ఒకీఫ్ స్థానంలో జాక్సన్ బర్డ్!
భారత్‌తో పాటు ఆస్ట్రేలియా జట్టు కూడా గురువారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంది. ధర్మశాల పిచ్ సాధారణంగా పేస్ బౌలింగ్‌కు అనుకూలం కావడంతో ఆసీస్ జట్టు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని భావిస్తోంది. స్పిన్నర్ ఒకీఫ్ స్థానంలో పేసర్ జాక్సన్ బర్డ్‌ను జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
సుదీర్ఘ సమయం పాటు సాధన చేసిన బర్డ్, వార్నర్‌కు బౌలింగ్ వేశాడు. పుణే టెస్టులో 12 వికెట్లతో చెలరేగిన ఒకీఫ్ తర్వాతి రెండు టెస్టుల్లో ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో స్మిత్ అదనపు పేసర్ వైపు మొగ్గు చూపుతున్నాడు. ఆసీస్ తరఫున 8 టెస్టులు ఆడిన బర్డ్ 34 వికెట్లు పడగొట్టాడు.