sports clubs
-
AP: గ్రామీణ క్రీడల్లో నవశకం..
నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): జిల్లా క్రీడాభివృద్ధిలో వైఎస్ఆర్ క్రీడాక్లబ్‌ల పాత్ర కీలకం కానుంది. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ క్రీడాక్లబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వివిధ పర్వదినాలు, ఉత్సవాల సమయంలో పోటీలు నిర్వహించాలని తలపెట్టింది. పెద్ద వయస్సు వారిని వాకింగ్, సైక్లింగ్ తదితర అంశాల్లో ప్రోత్సహించాలని సంకల్పించింది. దీనిపై క్రీడాప్రాధికార సంస్థ(డీఎస్ఏ) ఆధ్వర్యంలో రూపొందించిన యాప్‌ను కలెక్టర్ కృతికాశుక్లా ఇటీవల ఆవిష్కరించారు. ఈ యాప్‌లో ఈ నెల 31 వరకూ క్లబ్‌ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. జిల్లాలో 21 మండలాల్లోని 335 గ్రామ పంచాయతీల్లో క్లబ్‌ల ఏర్పాటుకు డీఎస్ఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బాధ్యతలు అప్పగింత కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో సచివాలయ అడ్మిన్ కార్యదర్శులకు క్లబ్‌ల బాధ్యత అప్పగించారు. వయో వృద్ధుల కోసం జగనన్న వాకింగ్ క్లబ్‌లు ఏర్పాటు చేస్తారు. మహిళలకు స్కిప్పింగ్, టెన్నికాయిట్, త్రో బాల్ తదితర పోటీలు నిర్వహిస్తారు. సామాజిక భవనాలు, పంచాయతీ హాళ్లలో వసతులు గుర్తించి చెస్, క్యారమ్స్, ఉచిత యోగా శిక్షణ నిర్వహిస్తారు. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శి ప్రతీనెలా స్పోర్ట్స్ క్లబ్ సమావేశం నిర్వహిస్తారు. కబడ్డీ, వాలీబాల్, రబ్బర్‌బాల్‌తో క్రికెట్ వంటి అనువైన క్రీడలు ఆడిస్తారు. ఎన్నారైలు, దాతలు, వ్యాపారులు, ఉద్యోగుల నుంచి క్రీడాపరికరాలు సమకూర్చుకుంటారు. ఆరోగ్యానికి బాట క్రీడలు, వ్యాయామం, వినోద కార్యక్రమాల్లో అందరూ పాల్గొనేలా అవగాహన కల్పించి, తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం స్పోర్ట్స్ క్లబ్‌ల లక్ష్యం. క్లబ్‌ల రిజి్రస్టేషన్ ఈ నెల 31 లోపు పూర్తిచేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదివారం ఆదేశాలు అందాయి. శ్రీనివాస్ కుమార్, చీఫ్ కోచ్, డీఎస్ఏ, కాకినాడ -
జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లు.. గ్రామాలకు క్రీడా పండుగ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతోంది. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించడంతో పాటు వారిని వెలుగులోకి తీసుకురావడానికి ‘జగనన్న స్పోర్ట్స్ క్లబ్’ల పేరిట క్రీడాభివృద్ధికి శ్రీకారం చుట్టింది. క్రీడలపై అవగాహన పెంపొందించేలా సచివాలయ ఉద్యోగుల్లో ఒకరికి ప్రత్యేక జాబ్ చార్ట్‌ను కేటాయిస్తూ గురువారం మార్గదర్శకాలు (జీవోఆర్టీ నంబర్ 84, 85) విడుదల చేసింది. ప్రతి నెలా క్రమం తప్పకుండా, ముఖ్యమైన తేదీల్లో స్థానికంగా పోటీలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. స్థానిక పాఠశాలలు, కళాశాలల్లోని పీడీ, పీఈటీలకు కో–ఆరి్డనేటర్లుగా బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) పర్యవేక్షణలో ఈ స్పోర్ట్స్ క్లబ్‌లను నిర్వహించనున్నారు. పక్కా ప్రణాళికతో.. ఒక్కో క్రీడకు ఒక్కో క్లబ్ ఏర్పాటు చేసుకునేలా.. మొత్తం గ్రామంలో 25 క్రీడాంశాలకు పైబడి క్లబ్బులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ప్రతి స్పోర్ట్స్ క్లబ్బు అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి, పాలకమండలి సభ్యులతో కార్యకలాపాలు సాగించేలా రూపకల్పన చేసింది. మూడునెలలకు ఒకసారి మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిల్లో స్పోర్ట్స్ క్లబ్బులు పోటీలు నిర్వహించేలా మార్గదర్శకాల్లో పొందుపరిచింది. శాప్ అధికారులు స్పోర్ట్స్ క్లబ్బుల రిజిస్ట్రేషన్‌ను పక్కాగా ప్రత్యేక యా ప్ ద్వారా చేసే ప్రక్రియను పరిశీలిస్తున్నారు. గ్రామాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో కూడా స్పోర్ట్స్ క్లబ్బులు ఏర్పాటు చేస్తారు. పంచాయతీ, మండల స్పోర్ట్స్ అథారిటీల పర్యవేక్షణ.. గ్రామాల్లోని స్పోర్ట్స్ క్లబ్బులను పంచాయతీ స్పోర్ట్స్ అథారిటీ (పీఎస్ఏ), మండల స్థాయిలో మండల స్పోర్ట్స్ అథారిటీ (ఎంఎస్ఏ) పర్యవేక్షిస్తాయి. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో నిధులు సమకూర్చుకుంటూ ఈ క్లబ్బులు క్రీడా కార్యకలాపాలు కొనసాగిస్తాయి. సర్పంచ్ చైర్మన్‌గా ఉండే పీఎస్ఏలో పంచాయతీ సెక్రటరీ, గ్రామానికి చెందిన జిల్లాస్థాయి క్రీడాకారుడు లేదా క్రీడాభివృద్ధికి ముందుకు వచ్చే దాత, స్థానిక హైసూ్కల్ పీఈటీ సభ్యులుగా ఉంటారు. ఎంపీపీ చైర్మన్‌గా ఉండే ఎంఎస్ఏలో తహసీల్దార్, ఎంఈవో, ఎస్ఐ, మండల ఇంజనీరు, ఎంపీడీవో, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్/హెచ్ఎం, మండలం నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించిన పురుష, మహిళా క్రీడాకారులు (ఒక్కొక్కరు), స్వచ్ఛంద సేవకులు సభ్యులుగా ఉంటారు. వీరు ఆయా గ్రామాలు, మండలాల్లో అవసరమైన క్రీడా వసతులు గుర్తించడంతోపాటు మరుగున పడిన స్థానిక యుద్ధ కళలను కూడా ప్రోత్సహించేలా శాప్‌తో కలిసి పని చేయనున్నారు. పిల్లలు, మహిళలకు ప్రత్యేక క్రీడా పోటీలతో పాటు సీనియర్ సిటిజన్లకు రిక్రియేషన్, వాకింగ్, జాగింగ్ పోటీలు కూడా నిర్వహించనున్నారు. ఈ అథారిటీలు ప్రతి నెలా సమావేశమై స్పోర్ట్స్ కాలెండర్ అమలు తీరుపై ప్రత్యేకంగా సమీక్షించనున్నాయి. మండల, జిల్లా పరిషత్‌లు వాటి నిధుల్లో క్రీడలపై 4 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటి ద్వారా అంతర్ గ్రామాల క్లబ్‌ల క్రీడలను నిర్వహించవచ్చు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది విలేజ్ స్పోర్ట్స్ క్లబ్బులతో మారుమూల పల్లెల్లోని ప్రతిభగల క్రీడాకారులు త్వరగా వెలుగులోకి వస్తారు. ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా వారిని తీర్చిదిద్దవచ్చు. గ్రామాలు, స్కూళ్లు, కళాశాలల వారీగా స్పోర్ట్స్ కబ్బులను ప్రోత్సహిస్తున్నాం. వీటిద్వారా ప్రతి ఒక్కరిలో క్రీడాస్ఫూర్తి పెరుగుతుంది. పూర్తిస్థాయిలో క్రీడాక్లబ్బులు అందుబాటులోకి వస్తే గ్రామాల్లో నిత్యం క్రీడాపండుగ కనిపిస్తుంది. – ఆర్కే రోజా, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి -
క్రీడా సంఘాల ఎన్నికలు పారదర్శకంగా జరగాలి: రాథోడ్
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు చెందిన క్రీడా సంఘాలు తప్పనిసరిగా క్రీడా నియమావళి (స్పోర్ట్స్ కోడ్)ని అమలు చేయాల్సిందేనని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. ‘కోడ్ ప్రకారం ఆయా సంఘాల్లో పారదర్శకంగా ఎన్నికలు జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షకుడి ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలి’ అని రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పష్టం చేశారు. 2011 స్పోర్ట్స్ కోడ్‌కు విరుద్ధంగా నడుచుకున్నందుకు ఇప్పటికే కొన్ని రాష్ట్ర సంఘాల గుర్తింపుని రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా ఏ క్రీడా సంఘమైన వ్యవహరించినా, అక్రమాలు, అవకతవకలకు పాల్పడినా ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని రాథోడ్ వివరించారు. ఆసియా క్రీడలు ముగిశాక కబడ్డీ సమాఖ్య ఎన్నికలపై దృష్టి సారిస్తామన్నారు.. ‘కబడ్డీ పూర్తిగా శరీర సామర్థ్య క్రీడ. దీనికి క్రీడా సామగ్రి కూడా తక్కువే అవసరముంటుంది. ఇలాంటి గ్రామీణ క్రీడ 30 దేశాల్లో ప్రాచుర్యం పొందింది. ఒలింపిక్స్ ఆటగా అడుగులు వేస్తుంది’ అని చెప్పిన రాథోడ్... రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఫేవరెట్ క్రీడ కబడ్డీ అని తన ప్రసంగాన్ని ముగించారు. -
ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను గుర్తించండి
క్రీడా సంఘాలకు మంత్రిత్వశాఖ ఆదేశం న్యూఢిల్లీ: టోక్యోలో 2020లో జరిగే ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే సత్తా ఉన్న క్రీడాకారులను గుర్తించాలంటూ క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా సంఘాలను ఆదేశించింది. ‘ఈ నెల 30లోగా అన్ని సంఘాలు తమ క్రీడాంశాలలో పతకాలు సాధించగల అవకాశం ఉన్నవారిని, వారి కోచ్‌లు, సహాయక సి బ్బందిని గుర్తించి జాబితాను అందజేయాలి. తద్వా రా వచ్చే నాలుగేళ్లు వారికి కావలసిన సౌకర్యాలు, ఆర్థిక సహకారం ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా వచ్చే ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్య పెరుగుతుంది’ అని క్రీడా మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఒకసారి జాబితా అందిన తర్వాత ప్రతి ఆరు నెలలకు క్రీడాకారుల ప్రదర్శనను సమీక్షిస్తారు. ఆ తర్వాత కొత్తవారిని చేర్చుకోవడం, సరైన ప్రదర్శన లేనివారిని తొలగించడం లాంటి కార్యక్రమం చేపడతారు. ఐఓఏలో రాజీ: కొంతకాలంగా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో ఉన్న విభేదాలన్నీ సమసిపోయారుు. అధ్యక్షుడు రామచంద్రన్, ఉపాధ్యక్షుడు నరిందర్ బాత్రా రాజీపడ్డారు. రామచంద్రన్‌పై చేసిన ఆరోపణలను బాత్రా ఉపసంహరించుకుంటారు. అలాగే హాకీ ఇండియా అధ్యక్షుడు బాత్రాపై వేసిన పది కోట్ల రూపాయల పరువు నష్టం దావాను అధ్యక్షుడు వెనక్కు తీసుకుంటారు. ఈ మేరకు ఈ ఇద్దరూ ఓ ఒప్పందంపై సంతకం చేసి, దానిని మద్రాస్ హైకోర్టుకు సమర్పించారు. -
28 లోగా క్రీడా సంఘాల వివరాలు అందజేయాలి
వరంగల్ స్పోర్ట్స్ : రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ క్రీడా సంఘాల రిజిస్ట్రేషన్, బైలాస్, ఎన్నికల మినిట్స్, ఎంపికైన అభ్యర్థుల పేర్లు, అనుబంధ సంఘాల పేర్లు, తదితర వివరాలను ఈనెల 28వ తేదీ లోపు సమర్పించాలని డీఎస్డీఓ ఇందిర శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలతో కూడిన ఫారం హన్మకొండ లో ని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని డీఎస్ఏ కార్యాలయంలో లభిస్తుందని పేర్కొన్నారు. క్రీడా సంఘాలు నిర్ణీత ఫారాల్లో తగిన దస్త్రాలను సమర్పించాలని ఆమె కోరారు.