
గేమ్ ఆడుతున్న అజిత్ దృశ్యాలు
సాక్షి, చెన్నై : స్క్రీన్‌పై యాక్షన్‌తో అభిమానులను ఆకట్టుకునే స్టార్ హీరోలు.. కుటుంబం కోసం కూడా కష్టపడుతూనే ఉంటారు. షూటింగ్‌లకు విరామం దొరికితే చాలూ కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తుంటారు. ఆ జాబితాలో తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ కూడా ఒకరు.
కాస్త సమయం దొరికినా భార్య షాలిని, పిల్లలు అనౌష్క, ఆద్విక్ ఆయన సరదాగా గడుపుతుంటారు. తాజాగా కూతురు అనౌష్క స్పోర్ట్స్ డే కోసం అజిత్ స్కూల్లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యాడు. కూతురితో కలిసి హుషారుగా ఆటల్లో పాల్గొన్నాడు. సైకిల్ ట్యూబ్‌తో కలిసి గేమ్‌ను పూర్తి చేయటానికి నానా తంటాలు పడ్డాడు. పక్కనే ఉన్న అనౌష్క తండ్రిని చూసి ‘తల’ పట్టుకుంది.
ఇందుకు సంబంధించి ఓ చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని తల అభిమానులు షేర్‌ల మీద షేర్‌లు చేస్తూ మురిసిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment