పోలీసు స్టిక్కర్.. జీపులో లిక్కర్
పోలీసు స్టిక్కర్ ఉన్న జీపులో మద్యం షాపులకు సరకు సరఫరా చేయడం పలువురిని విస్మయపరి చింది. ప్రత్యేక వాహనంలో మద్యం రవాణా చేయాల్సి ఉండగా, పోలీసు స్టిక్కర్ ఉన్న జీపు ను వాడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీనిపై ఎస్సై ఎండీఎంఆర్ ఆలీఖాన్‌ను వివరణ కోరగా, మద్యం షాపుల యజమానులకు చెందిన జీపును ఇటీవల కోడిపందాల దాడుల కో సం వినియోగించినట్టు చెప్పారు. ఆ సమయంలో పోలీసు స్టిక్కర్‌ను అంటించినట్టు తెలిపారు. ఈ విషయం గుప్పుమనడంతో జీపు స్టిక్కరును పోలీసులు తొలగిం చారు. ఈ విష యం సర్వత్రా చర్చనీయాంశ మైంది.