
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇందిరాగాంధీ స్టేడియంలో గురువారం ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడల్లో ఫిట్‌నెస్ అంతర్భాగమని, అయితే ఫిట్ ఇండియా కార్యక్రమం ఇంతకు మించినదని, ఫిట్‌నెస్ కేవలం క్రీడలకే కాదని, మన జీవితాల్లో కీలక భాగమని ప్రధాని స్పష్టం చేశారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో శారీరక కదలికలను ప్రోత్సహించడంతో పాటు క్రీడలను యువతలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తారు. కాగా ప్రధాని మోదీ ఇటీవల మన్ కీ బాత్ ప్రసంగంలోనూ ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌లో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో క్రీడలు, మానవ వనరుల అభివృద్ధి సహా 11 మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా పాలుపంచుకుంటున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో క్రీడల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ప్రజలందరి భాగస్వామ్యంతో ఫిట్‌నెస్ మూవ్‌మెంట్‌ను నిర్వహించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment