SRH vs RCB
-
ఆర్సీబీ స్టార్ సంచలన నిర్ణయం!
శ్రీలంక పేసర్ నువాన్ తుషార సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) తీరుపై అసంతృప్తితో అతడు కోర్టుకెక్కినట్లు సమాచారం. రైటార్మ్ పేసర్ అయిన 31 ఏళ్ల తుషార.. శ్రీలంక తరఫున ఇప్పటికి 30 టీ20 మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు కూల్చాడు.తొలి టైటిల్ఇంతవరకు అతడు టెస్టు, వన్డేల్లో అరంగేట్రం చేయనేలేదు. అయితే, టీ20లో మంచి గుర్తింపు పొందిన తుషారను ఐపీఎల్-2025 మెగా వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 1.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో అతడు ఒక్క మ్యాచే ఆడినప్పటికీ జట్టు టైటిల్ గెలవడంతో సంతోషంలో మునిగిపోయాడు.NOC ఇవ్వలేదని..ఈ క్రమంలో ఐపీఎల్-2026 సీజన్‌కు గానూ ఆర్సీబీ నువాన్ తుషారను అట్టిపెట్టుకుంది. అయితే, ఆర్సీబీతో చేరేందుకు శ్రీలంక బోర్డు అతడికి ఇంత వరకు నిరభ్యంతర పత్రం (NOC) ఇవ్వలేదు. ఫిట్నెస్ పరీక్షలో ప్రమాణాలకు తగినవిధంగా లేడనే కారణంగా అతడికి NOC ఇవ్వలేదని సమాచారం.అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై?అయితే, స్థానిక మీడియా కథనాల ప్రకారం.. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని తుషార బోర్డుకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మార్చి 31తో తన సెంట్రల్ కాంట్రాక్టు ముగిసిపోయినందున.. కాంట్రాక్టును పునరుద్ధరించాల్సిన అవసరం లేదని లేఖ రాసినట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో తాను జట్టు మారే యోచనలో ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.కోర్టుకెక్కిన తుషారకానీ బోర్డు తన అభ్యర్థనను పట్టించుకోకపోవడం, ఐపీఎల్లో ఆడేందుకు NOC ఇవ్వకపోవడంతో తుషార న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. శ్రీలంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వ, కార్యదర్శి బందులా దిస్సానాయకే, కోశాధికారి సుజీవ గొడలియాడ, సీఈఓ ఆష్లే డి సిల్వలను ప్రతివాదులుగా చేరుస్తూ కొలంబో జిల్లా కోర్టులో తుషార పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 9న విచారణ జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఐపీఎల్-2026ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి జయకేతనం ఎగురవేసింది.చదవండి: అక్కడున్న ప్రతి క్షణం ద్వేషమే.. అందుకే తప్పుకొన్నా: ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆర్సీబీ.. తొలి మ్యాచ్‌లోనే అదిరిపోయే విజయం సాధించింది. నిన్న (మార్చి 28) జరిగిన టోర్నీ ఓపెనర్‌లో సన్‌రైజర్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, ఏకపక్ష విజయం నమోదు చేసింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే (15.4 ఓవర్లలో) ఛేదించడం ద్వారా ఓ భారీ రికార్డు నెలకొల్పింది.ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 200 ప్లస్ టార్గెట్‌ను ఊదేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు రాజస్థాన్ రాయల్స్ పేరిట ఉండేది. రాయల్స్ గత ఎడిషన్‌లో (2025లో గుజరాత్‌పై) 200 ప్లస్ లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో ఛేదించింది. తాజాగా ఆర్సీబీ ఈ రికార్డును బద్దలు కొట్టింది.ఆర్సీబీ ఈ రికార్డు సాధించడంలో కింగ్ విరాట్ కోహ్లి కీలకపాత్ర పోషించాడు. భారీ ఛేదనలో విరాట్ తన సహజ శైలికి భిన్నంగా భారీ షాట్లతో అలరించి (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాచ్‌ను వేగంగా ముగించాడు. గెలుపుకు 17 పరుగులు కావాల్సిన తరుణంలో విరాట్ వరుసగా 6, 4, 4, 4 బాది ఆర్సీబీ ఈ రికార్డు సొంతం చేసుకునేలా చేశాడు.ఆర్సీబీ ఈ రికార్డు సొంతం చేసుకోవడంలో దేవ్‌దత్ పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), రజత్ పాటిదార్ (12 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా తమవంతు పాత్ర పోషించారు. వీరిద్దరు కూడా వేగంగా ఆడి కొండంత లక్ష్యాన్ని కరిగించారు. అంతకుముందు ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన 200 ప్లస్ లక్ష్య ఛేదనలు..15.4 - RCB vs SRH, బెంగళూరు, 2026*15.5 - RR vs GT, జైపూర్, 202516.0 - RCB vs GT, అహ్మదాబాద్, 202416.3 - MI vs RCB, వాంఖేడే, 202317.3 - DC vs GL, ఢిల్లీ, 2017 -
పాపం.. వణికిపోయిన ఇషాన్ కిషన్!
ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌కి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న ఇషాన్ కిష మ్యాచ్ ఆద్యంతం కాస్త ఒత్తిడికి లోనైనట్లుగా అనిపించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌తో తొలి మ్యాచ్ ఆడాల్సి రావడం, కమిన్స్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతో భయంతో కనిపించాడు. బ్యాటింగ్‌లో బాధ్యతగానే జట్టును ముందుకు తీసుకెళ్లినప్పటికీ ఫీల్డింగ్ సమయంలో మాత్రం టెన్షన్‌తో కీపింగ్ కూడా సరిగా చేయలేకపోయాడు.ఆర్సీబీ బ్యాటింగ్ దూకుడుతో ఒకవైపు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటుంటే.. మరోవైపు ఇషాన్ కిషన్ వికెట్ల వెనుక బంతులు వదిలేసి బౌండరీలు అందించాడు. ఈజీగా వచ్చిన బంతుల్ని కూడా పట్టుకోలేక గ్లౌజుల కింద నుంచి ఫోర్లు ఇచ్చేశాడు. ఇషాన్ కిషన్ దగ్గర రెండు బంతులు మిస్సవగా.. రెండు కూడా గ్లౌజుల కింద నుంచే వెళ్లిపోయాయి.బౌలర్లను సమన్వయం చేసుకోవడంలో కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ విఫలమయ్యాడు. రెండో ఓవర్లోనే ఫిల్ సాల్ట్ వికెట్ పడినప్పటికీ.. పవర్ ప్లేలో మరో వికెట్ తీయలేకపోయాడు. ఆర్సీబీ స్టార్స్ దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. జయదేవ్ ఉనద్కత్, నితీష్ కుమార్ రెడ్డి 10లోపు పరుగులు సమర్పించగా.. మిగతా బౌలర్లంతా 11, 14 పరుగులు ఇచ్చారు. ఈషాన్ మలింగ ఏకంగా 2 ఓవర్లలో 35 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్పై విన్ని అందుకుంది.మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ‘మొదటి 3-4 ఓవర్ల తర్వాత వికెట్ ఖచ్చితంగా బాగా సహకరించిందని నేను భావిస్తున్నాను. మేము ఆరంభంలోనే కొన్ని వికెట్లు కోల్పోయాము, వచ్చేసారి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే, రెండో ఇన్నింగ్స్ వికెట్‌ను చూస్తే, బ్యాటింగ్ చేయడానికి చాలా సులభంగా ఉంది. బంతి బ్యాట్‌పైకి చాలా చక్కగా వస్తోంది. కాబట్టి అవును, వచ్చేసారి మేము షాట్ ఎంపికలో మరింత వివేకంతో వ్యవహరించాలి’ అని చెప్పుకొచ్చాడు. -
IPL 2026, SRH VS RCB: ఇషాన్ కిషన్ భారీ రికార్డు
ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లోనే ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ భారీ రికార్డు సాధించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో బాధ్యతాయుతంగా ఆడుతున్న అతను.. ఐపీఎల్లో 3000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా క్యాష్ లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన ఆరో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్ ఈ మైలురాయిని చేరుకునేందుకు 2180 బంతులు తీసుకోగా.. రిషబ్ పంత్ (2028), యూసఫ్ పఠాన్ (2082), సూర్యకుమార్ యాదవ్ (2130), సురేశ్ రైనా (2135), ఎంఎస్ ధోని (2152) అతని కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ కష్టాల్లో పడింది. ఆర్సీబీ అరంగేట్రం పేసర్ జేకబ్ డఫీ నిప్పులు చెరిగే బంతులతో ఎస్ఆర్హెచ్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. ఈ దశలో ఇషాన్ బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి జతగా హెన్రిచ్ క్లాసెన్ క్రీజ్‌లో ఉన్నారు. 7 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 54-3గా ఉంది. ఇషాన్ (12 బంతుల్లో 25), క్లాసెన్ (7 బంతుల్లో 6) ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. డఫీ అద్బుతమైన స్పెల్‌ను (4-0-22-3) ముగించాడు.నిప్పులు చెరిగిన డఫీఎస్ఆర్హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. డఫీ ఎస్ఆర్హెచ్ను దారుణంగా దెబ్బకొట్టాడు. 3వ ఓవర్లో ఓపెనర్లు అభిషేక్ (7), హెడ్ (11) వికెట్లు తీసిన ఇతను.. ఐదో ఓవర్ తొలి బంతికే నితీశ్‌కుమార్ రెడ్డిని (1) పెవిలియన్‌కు పంపాడు.తుది జట్లు..ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మసన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/వికెట్‌కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ -
సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2026 ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలో ఊదేసి, 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో డఫీ (4-0-22-3).. బ్యాటింగ్‌లో పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అదరగొట్టారు. అంతకుముందు ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేసింది. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఆర్సీబీ వరుస బంతుల్లో (2,3) వికెట్లు కోల్పోయింది. డేవిడ్ పేన్ వరుసగా రజత్ పాటిదార్ (31), జితేశ్ శర్మ (0)ను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవాలంటే 45 బంతుల్లో 39 పరుగులు చేయాలి. రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ8.4వ ఓవర్-110 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. విధ్వంసకర అర్ద శతకం బాదిన పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) హర్ష్ దూబే బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ202 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 9 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. ఉనద్కత్ బౌలింగ్‌లో క్లాసెన్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ పట్టడంతో ఫిల్ సాల్ట్ (8) ఔటయ్యాడు. అయితే సాల్ట్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పడిక్కల్ (11 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి బంతి నుంచే ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు. అతనికి జతగా విరాట్ కోహ్లి (17 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. 4.3 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 61-1గా ఉంది.ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ (80) విధ్వంసం.. క్లాసెన్ క్లాస్ (31), ఆఖర్లో అనికేత్ వర్మ (43) మెరుపుల కారణంగా ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. హెడ్ 11, అభిషేక్ 7, నితీశ్ కుమార్ రెడ్డి 1, సలీల్ అరోరా 9, హర్ష్ దూబే 3, హర్షల్ పటేల్ డకౌట్ కాగా.. డేవిడ్ పేన్ 6, ఉనద్కత్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, రొమారియో షెపర్డ్ చెరో 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీశారు. ఇషాన్ కిషన్ ఔట్15.6వ ఓవర్- 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. అభినందన్ సింగ్ బౌలింగ్‌లో సాల్ట్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 155-6గా ఉంది. ఐదో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్14.3వ ఓవర్- 137 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి సలీల్ అరోరా (9) ఔటయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్13.1వ ఓవర్లో సన్‌రైజర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. అద్భుతంగా ఆడుతున్న హెన్రిచ్ క్లాసెన్ (31) రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. ఇషాన్ కిషన్‌కు (72) జతగా సలీల్ అరోరా క్రీజ్‌లోకి వచ్చాడు. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ఎస్ఆర్హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. డఫీ ఎస్ఆర్హెచ్ను దారుణంగా దెబ్బకొట్టాడు. 3వ ఓవర్లో ఓపెనర్లు అభిషేక్, హెడ్ వికెట్లు తీసిన ఇతను.. ఐదో ఓవర్ తొలి బంతికే నితీశ్‌కుమార్ రెడ్డిని (1) పెవిలియన్‌కు పంపాడు. హెడ్ ఔట్.. 23 పరుగులకే ఓపెనర్లు డౌన్23 పరుగులకే (3 ఓవర్లు) ఎస్ఆర్హెచ్ ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. డేంజరెస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ (11) డఫీ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అభిషేక్ ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ 18 పరుగుల వద్ద (2.1వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (7) జేకబ్ డఫీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇవాల్టి (మార్చి 28) మ్యాచ్‌తో ఐపీఎల్ 2026 ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లు..ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మసన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/వికెట్‌కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ -
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. ఆర్సీబీకి భారీ షాక్
ఐపీఎల్-2026 సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ హెడ్ కోచ్ అండీ ఫ్లవర్ ధ్రువీకరించాడు. హాజిల్‌వుడ్ గురువారం జట్టుతో చేరి ప్రాక్టీస్ చేసినప్పటికి, అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్‌కు అతడు అందుబాటులో లేడు."ఎస్ఆర్హెచ్తో జరిగే మా మొదటి మ్యాచ్‌కు జోష్ హాజిల్‌వుడ్ అందుబాటులో లేడు. అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. జోష్ నిన్ననే మా జట్టుతో చేరాడు. అతడిపి ఫిట్నెస్ను మా వైద్యబృందం పరీక్షించనుంది. తర్వాతే తదుపరి మ్యాచ్‌లకు అతడి అందుబాటుపై నిర్ణయం తీసుకుంటాము" అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో ఫ్లవర్ పేర్కొన్నాడు. కాగా ఈ జింబాబ్వే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు."కోహ్లీ చాలా ఫిట్‌గా ఉన్నాడు, ఈసారి మరిన్ని పరుగులు సాధించాలన్న కసితో ఉన్నాడు. అతడు బంతిని హిట్ చేస్తున్న తీరు చూస్తుంటే ఈ సీజన్లో పరుగుల వరద పారించడం ఖాయమనిపిస్తోంది" అని ఫ్లవర్ అన్నారు.బెంగళూరు తుది జట్టు(అంచనా): ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రాజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జాకబ్ డఫీ.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఇదే.. వికెట్ల వీరుడు అరంగేట్రం? -
యశ్ దయాళ్ విషయంలో ఆర్సీబీ కీలక ప్రకటన
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కీలక ప్రకటన చేసింది. తమ పేసర్ యశ్ దయాళ్ ఐపీఎల్-2026లో పాల్గొనడం లేదని తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల అతడిని పక్కనపెట్టామని.. అయితే, కాంట్రాక్టు మాత్రం కొనసాగిస్తామని వెల్లడించింది.సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ తొలిసారి గతేడాది ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. ఇందులో యశ్ దయాళ్ (Yash Dayal) కూడా తన వంతు పాత్ర పోషించాడు. సీజన్ మొత్తం కలిపి 13 వికెట్లతో రాణించి జట్టును చాంపియన్‌గా నిలపడంలో తోడ్పడ్డాడు.సంచలన ఆరోపణలుఅయితే, అనూహ్య రీతిలో యశ్ దయాళ్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఘజియాబాద్‌లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో గతేడాది జూలైలో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐదేళ్లు తనతో రిలేషన్షిప్లో ఉండి.. పెళ్లి పేరిట మోసం చేశాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేసింది. శారీరకంగా, మానసికంగా తనను హింసించాడని.. లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది.పోక్సో కేసు కూడాఆ తర్వాత ఓ టీనేజర్ తెరమీదకు వచ్చింది. 2023 నుంచి తనపై యశ్ దయాళ్ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద జైపూర్‌లో మరో కేసు నమోదైంది. ఐపీఎల్-2025 సందర్భంగానూ హోటల్ గదిలో దయాళ్ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని సదరు టీనేజర్ ఆరోపించింది. క్రికెట్లో తనకు కెరీర్ ఆశ చూపి ఇలా చేశాడని వాపోయింది.అయితే, మొదటి కేసులో అలహాబాద్ హైకోర్టు యశ్ దయాళ్ అరెస్టు కాకుండా స్టే విధించగా.. రెండోకేసులో జైపూర్‌లోని పోక్సో కోర్టు యాంటిసిపేటరీ బెయిల్‌ను 2025 డిసెంబరులో తిరస్కరించింది. ఇందుకు సంబంధించి విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇటీవలే యశ్ దయాళ్ ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.అతడిని ఈ సీజన్లో ఆడించము.. కానీకాగా యశ్ దయాళ్ను కొనసాగించడంపై ఆర్సీబీపై విమర్శలు రాగా.. ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మొ బొబాట్ తాజాగా స్పందించాడు. ‘‘యశ్ దయాళ్ ఈసారి జట్టుతో చేరడం లేదు. వ్యక్తిగతంగా అతడు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకు మేము అతడికి మద్దతుగానే నిలబడ్డాము.అతడిపై నమ్మకం ఉంది కాబట్టే రిటైన్ చేసుకున్నాము. అతడి కాంట్రాక్టు కొనసాగుతుంది. అతడితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము. ఈరోజు కూడా అతడిని సంప్రదించిన తర్వాతే జట్టుతో చేర్చకూడదనే నిర్ణయానికి వచ్చాము. అతడితో పాటు జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాము. అతడికి మా మద్దతు ఉంటుంది’’ అని మొ బొబాట్ పేర్కొన్నాడు. కాగా మార్చి 28న ఐపీఎల్-2026 టోర్నీకి తెరలేవనుండగా.. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ- సన్‌రైజర్స్ తలపడతాయి. ఇందుకు చిన్నస్వామి స్టేడియం వేదిక.చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే? -
సెలక్టర్లు వింటారు: నితీశ్ రెడ్డికి ఇషాన్ కిషన్ వార్నింగ్!
