breaking news
spurious liquor case
-
ఈ ప్రశ్నలకు బదులేదీ.?
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం మాఫియా కేసును టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టించే కుతంత్రాలకు పదును పెడుతోందన్నది పక్కాగా స్పష్టమవుతోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న జనార్దన్‌రావు మాట్లాడిన వీడియో మీడియాకు విడుదల కావడం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. అంతే కాదు.. పెద్దల పాత్ర, దర్యాప్తు పేరిట పోలీసుల అక్రమాలను బయటపెట్టింది. జనార్దన్‌రావు టీడీపీ నేతలకే అత్యంత సన్నిహితుడని మరోసారి తేటతెల్లమైంది. తాజా పరిణామాలను విశ్లేషిస్తూ రాజకీయ పరిశీలకులు ప్రభుత్వానికి సంధిస్తున్న ప్రశ్నలు ఇవీ...1 జనార్దన్‌రావు చంద్రబాబుకు అంతటి సన్నిహితుడే కదా...! 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చినప్పుడు జనార్ధన్‌రావు అక్కడే ఉన్నారు. బీఫాం ఇచ్చేటప్పుడు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులే ఉంటారు. మరి జనార్ధన్‌రావు ఆ సమయంలో చంద్రబాబు, జయచంద్రారెడ్డిలతో ఉండటం దేనికి సంకేతం? అంటే ఆయన చంద్రబాబు, జయచంద్రారెడ్డిలకే సన్నిహితుడనే కదా. మరి ఆయన వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్‌కు సన్నిహితుడు అన్న ప్రభుత్వ వాదన పూర్తిగా కట్టు కథే కదా!2 నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జనార్ధన్‌రావు ఓ కార్పొరేట్ పారిశ్రామికవేత్త తరహాలో దర్జాగా గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఆయన ధీమా వెనుక దన్ను ఎవరు? కేసు నుంచి బయటపడేస్తామని ముఖ్యనేత హామీ ఇచ్చిన ధీమాతోనే కదా ఆయన అంత దర్జాగా వచ్చారు?3 నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్నప్పటికీ విదేశాల్లో ఉన్న జనార్ధన్‌రావు హడావుడిగా ఎందుకు ఆంధ్ర ప్రదేశ్ చేరుకున్నారు? వెంటనే వచ్చి తాము చెప్పినట్టుగా కట్టు కథలు వల్లె వేయాలన్న ముఖ్యనేత ఆదేశంతోనే ఆయన వచ్చారన్నది సుస్పష్టం. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న జోగి రమేశ్‌కు ఆయన నిజంగానే సన్నిహితుడే అయితే ఇంత హడావుడిగా విదేశాల నుంచి వచ్చే ధైర్యం చేయలేరు కదా? అంటే జనార్ధన్‌రావు వీడియో ద్వారా చెప్పిందంతా ప్రభుత్వ పెద్దలు అల్లిన కట్టు కథ అన్నది స్పష్టమవుతోంది.4 జనార్దన్ రావు తన మొబైల్ ఫోన్‌ను విదేశాల్లో వదిలి రావడం ఏమిటి..? అలా చెప్పమని ఆయన్ను ఆదేశించింది ఎవరు.? ఆ ఫోన్ గుట్టు విప్పితే బయటపడే ప్రభుత్వ పెద్దల జాతకాలు ఏమిటి..? ఇవీ కదా ఈ కేసులో కీలక ప్రశ్నలు. వాటిని కప్పిపుచ్చేందుకే ప్రభుత్వ పెద్దల ఆదేశంతో ఆయన ఫోన్ వదిలి వచ్చారన్నది తేటతెల్లమవుతోంది కదా.5 ములకల చెరువు నకిలీ మద్యం మాఫియాలో కీలక పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని విదేశాల నుంచి రప్పించేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించడం లేదు? ఆయనపై ఎందుకు ఇంకా లుక్ అవుట్ నోటీసు జారీ చేయలేదు? ఆయన రాష్ట్రానికి వస్తే తమ దందా బయటపడుతుందని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారా? కేసు దర్యాప్తు పూర్తిగా పక్కదారి పట్టించేంతవరకు విదేశాల నుంచి రావద్దని ఆయన్ను ఆదేశించిన ముఖ్యనేత ఎవరు?6 నకిలీ మద్యం బయటపడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అసలు ఆ నకిలీ అన్నది ఒక ప్రాంతానికే పరిమితం అన్నట్టు నమ్మించేందుకు యత్నించారు. మరి ఇప్పుడు ఎందుకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం నాణ్యత తనిఖీకి ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టారు? అంటే నకిలీ మద్యం దందా రాష్ట్రం అంతటా విస్తరించిందని ఒప్పుకున్నట్టే కదా...?7 మొదట పోలీసులు, తరువాత జైలు అధికారుల అదుపులో ఉన్న జనార్ధన్‌రావు అసలు ఎల్లో మీడియాతో ఎప్పుడు మాట్లాడారు? ఆయన మాట్లాడిన వీడియో అసలు ఎక్కడ షూట్ చేశారు? ఎవరు షూట్ చేశారు? పక్కనుంచి ఆయనకు డైలాగులు ఎవరు అందించారు? ఆ వీడియోను మీడియాకు ఎవరు విడుదల చేశారు? అంటే.. ఈ కేసులో వాస్తవాలను కప్పిపుచ్చుతూ కొత్త కట్టుకథ వినిపించేందుకే ఆ వీడియో విడుదల చేశారన్నది స్పష్టమవుతోంది కదా. పోలీసుల అదుపులో, జైలు అధికారుల రిమాండ్‌లో ఉన్న వ్యక్తి వీడియో లీకు కావడానికి బాధ్యత ఎవరిది?8 జనార్ధన్‌రావు మాట్లాడిన వీడియో సోమవారం విడుదల కాగా.. అందులోని విషయాలపై ముందుగానే అంటే ఆదివారమే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనప్రాయంగా వివరాలు ఎలా వెల్లడించారు? అంటే ఆ వీడియో విడుదల కానుందని...అందులో ఏం మాట్లాడారన్న సమాచారం ఒక రోజు ముందుగానే ఆయనకు తెలుసా? వైఎస్సార్సీపీ నేతలకు ప్రమేయం ఉందని చంద్రబాబు ఆదివారం చెప్పిన విషయాలే... సోమవారం విడుదల అయిన జనార్దన్ రావు వీడియోలోనూ ఉండటం వెనుక లోగుట్టు ఏమిటి? -
నకిలీ మద్యంపై విచారణకు సిట్
సాక్షి, అమరావతి: నకిలీ మద్యంపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నామని, ఇకపై రాష్ట్రంలో బెల్టుషాపుల్లో మద్యం అమ్మడానికి వీలు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మద్యం నకిలీదో, నాణ్యమైనదో తనిఖీ చేసుకునేందుకు సురక్ష యాప్‌ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. శనివారం రాత్రి ఆయన ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం వ్యవహారంపై ఐదుగురు ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, సీనియర్ ఐపీఎస్ అధికారులు రాహుల్‌దేవ్ శర్మ, కె.చక్రవర్తి, మల్లికా గర్గ్, ఎక్సైజ్ శాఖ నుంచి మరో సీనియర్ అధికారిని ఇందులో సభ్యులుగా నియమిస్తామని చెప్పారు.నకిలీ మద్యంపై సిట్ విచారణలో అన్ని విషయాలు బయటపడతాయన్నారు. ఆఫ్రికాలో నకిలీ మద్యం తయారు చేయడం నేర్చుకుని దాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ ముసుగులో ఇలాంటివి చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. నేరాలు చేసి వాటిని ఎదుటి వారిపై వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నకిలీ మద్యం వ్యవహారాన్ని బయటపెట్టిందే తామని చెప్పారు. ఈ వ్యవహారంలో రాజీ ఉండదని, మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు. ఏ షాపులో మద్యం కొన్నా ఆ బాటిల్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసిన సురక్ష యాప్‌లో స్కాన్ చేస్తే అది ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, ఏ బ్యాచ్ వంటి వివరాలన్నీ వస్తాయని చెప్పారు.ఒకవేళ అది నకిలీదైతే ఎర్రర్ వస్తుందని, వెంటనే ఆ వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. మద్యం షాపుల యజమానులూ ముందే తమ వద్దకు వచ్చిన బాటిళ్లను చెక్ చేసుకుని అమ్మేలా ఈ యాప్‌ను వృద్ధి చేశామన్నారు. సోమవారం నుంచి మద్యం వినియోగదారులకు ఈ యాప్ అందుబాటులో ఉంటుందని, మద్యం షాపుల వారికి 16వ తేదీ నుంచి యాప్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా మద్యం ఇకపై షాపుల్లో మాత్రమే అమ్మే అవకాశం ఉంటుందని, బెల్టు షాపులు ఉండవని చెప్పారు. బెల్టు షాపుల్లో అమ్మితే బెల్టు తీస్తామని హెచ్చరించారు. నకిలీ మద్యం వ్యవహారంపై శవ రాజకీయాలు చేస్తున్నారని, తండ్రి చనిపోతే ఐదేళ్లు శవ రాజకీయాలు చేశారని విమర్శించారు. గత ప్రభుత్వంలో 30వేల మందికి అనారోగ్యం గత ప్రభుత్వంలో అమ్మిన మద్యం వల్ల 30 వేల మంది అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో మద్యం తాగి 27 మంది చనిపోతే కనీసం విచారణ జరపలేదని, పోస్టుమార్టం కూడా నిర్వహించలేదని చంద్రబాబు విమర్శించారు. అలాంటి వాళ్లు ఇప్పుడు రాజకీయాలు చేస్తూ వేరే కారణాలతో చనిపోయిన వారిని నకిలీ మద్యం వల్ల మరణించారని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారాన్ని సీబీఐకి ఇవ్వాలని అంటున్నారని, అలా వేస్తే 10, 11 ఏళ్లు కాలక్షేపం చేయవచ్చని భావిస్తున్నారని పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. నకిలీ మద్యం విషయంలో రాజకీయ కుట్ర కోణం ఉందని, దానికి సంబంధించిన విషయాలు మున్ముందు బయటపెడతామన్నారు. ఇక్కడి నుంచి వెళ్లి ఆఫ్రికాను చెడగొట్టారని, ఆఫ్రికాను కూడా కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. గత ప్రభుత్వంలో డిస్టలరీ నుంచి సరఫరా వ్యవస్థ వరకూ అంతా తమ నియంత్రణలో పెట్టుకుని నేరాలు చేశారని విమర్శించారు. దానిపై జరుగుతున్న విచారణను పక్కదారి పట్టించేందుకే నకిలీ మద్యం ద్వారా డైవర్ట్ చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. -
పక్కావ్యూహం ప్రకారమే..!
రాష్ట్రంలో నకిలీ మద్యం దందా తీగ లాగుతుంటే ఉండవల్లి కరకట్ట బంగ్లాలో డొంక కదులుతోంది. నకిలీ మద్యం వ్యవస్థీకృత దోపిడీకి కర్త, కర్మ, క్రియ ముఖ్య నేతేనని నిగ్గు తేలుతోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ టికెట్ జయచంద్రారెడ్డికి ఇవ్వడం దగ్గర మొదలైన ఈ వ్యవహారం... అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ మద్యం దుకాణాల రద్దు... బెల్టుషాపులకు పచ్చ జెండా... పర్మిట్ రూమ్‌లకు గేట్లెత్తి వ్యవస్థను నియంత్రణలోకి తెచ్చుకుని... నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు నెలకొల్పి షాప్‌లకు సరఫరా చేయడం వరకు అంతా పక్కా వ్యూహంతో సాగిందని స్పష్టమవుతోంది.నాణ్యమైన మద్యం అందిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీ వెనుక విస్తుపోయే ‘ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం డీల్’ వంటి భారీ కుట్ర ఉందని క్రమంగా అర్థమవుతోంది. మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యం నిషా ఎక్కించి రూ.వేల కోట్లు కొల్లగొట్టే కుంభకోణం వెలుగుచూస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో ప్రైవేటు మద్యం దుకాణాల నిర్వహణ వెనుక పన్నాగం ఉందని తేటతెల్లమవుతోంది. సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న నకిలీ మద్యం దందాకు నిరుటి ఎన్నికలకు ముందే కుట్ర పన్నారు. అధికారంలోకి రాగానే దోపిడీ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇస్తే ‘‘ఆఫ్రికా మోడల్’’ నకిలీ సరుకు దందాను ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టి ముఖ్యనేత దోపిడీకి సహకరిస్తానని జయచంద్రారెడ్డి ఎన్నికలకు ముందే ఆఫర్ ఇచ్చారు. పెదబాబు, చినబాబు వెంటనే ఈ డీల్‌కు పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శంకర్యాదవ్లను సైతం పక్కనపెట్టారు. ఖర్చంతా తానే భరిస్తానని శంకర్‌యాదవ్ చెప్పినా టీడీపీ అధినాయకత్వం వినిపించుకోలేదు. ఆయనకు టికెటివ్వాలని కార్యకర్తలు కరకట్ట నివాసం వద్ద ధర్నాలు చేసినా ఒప్పుకోలేదు. క్యాడర్ వ్యతిరేకించినా జయచంద్రారెడ్డికే తంబళ్లపల్లె టికెట్ ఇచ్చారు. దీనివెనుక ఉద్దేశం... ‘‘ఒక సీటు పోయినా ఫర్వాలేదు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాతో భారీ దోపిడీకి పాత్రధారిగా జయచంద్రారెడ్డి ఉంటారు’’ అనే ఆలోచనేనని స్పష్టమవుతోంది. ఇక తాజాగా పెద్ద ఎత్తున బయటపడిన నకిలీ మద్యం ఉదంతంలో జయచంద్రారెడ్డి పాత్ర ఉందని స్పష్టమైనా.. ఆయనను తూతూమంత్రంగా టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంతవరకు అరెస్టు చేయలేదు. దీన్నిబట్టే నకిలీ మద్యం దందాలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం స్థాయిలో ఉందే నిర్ధారణ అవుతోంది. అంతా గుప్పిట పట్టి.. భారీ స్కెచ్.. నాణ్యమైన మద్యం ఎంత అమ్మినా.. ఆ డబ్బు రాష్ట్ర ఖజానాకే పోతుంది. మన జేబులు నిండేదెలా? అని ముఖ్య నేత భావించారు. అందుకే నకిలీ మద్యాన్నే అధికారికంగా విక్రయించే కుట్రకు కూటమి ప్రభుత్వం రాగానే తెరతీశారు. మద్యం వినియోగం తగ్గించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి, పారదర్శకంగా అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల వ్యవస్థను తొలగించారు. వాటి స్థానంలో టీడీపీ సిండికేట్ ద్వారా 3,736 ప్రైవేటు దుకాణాలను ఏర్పాటు చేయించారు. అనుబంధంగా మరో 3,736 పర్మిట్ రూమ్‌లకు అనుమతిచ్చారు. టీడీపీ సిండికేట్ అనధికారికంగా ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలను తెరిచింది. తాజాగా 540 బార్లనూ (త్వరలో మరో 300 కూడా) ఈ సిండికేట్‌కే కట్టబెట్టింది. మరోవైపు రాష్ట్రంలోని 20 మద్యం డిస్టిలరీలు దశాబ్దాలుగా టీడీపీ సీనియర్ నేతల కుటుంబాల ఆ«దీనంలోనే ఉన్నాయి. వాటిలో 14 డిస్టిలరీలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. మిగిలిన ఆరింటికి అంతకుముందున్న ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. 20 డిస్టిలరీలనూ ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల కోసం ఎంప్యానెల్ చేసింది టీడీపీ ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ఒక్క డిస్టిలరీకి అనుమతివ్వలేదు. ఈ విధంగా తయారీ నుంచి విక్రయాల వరకు నెట్వర్క్ అంతటినీ ముఖ్యనేత టీడీపీ మద్యం మాఫియా గుప్పిట్లో పెట్టారు. పచ్చ సీసాలో నకిలీ మద్యం కూటమి అధికారంలోకి రాగానే అత్యంత ప్రాధాన్యతతో కొత్త మద్యం విధానం ఎందుకు అమలు చేశారో లోగుట్టు బయటపడుతోంది. మొత్తం మద్యం నెట్వర్క్ తమ చేతుల్లోకి రావడంతో ముఖ్య నేత రెండో దశ కుట్రను అమలు చేశారు. జయచంద్రారెడ్డితో చినబాబు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాకు తెరతీశారు. మొత్తం నకిలీ ముఠాకు తనకు అత్యంత సన్నిహితుడైన అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతను చినబాబు సమన్వయకర్తగా పెట్టారు. రాష్ట్రంలో ప్రాంతాలవారీగా టీడీపీ నేతలకు నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు కట్టబెట్టారు. నర్నీపటా్ననికి చెందిన సీనియర్ నేత కుటుంబానికి ఉత్తరాంధ్ర, ఏలూరు జిల్లాకు చెందిన వివాదాస్పద ప్రజాప్రతినిధికి ఉమ్మడి ఉభయ గోదావరి, బాపట్ల జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ కీలక నేతకు రాయలసీమలో నకిలీ మద్యం దందా బాధ్యతలు అప్పగించారు. ఆ వెంటనే ఆఫ్రికా దేశాల్లో నకిలీ మద్యం తయారుచేసే విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్రవ్యాప్తంగా యూనిట్లను నెలకొల్పారు. కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)ల రీతిలో జిల్లాలు, మండల స్థాయిలో నకిలీ మద్యం తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం గమనార్హం. టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్‌రావు, కట్టా సురేంద్రనాయుడు ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి నకిలీ మద్యం తయారీలో శిక్షణ ఇప్పించారు. ముఖ్య నేత సన్నిహితులైన టీడీపీ సీనియర్ నేతల కుటుంబాలకు చెందిన డిస్టిలరీల ద్వారా అక్రమంగా ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు)ను కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీగా కొని ఆ యూనిట్లకు తరలించారు. రాష్ట్రమంతా ముఖ్యనేత ప్రవేశపెట్టిన నకిలీ బ్రాండ్లు కేరళ మాల్ట్, బెంగళూరు బ్రాందీ, ఓల్డ్ అడ్మిరల్... ఇవీ ప్రస్తుతం రాష్ట్రంలో జోరుగా అమ్మకాలు సాగుతున్న మద్యం బ్రాండ్లు. ఎప్పుడూ వినని ఈ బ్రాండ్లు ఎక్కడివి అనే కదా మీ అనుమానం...? ఇవి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ప్రవేశపెట్టిన ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం బ్రాండ్లు. వారి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్‌రావు, సురేంద్రనాయుడు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్న నకిలీ బ్రాండ్లే. అనకాపల్లి జిల్లా రాంబిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం... ఇలా తనిఖీలు చేసిన ప్రతిచోటా పట్టుబడినది టీడీపీ సిండికేట్ ప్లాంట్లలో తయారవుతున్న నకిలీ మద్యమే. గుట్టలుగుట్టలుగా నిల్వ చేసిన నకిలీ మద్యం బ్రాండ్ల సరుకు దొరకడం అధికారులనే విస్మయపరుస్తోంది. దీన్నిబట్టే ఎంత పక్కాగా, యథేచ్ఛగా ముఖ్య నేత ఆఫ్రికా మోడల్ నకిలీ దందాను నడిపిస్తున్నారో స్పష్టమవుతోంది. మోగుతున్న మరణమృదంగం... టీడీపీ కూటమి ప్రభుత్వం... బ్రాండెడ్ ముసుగులో విచ్చలబిడిగా విక్రయిస్తున్న నకిలీ మద్యం రాష్ట్రంలో మరణ మృదంగం మోగిస్తోంది. 60 నుంచి 75 శాతం వరకు ఆల్కహాల్ ఉండే నకిలీ మద్యం తాగడంతో గుండె, ఊపిరితిత్తులు, ఉదరం, మూత్ర పిండాలు వేగంగా దెబ్బతింటున్నాయి. నాడీ వ్యవస్థపై దుష్ప్రభావంతో చిత్తచాంచల్యం ఆవహిస్తోంది. ఆరోగ్యంగా ఉన్నవారు వేగంగా తీవ్ర అనారోగ్యానికి గురై కొద్ది రోజుల్లోనే మృత్యువాత పడుతున్నారు. అంతుబట్టని మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ఏలూరు జిల్లాల్లో వరుస హఠాన్మరణాలకు నకిలీ మద్యమే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. దాంతో ఎక్సైజ్ శాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. పరిస్థితి ఇలానే కొనసాగితే తమ మెడకు చుట్టుకుటుందని భావించారు. భవిష్యత్‌లో ఇబ్బంది రాకుండా ఎక్సై్సజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తనిఖీలు, దాడులు చేసింది. ఏదో కిందిస్థాయి ముఠా దొరికితే కేసులు నమోదు చేసి ట్రాక్ రికార్డు కాపాడుకోవాలనుకుంది. కానీ, వారు ఊహించని రీతిలో నకిలీ మద్యం వెనుక ఉన్న వ్యవస్థీకృత మాఫియా బండారం బయటపడింది. ఈ మాఫియా డాన్ ముఖ్యనేతేనని తేలడంతో ఎక్సైజ్ శాఖ అధికారులకు నోట మాట రాలేదు. ప్రభుత్వ ముఖ్య నేత ఆదేశంతో నకిలీ మద్యం మాఫియా తీవ్రతను కప్పిపుచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే, నకిలీ మద్యం దారుణాలు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తుండటంతో సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తొలి ఏడాది రూ.5,280 కోట్ల దోపిడీ రాష్ట్రంలో అమ్ముడవుతున్న మద్యంలో మూడో వంతు నకిలీ అని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేయడం గమనార్హం. ఈ లెక్కన టీడీపీ కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాది రూ.5,280 కోట్ల నకిలీ మద్యం అమ్మకాలు సాగాయి. మొత్తం మద్యం అమ్మకాల్లో నకిలీ మద్యం వాటాను 50 శాతం దాటించాలన్నది టీడీపీ సిండికేట్ లక్ష్యం. అంటే, రానున్న నాలుగేళ్లలో ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టడానికి పన్నాగం పన్నింది. ఇందులో నకిలీ మద్యం దందాకు మూల విరాట్ అయిన ముఖ్యనేత కరకట్ట బంగ్లాకు 30 శాతం వాటాగా లెక్కతేల్చారు. మొత్తంమీద రూ.15 వేల కోట్లు కరకట్ట బంగ్లాకు కమీషన్‌గా చేరనుంది. ప్రాంతాలవారీగా పర్యవేక్షిస్తున్న టీడీపీ సీనియర్ నేతలకు 50 శాతం, మద్యం దుకాణాలు, బార్లు నిర్వహిస్తున్న టీడీపీ సిండికేట్‌కు 20 శాతం వాటా. ఇంత భారీ దోపిడీ కాబట్టే పెదబాబు, చినబాబు ఈ దందాను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అప్పట్లో దుష్ప్రచారం ... రాద్ధాంతం... ఇప్పుడు అంతటా మౌనం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా విక్రయిస్తేనే టీడీపీ కూటమి, ఎల్లో మీడియా రాద్ధాంతం చేసింది. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్, అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు తదితరులు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. మద్యం నాణ్యమైనది కాదని చెన్నైకు చెందిన ఓ ప్రైవేట్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని రఘురామ తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. అసలు తాము అటువంటి నివేదిక ఇవ్వలేదని ఆ ల్యాబ్ ప్రకటించంతో వారి కుట్ర బెడిసికొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో విక్రయిస్తున్న మద్యం నాణ్యమైనదేనని ప్రకటించింది. అప్పట్లో రాద్ధాంతం చేసిన చంద్రబాబు, ఆయన గ్యాంగ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు క్రమంగా బయటపడుతున్నా కిమ్మనడం లేదు. కఠిన చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లలో విక్రయిస్తున్న మద్యం నాణ్యతను ర్యాండమ్‌గా పరీక్షించాలని కూడా భావించడం లేదు. ఇదంతా చూస్తుంటే నకిలీ మద్యం మాఫియాకు ప్రభుత్వ పెద్దల దన్ను ఉందన్నదే స్పష్టమవుతోంది. స్పిరిట్ .. మనుషులకు ప్రాణాంతకం!వాస్తవానికి ఈ స్పిరిట్‌లో 100 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఇది మనుషులకు అత్యంత ప్రమాదకరం. పరిశ్రమలు తమ ఉత్పత్తుల (ఆహార సంబంధిత కాదు) తయారీకి ఈ స్పిరిట్‌ను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తాయి. ఇక బ్రాండెడ్ మద్యం కంపెనీల పరిశ్రమల్లో ఉండే అధునాతన, భారీ యంత్ర పరికరాలతో స్పిరిట్‌ను బాగా పలుచన (డైల్యూట్) చేసి ఆల్కహాల్‌ను 42 శాతానికి తగ్గిస్తాయి. తర్వాతే మద్యం తయారీకి ముడి సరుకుగా ఉపయోగిస్తారు. ఎందకంటే ఆల్కహాల్ 42 శాతం కంటే ఎక్కువ ఉండడం ఆరోగ్యానికి తీవ్ర హానికరం. కాగా, ఏడాదిగా టీడీపీ కూటమి పెద్దలు అక్రమంగా నెలకొల్పిన నకిలీ మద్యం యూనిట్లు ప్రమాణాలు ఏమీ పాటించలేదు. వీటిలోని చిన్నచిన్న యంత్రాలకు స్పిరిట్‌ను ప్రాసెస్ చేసే సామర్థ్యం లేదు. స్పిరిట్లోని ప్రమాదకర కారమిల్ ద్రావణం, రంగు నీళ్లు కలిపి నకిలీ మద్యం ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాదు బ్రాండెడ్ కంపెనీల మద్యం సీసాలు, మూతలు కూడా తయారు చేస్తున్నారు. నకిలీ మద్యంలో ఆల్కహాల్ 75 శాతం వరకు ఉంటోందని ఎక్సైజ్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అది ఎంత ప్రమాదకరమో ఊహకే అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీసాల్లో నకిలీ మద్యం నింపి మూతలు బిగించి టీడీపీ సిండికేట్ గుప్పిట్లో ఉన్న 3,736 ప్రైవేట్ దుకాణాలు, 3,736 పర్మిట్ రూమ్‌లు, 75 వేల బెల్ట్ దుకాణాలు, ఇప్పటికి 540 బార్లలో (త్వరలో మరో 300 కూడా) యథేచ్ఛగా అమ్ముతున్నారు. -
అంతా స్కెచ్ ప్రకారమే..!
