sports day celebrations
-
Andhra Pradesh: క్రీడా ప్రతిభా అవార్డులకు 65 పాఠశాలల ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్: రాష్ట్ర వ్యాప్తంగా 65 జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను క్రీడా ప్రతిభా అవార్డులకు ఎంపిక చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు, స్కూల్ గేమ్స్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తి శుక్రవారం వెల్లడించారు. 2019–20 విద్యా సంవత్సరంలో క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన పాఠశాలలను (జిల్లాకు ఐదు చొప్పున) ఈ అవార్డులకు ఎంపిక చేశామన్నారు. ఈ నెల 29వ తేదీ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయా పాఠశాలలకు అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. మొదటి స్థానంలో నిలిచిన పాఠశాలకు రూ.10 వేలు, రెండోవ స్థానంలో ఉన్న పాఠశాలకు రూ.8 వేలు, మూడో స్థానానికి రూ.6 వేలు, నాలుగో స్థానంలో ఉన్నవాటికి రూ.4 వేలు, ఐదో స్థానంలో ఉన్నవాటికి రూ.2 వేలు చొప్పున నగదు, జ్ఞాపికలు అందజేస్తామన్నారు. అవార్డులకు ఎంపికైన పాఠశాలలు ఇవే: శ్రీకాకుళం జిల్లాలోని అల్లినగరం (ఎచ్చెర్ల మండలం), కేశవరావుపేట (ఎచ్చెర్ల మండలం), ఇప్పిలి (శ్రీకాకుళం), ఫరీద్‌పేట (ఎచ్చెర్ల), లింగవలస (టెక్కలి), విజయనగరం జిల్లాలోని పరది (బొబ్బిలి), టెర్లాం (టెర్లాం), వి.ఆర్.పేట (ఎస్.కోట), అరకితోట (ఆర్.బి.పురం), కస్పా (విజయనగరం), విశాఖపట్నం జిల్లాలోని చంద్రంపాలెం (చినగాడిల్లి), ఏపీటీర్ స్పోర్ట్స్ స్కూల్ (అరకు వ్యాలీ), ఏఎమ్‌జీ ఇంగ్లిష్ మీడియం స్కూల్ (భీమిలి), ఎంజేపీబీసీడబ్ల్యూఆర్ స్కూల్(సింహాచలం), తుమ్మలపాలెం (అనకాపల్లి), తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురపాడు (కరప), గొల్లపాలెం (కాజులూరు), జి.గన్నవరం (ఐ.పోలవరం), గవర్నమెంట్ హైస్కూల్ (కిర్లంపూడి), జి.మామిడ్డ (పెదపూడి), పశ్చిమగోదారి జిల్లాలో ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం స్కూల్ (భీమవరం), కామవరపుకోట(కామవరపుకోట), కె.గోకవరం (గోకవరం), ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్ (పెదవేగి), ఇరగవరం (ఇరగవరం), కృష్ణాజిల్లాలోని ఎస్కేపీవీవీ హిందూ హై స్కూల్ (విజయవాడ). ఉయ్యూరు (ఉయ్యూరు), జెడ్పీ బాలుర హైస్కూల్ (నూజివీడు), జెడ్పీ బాలుర హైస్కూల్ (కొండపల్లి), జెడ్పీ బాలికల హైస్కూల్ (నూజివీడు), గుంటూరు జిల్లాలోని ఏఎంజీ హైస్కూల్ (చిలకలూరిపేట), చింతయ్యపాలెం (కర్లపాలెం), రాజుపాలెం(రాజుపాలెం), ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్ (అచ్చంపేట), ఎస్‌బీపురం (నరసరావుపేట), ప్రకాశం జిల్లాలోని కారేడు (ఉలవపాడు), కంచర్లవారిపల్లి (కనిగిరి), చిర్రికూరపాడు (జరుగుమిల్లి), పాకల (ఎస్.కొండ), పేర్నమిట్ట (ఎస్.ఎన్.పాడు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వింజమూరు (వింజమూరు), శ్రీకొలను (ఏఎస్‌పేట), ఇందుకూరుపేట (ఇందుకూరుపేట), వెంగళరావునగర్ (నెల్లూరు), తెల్లపాడు (కలిగిరి), వైఎస్సార్ జిల్లాలోని ఎంసీ హైస్కూల్ మెయిన్ (కడప), డీబీసీఎస్‌ఎం హై స్కూల్ (ప్రొద్దుటూరు), రమణపల్లి (చెన్నూర్), కేజీబీవీ స్కూల్ (రామాపురం, కడప), ఎస్వీవీ ప్రభుత్వ బాలుర హైస్కూలు (ప్రొద్దుటూరు), కర్నూలు జిల్లాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఆత్మకూరు), ప్రభుత్వ హైస్కూలు (జూపాడు బంగ్లా), భాగ్యనగరం(డోర్నిపాడు), కేజీబీవీస్కూల్ (ఆళ్లగడ్డ), చాగలమర్రి (చాగలమర్రి), అనంతరపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం (బుక్కరాయసముద్రం), అమిద్యాల(ఉరవకొండ), కొనకొండ్ల (వజ్రకరూర్), పులిమిట్టి (లేపాక్షి), రాప్తాడు (రాప్తాడు), చిత్తూరు జిల్లాలోని మదనపల్లి (మదనపల్లి), తరిగొండ (గుర్రంకొండ), ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఇరాల), బీఎన్‌ఆర్‌పేట (చిత్తూరు), నల్లేపల్లి (జి.డి.నెల్లూరు). -
ఫిట్ ఇండియాకు శ్రీకారం..
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇందిరాగాంధీ స్టేడియంలో గురువారం ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడల్లో ఫిట్నెస్ అంతర్భాగమని, అయితే ఫిట్ ఇండియా కార్యక్రమం ఇంతకు మించినదని, ఫిట్నెస్ కేవలం క్రీడలకే కాదని, మన జీవితాల్లో కీలక భాగమని ప్రధాని స్పష్టం చేశారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో శారీరక కదలికలను ప్రోత్సహించడంతో పాటు క్రీడలను యువతలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తారు. కాగా ప్రధాని మోదీ ఇటీవల మన్ కీ బాత్ ప్రసంగంలోనూ ఫిట్ ఇండియా మూవ్మెంట్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో క్రీడలు, మానవ వనరుల అభివృద్ధి సహా 11 మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా పాలుపంచుకుంటున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో క్రీడల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ప్రజలందరి భాగస్వామ్యంతో ఫిట్నెస్ మూవ్‌మెంట్‌ను నిర్వహించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. -
క్రీడోత్సాహం
-
కూతురి కోసం స్టార్ హీరో తంటాలు
-
వైరల్... కూతురి కోసం స్టార్ హీరో తంటాలు
సాక్షి, చెన్నై : స్క్రీన్‌పై యాక్షన్‌తో అభిమానులను ఆకట్టుకునే స్టార్ హీరోలు.. కుటుంబం కోసం కూడా కష్టపడుతూనే ఉంటారు. షూటింగ్‌లకు విరామం దొరికితే చాలూ కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తుంటారు. ఆ జాబితాలో తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ కూడా ఒకరు. కాస్త సమయం దొరికినా భార్య షాలిని, పిల్లలు అనౌష్క, ఆద్విక్ ఆయన సరదాగా గడుపుతుంటారు. తాజాగా కూతురు అనౌష్క స్పోర్ట్స్ డే కోసం అజిత్ స్కూల్లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యాడు. కూతురితో కలిసి హుషారుగా ఆటల్లో పాల్గొన్నాడు. సైకిల్ ట్యూబ్‌తో కలిసి గేమ్‌ను పూర్తి చేయటానికి నానా తంటాలు పడ్డాడు. పక్కనే ఉన్న అనౌష్క తండ్రిని చూసి ‘తల’ పట్టుకుంది. ఇందుకు సంబంధించి ఓ చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని తల అభిమానులు షేర్ల మీద షేర్లు చేస్తూ మురిసిపోతున్నారు. -
ఇంజినీరింగ్ కళాశాల వార్షిక వేడుకలు
-
ఉత్సాహంగా లయోలా స్పోర్ట్స్ డే
విజయవాడ స్పోర్ట్స్ : ఆంధ్ర లయోలా కళాశాల 55వ వార్షిక స్పోర్ట్స్ డే వేడుకలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. ఇంటర్ నుంచి పీజీ వరకు 4వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ వేడుకలకు శాప్ వీసీ అండ్ ఎండీ ఎన్.బంగారురాజు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎంతో కీర్తీ ప్రతిష్టలు ఉన్న లయోలా కళాశాల గొప్పగొప్ప విద్యార్థులను దేశానికి, ప్రపంచానికి అందించిందన్నారు. భవిష్యత్తులో శాప్ నిర్వహించే క్రీడా కార్యక్రమాలు లయోలా కళాశాలతో పంచుకుంటుందన్నారు. ఈ సందర్భంగా జరిగిన అథ్లెటిక్స్‌లో ఫాస్టెస్ రన్నర్లుగా మహిళల విభాగంలో కె.భాగ్యశ్రీ, పురుషుల విభాగంలో జి.రవిచంద్ నిలిచారు. సిబ్బంది, విద్యార్థులకు మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్‌లో విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఫుట్‌బాల్‌తోపాటు పలు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. కళాశాల ఎన్సీసీ (ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్) విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు విశేషంగా ఆకర్షించాయి. కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ ఎస్.రాజు, ప్రిన్సిపాల్ ఫాదర్ జీఏపీ కిషోర్, అధ్యాపకులు పాల్గొన్నారు. క్రీడా నివేదికను కళాశాల పీడీ జేవీ నాగేంద్రప్రసాద్ సమర్పించారు.