సాహస అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం
ఎల్బీ స్టేడియం, టెన్జింగ్ నార్గే జాతీయ సాహస అవార్డులకు అర్హులైన అభ్యర్థుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రంలో 31 డిసెంబరు 2012 నుంచి సాహస క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులతోపాటు వికలాంగులైన క్రీడాకారుల కూడా ఈ అవార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చునని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఒక ప్రకటనలో తెలిపింది.
ఆస్తకిగల అభ్యర్థులు తమ వివరాలతో ఈనెల 10వ తేదీలోగా ఎల్బీ స్టేడియంలోని శాప్ కార్యాలయానికి తమ దరఖాస్తులను పంపించాలి. ఇతర వివరాలకు శాప్ పీఆర్ఓ (98666-94536)ను సంప్రదించవచ్చు