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాము పన్నిన పన్నాగాన్ని పక్కాగా అమలు చేస్తోంది. ఈ మేరకు ‘‘కేసును పక్కదారి పట్టించి నీరుగారుస్తాం. కంగారుపడొద్దు’’ అని పెదబాబు, చినబాబు హామీ ఇవ్వడంతో ఎ1గా ఉన్న జనార్దన్‌రావు గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం దర్జాగా అడుగుపెట్టారు. ఆధారాలతో సహా అడ్డంగా దొరికినా సరే ఆయన ఏమాత్రం జంకు లేకుండా రావడం పోలీసులనే విస్మయపరిచింది. కాగా, కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీ కథ కమామిషు ఇలా సాగింది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో పట్టుబడ్డ నకిలీ రాకెట్లో అడ్డంగా దొరికిన ఆఫ్రికా మోడల్ కల్తీ మద్యం మాఫియా సూత్రధారులు టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి, ఆయన భాగస్వామి జనార్దన్‌రావుతో పాటు సురేంద్రనాయుడు ప్రభుత్వ పెద్దలకు ఎదురుతిరిగారు. తమను బయటపడేయకుంటే ఎన్నికలకు ముందు కుదిరిన డీల్ ప్రకారం... పెదబాబు, చినబాబు ఆదేశాలతోనే రాష్ట్రస్థాయిలో నకిలీ మద్యం దందాను వ్యవస్థీకృతం చేశామనే వాస్తవాన్ని బయటపెడతామని తేల్చి చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ టీడీపీ సీనియర్ ప్రజాప్రతినిధితో పాటు కేసును పర్యవేక్షిస్తున్న ఐపీఎస్ అధికారి ద్వారా కూడా సమాచారం పంపించారు. ‘మమ్మల్ని బయటపడేసే బాధ్యత ప్రభుత్వ పెద్దలదే... లేకపోతే మొత్తం నకిలీ మద్యం గుట్టు విప్పుతామని కుండబద్దలు కొట్టారు. జయచంద్రారెడ్డి, జనార్దన్‌రావు నోరువిప్పితే బండారం బయటపడుతుందని నకిలీ మద్యం దందా కుట్రదారులు, లబ్దిదారులైన పెదబాబు, చినబాబు బెంబేలెత్తారు. ‘‘తప్పని పరిస్థితుల్లో కేసు నమోదు చేశాం తప్ప అంతకుమించి దర్యాప్తు ముందుకుసాగకుండా నీరుగారుస్తాం’’ అని హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసినట్టు ప్రకటించి కనికట్టు చేశామని.. టీడీపీలో ఆయన స్థానానికి ఢోకా లేదని కూడా భరోసా ఇచ్చారు. ‘‘విచారణకు హాజరైనట్టు, పోలీసులకు సహకరిస్తున్నట్టు నటించండి. కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని బయటకు తెచ్చి కేసును పూర్తిగా పక్కదారి పట్టిస్తామని’’ చెప్పారు. ఈ డ్రామా కొనసాగింపులోనే నకలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం లేదని వీడియో ద్వారా ప్రకటించాలని జనర్దాన్రావును చినబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇలా అందరినీ నమ్మించేందుకు ఓ ఆధారాన్ని సృష్టించినట్టు కూడా అవుతుందన్నదన్నది అసలు ఉద్దేశం. కేసు నుంచి బయటపడేస్తామన్న భరోసా వచ్చాకే... జనార్దన్‌రావు 4 రోజుల క్రితం వీడియో విడుదల చేశారు. అయితే, నకిలీ మద్యం వ్యవహారంతో టీడీపీ నేతలకు సంబంధం ఉందో లేదో చెప్పాల్సింది దర్యాప్తు చేసే పోలీసు అధికారులు. కానీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దరావు టీడీపీ నేతలకు క్లీన్చిట్ ఇవ్వడం గమనార్హం.ఇదంతా చూస్తుంటే కేసును పక్కదారి పట్టించేందుకు ఎంత పక్కాగా కథ నడుపుతున్నారో స్పష్టమవుతోంది. ఆ స్కెచ్‌లో భాగంగానే జనార్దన్‌రావు పోలీసులకు సమాచారం ఇచ్చి మరీ గన్నవరం విమానాశ్రయంలో దిగారు. వెంటనే పోలీసులు అరెస్టు చేయడంతో డ్రామాలో మొదటి అంకం పూర్తయింది. ఇక కొద్ది రోజుల్లోనే జనార్దన్‌రావును బెయిల్‌పై తీసుకొచ్చి కేసును పూర్తిగా నీరుగార్చాలన్నదే ప్రభుత్వ పెద్దల ఎత్తుగడ అని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నకిలీ మద్యం కేసులో జనార్దన్‌రావు అరెస్ట్గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్‌రావును ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. అద్దేపల్లి జనార్దన్‌రావు ములకలపల్లి, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్నారు. నకిలీ మద్యం గుట్టు రట్టయిన వెంటనే ఆయన ఆఫ్రికా పారిపోయినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో 12 మందిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదట ముగ్గురు నిందితులు అద్దేపల్లి జగన్మోహన్రావు, బాదల్ దాస్, ప్రతాప్ దాస్, కట్టారాజు, శ్రీనివాసరెడ్డి, కళ్యాణ్‌ను అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చెందిన రవిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. ఏ–1 అద్దేపల్లి జనార్దన్‌రావు కూడా అరెస్ట్ కావడంతో ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మంది నిందితులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టయింది. అద్దేపల్లి జనార్దన్‌రావు అరెస్ట్‌పై శుక్రవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన విదేశాలకు పారిపోయాడని అధికారులు చెబుతున్నప్పటికీ... విజయవాడలోనే తలదాచుకున్నాడని ప్రచారం జరిగింది. కానీ జనార్దన్‌రావు ఎయిర్ ఇండియా విమానంలో ముంబై నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు శుక్రవారం సాయంత్రం 5.45 గంటలకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎక్సైజ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జనార్దన్‌రావు మీడియాతో మాట్లాడుతూ తనను రాజకీయంగా ఈ కేసులో ఇరికించారన్నారు. ఆయన తరఫు న్యాయవాది రవీంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జనార్థనరావును తీసుకొచ్చి సరెండర్ చేస్తామని చెప్పినా ఎక్సైజ్ పోలీసులు స్పందించలేదన్నారు. ఆయనను బలవంతం చేసి వారికి కావాల్సిన విధంగా వాంగ్మూలం తీసుకొనేందుకు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఆయనకు ఏదైనా జరిగితే ఎక్సైజ్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన బావమరిదిపై కేసు ములకలచెరువు: టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది మంత్రి గిరిధర్‌రెడ్డిని నకిలీమద్యం తయారీ కేసులో నిందితులుగా ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం చేర్చారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఈనెల 3న 14 మందిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా మరో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. ఈ మేరకు తంబళ్లపల్లె కోర్టులో మెమో దాఖలు చేశారు. జయచంద్రారెడ్డిని ఏ17గా, గిరిధర్‌రెడ్డిని ఏ18గా చేర్చారు. మిగిలిన వారిలో అణ్బురాసు, అష్రఫ్, బాలాజీ, సుదర్శన్, రవి ఉన్నారు. కేసులో ఏ–2 కట్టా రాజు, ఏ–12 కొడాలి శ్రీనివాసరావుల వాంగ్మూలాల ఆధారంగా వీరిని నిందితులుగా చేర్చినట్టు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. వీరి అరెస్టు కోసం ఎక్సైజ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. -
మల్లాది విష్ణుకి 19వ తేదీ వరకు రిమాండ్
-
మల్లాది విష్ణుకి 19వ తేదీ వరకు రిమాండ్
విజయవాడ : కల్తీ మద్యం కేసులో నిందితులు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతోపాటు అతడి సోదరుడు శ్రీనివాస్‌కి విజయవాడ కోర్టు 19వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును శుక్రవారం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అంతకుమందు ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లాది విష్ణుతోపాటు శ్రీనివాస్‌కి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత వారిద్దరిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆ క్రమంలో వారిద్దరి నుంచి పోలీసులు వేలిముద్రలు సేకరించారు. నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు మల్లాది విష్ణుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
మల్లాది విష్ణుని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
విజయవాడ : కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును శుక్రవారం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అంతకుమందు ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లాది విష్ణుతోపాటు అతడి సోదరుడు శ్రీనివాస్‌కి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత వారిద్దరిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆ క్రమంలో వారిద్దరి నుంచి పోలీసులు వేలిముద్రలు సేకరించారు. నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు మల్లాది విష్ణుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


