ పోస్టులు ఎస్సీ అభ్యర్థుల కోసం రిజర్వ్ చేశార ని, వివరాల కోసం వెబ్సైట్లో లేదా హన్మకొండ అడ్వకేట్స్‌కాలనీ రోడ్డునంబర్ 4లోని ప్రాంతీయ కార్యాల యంలో సంప్రదించాలని కోరారు.