ఉత్సాహంగా లయోలా స్పోర్ట్స్ డే
విజయవాడ స్పోర్ట్స్ : ఆంధ్ర లయోలా కళాశాల 55వ వార్షిక స్పోర్ట్స్ డే వేడుకలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. ఇంటర్ నుంచి పీజీ వరకు 4వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ వేడుకలకు శాప్ వీసీ అండ్ ఎండీ ఎన్.బంగారురాజు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎంతో కీర్తీ ప్రతిష్టలు ఉన్న లయోలా కళాశాల గొప్పగొప్ప విద్యార్థులను దేశానికి, ప్రపంచానికి అందించిందన్నారు. భవిష్యత్తులో శాప్ నిర్వహించే క్రీడా కార్యక్రమాలు లయోలా కళాశాలతో పంచుకుంటుందన్నారు. ఈ సందర్భంగా జరిగిన అథ్లెటిక్స్‌లో ఫాస్టెస్ రన్నర్లుగా మహిళల విభాగంలో కె.భాగ్యశ్రీ, పురుషుల విభాగంలో జి.రవిచంద్ నిలిచారు. సిబ్బంది, విద్యార్థులకు మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్‌లో విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఫుట్‌బాల్‌తోపాటు పలు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. కళాశాల ఎన్‌సీసీ (ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్) విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు విశేషంగా ఆకర్షించాయి. కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ ఎస్.రాజు, ప్రిన్సిపాల్ ఫాదర్ జీఏపీ కిషోర్, అధ్యాపకులు పాల్గొన్నారు. క్రీడా నివేదికను కళాశాల పీడీ జేవీ నాగేంద్రప్రసాద్ సమర్పించారు.