రాజన్న వెలుగులు
జి.సిగడాం, న్యూస్‌లైన్: మండలంలోని గంగన్నదొరపాలెం-దేవర పొదిలాం గ్రామాల మధ్య పెద్దగెడ్డ ఉంది. వేసవి కాలంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం దేవరపొదిలాం, నిమ్మలవలస, వెంకటాపురం గ్రామాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండలం గంగన్నదొరపాలెం, పెనసాం, నడిమివలస, సేతుభీమవరం, ఎస్పీఆర్ పురం తదితర గ్రామాల ప్రజలు గెడ్డలోంచే రాకపోకలు సాగించేవారు.
వర్షాకాలమైతే వారి కష్టాలు వర్ణణా తీతం. వంతెన లేకపోవడంతో దగ్గరలో కనిపిస్తున్న గ్రామానికి చేరుకోవాలంటే కిలోమీటర్ల దూరం ప్రయూణించాల్సిన దుస్థితి. ప్రయూణ వ్యయం తడిసిమోపెడయ్యేది. వంతెన నిర్మించి కష్టాలు తీర్చాలంటూ తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తిచేశారు. స్థానిక టీడీపీ నేతల సహాయంతో సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గోడు వినిపించారు. ఫలితం శూన్యమే. వీరి కష్టాలు గురించి చంద్రబాబు కనీసం స్పందించలేదు కూడా. దీనిని దృష్టిలోపెట్టుకుని 2004, 2009 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధిచెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి పాలనా పగ్గాలు అందించారు. ఆయన వద్ద సమస్యను విన్నవించారు.
దీంతో మహానేత ప్రజల ప్రయూణ కష్టాలను గుర్తించారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు నుంచి వివరాలు సేకరించారు. గెడ్డపై వంతెన నిర్మాణనాని అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని కోరుతూ ఆ మేరకు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేశారు. అంతే... వంతెన నిర్మాణం పూర్తరుు్యంది. దశాబ్దాల తరబడి ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రస్తుతం రాజాం నుంచి రణస్థలం వరకు బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడంతో రెండు జిల్లాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సౌకర్యాలు కొనసాగించాలంటే రానున్న ఎన్నికల్లో రాజన్నరాజ్యమందించేవారికే పట్టం కట్టాలన్న నిశ్చయంతో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు.