20, 21 తేదీల్లో కిరణ్ జిల్లా పర్యటన
చిత్తూరు(కలెక్టరేట్),న్యూస్‌లైన్:
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 20, 21 తేదీల్లో ఆయన జిల్లాలో పర్యటించనున్నట్టు గురువారం కలెక్టర్ కార్యాలయూనికి సమాచారం అందింది. పలు అభివృద్ధి పనులు, పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లేళ్లమంద, వి.కోటల్లో నిర్వహించే రచ్చబండ సభల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా ఉన్నారుు. 20వ తేదీ ఉదయం ఆరుగంటలకు సీఎం హైదరాబాదు నుంచి బయలుదేరి 7.20 గంటలకు చెన్నై విమానాశ్రయూనికి చేరుకుంటారు. 7.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వరదయ్యపాళెంకు చేరుకుంటారు.
శ్రీసిటీ సెజ్‌కు చేరుకుని అధికారులతో సమావేశమవుతారు. అల్పాహారనంతరం 9 గంటలకు క్యాడ్బరీ, డెన్సీలీ ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేస్తారు. 11.10 గంటలకు శ్రీసిటీ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.50 గంటలకు తిరుపతిలోని ఎన్టీఆర్ స్టేడియం చేరుకుంటారు. తిరుపతిలో అధికార, అనధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి చిత్తూరు-తిరుపతి బైపాస్‌లో ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 12.30 గంటలకు స్విమ్స్ చేరుకుని శ్రీపద్మావతి వైద్య కళాశాల, చిత్తూరు తాగునీటి పథకం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. 12.50 గంటలకు తిరుపతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 1.30 గంటలకు కేవీపల్లె మండలం జిల్లేళ్ల మందకు చేరుకుని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.10 గంటలకు అదే మండలంలోని తూపల్లెకు చేరుకుని ఝరికోన తాగునీటి పథకానికి ప్రారంభోత్సవం చేస్తారు. 4.20 గంటలకు బయలుదేరి కలకడ మండల కేంద్రానికి చేరుకుని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు కలికిరి మండలం నరిగిపల్లెలోని ఆయన స్వగృహానికి చేరుకుని రాత్రికి అక్కడ బసచేస్తారు. 21వ తేదీ ఉదయం 10.40 గంటలకు కలికిరి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు వి.కోట చేరుకుని అధికార, అనధికారులతో సమావేశమవుతారు. 11.20 గంటలకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.50 గంటలకు వి.కోట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వైఎస్సార్ కడప జిల్లాకు వెళ్లనున్నారు.