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్‌తో మార్చి 28న ఐపీఎల్-2026 టోర్నీకి తెరలేవనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక.కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ఇక ఆరంభ మ్యాచ్‌లకు ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. అతడి గైర్హాజరీలో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ వ్యవహరించనున్నాడు. ఇప్పటికే సన్‌రైజర్స్ నెట్ ప్రాక్టీస్, ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్‌లతో బిజీబిజీగా గడుపుతోంది.ఈ క్రమంలో ఆటవిడుపుగా సన్‌రైజర్స్ ఆటగాళ్లు అభిమానులతో మమేకం అయ్యారు. ఫ్యాన్ మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలతో అలరించారు. ఇందులో భాగంగా ఆంధ్ర కుర్రాడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు.. అందుకు కెప్టెన్ ఇషాన్ కిషన్ ఇచ్చిన కౌంటర్లు.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సెలక్టర్లు వింటారు!టెస్టు లేదంటే టీ20 ఫార్మాట్.. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటారని హోస్ట్ అడుగగా నితీశ్ రెడ్డి.. టీ20 అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత టెస్టు లేదంటే వన్డేలలో ఒకటి ఎంచుకోమనగా.. అతడు వన్డే అని బదులిచ్చాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ జోక్యం చేసుకుంటూ.. ‘‘నువ్వు టెస్టు జట్టులో కీలక సభ్యుడివి బ్రో. సెలక్టర్లు ఈ మాటలు వింటారు జాగ్రత్త’’ అని హెచ్చరించాడు. దీంతో నితీశ్‌తో పాటు ఆక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వేశారు.𝙁𝙤𝙧 𝙩𝙝𝙚 𝙩𝙚𝙖𝙢, 𝙖𝙣𝙮𝙩𝙝𝙞𝙣𝙜 🤌 pic.twitter.com/ju8SpzTvxl— SunRisers Hyderabad (@SunRisers) March 22, 2026కాగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన నితీశ్ రెడ్డిని.. హార్దిక్ పాండ్యాకు సరైన వారసుడిగా సెలక్టర్లు భావిస్తున్నారు. వైట్‌బాల్ క్రికెట్లో హార్దిక్ గైర్హాజరీలో అడపాదడపా అవకాశాలు అందుకున్న నితీశ్.. గత రెండేళ్లుగా టెస్టుల్లో మాత్రం ఆల్‌రౌండర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్నాడు.అది సాధ్యం కాదు!ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇషాన్ కిషన్ నితీశ్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడం గమనార్హం. ఇక ఐపీఎల్లో పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయడం ఇష్టమా? లేదంటే డెత్ ఓవర్లలో బ్యాటింగ్ ఇష్టమా? అని హోస్ట్ అడుగగా.. నితీశ్ రెడ్డి పవర్ ప్లే అని సమాధానం ఇచ్చాడు.దీంతో మరోసారి ఇషాన్ కిషన్ కౌంటర్‌తో ముందుకు వచ్చాడు. నితీశ్ రెడ్డి రెగ్యులర్‌గా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి.. అతడికి ఎంత ఇష్టం ఉన్నా పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయలేడంటూ నవ్వులు పూయించాడు. టెస్టు జట్టులో స్థానం సుస్థిరంకాగా సన్‌రైజర్స్ తరఫున 2024లో సత్తా చాటి భారత టీ20 జట్టులో అడుగుపెట్టిన నితీశ్ రెడ్డి.. అదే ఏడాది ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మరుసటి ఏడాది వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 10 టెస్టులు, 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.మరోవైపు ఇషాన్ కిషన్ దాదాపు మూడేళ్ల తర్వాత ఇటీవలే టీమిండియాలో పునరాగమనం చేశాడు. క్రమశిక్షణా రాహిత్యం వల్ల జట్టులో స్థానం కోల్పోయిన అతడు.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి సెలక్టర్లకు సవాల్ విసిరాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడిని టీ20 ప్రపంచకప్-2026 జట్టుకు ఎంపిక చేయగా.. భారత్ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: భారత్‌తో స్నేహం కావాలి: పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్! -
IPL 2026: సన్‌రైజర్స్‌కు కష్టమే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఆరంభానికి రంగం సిద్దమైంది. మార్చి 28న క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌కు తెరలేవనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించి తొలి విడత షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించింది.ఇరవై మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమేఓవైపు ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. మరోవైపు.. తమిళనాడు, అసోం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేవలం 20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది.ఇందులో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తొలి మ్యాచ్‌లో మార్చి 28న డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతుంది. ఇందుకు బెంగళూరు వేదిక. ఇక రెండో మ్యాచ్‌లో ఏప్రిల్ 2న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కోల్‌కతాలో.. తదుపరి ఏప్రిల్ 5న హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్‌తో.. అనంతరం ఏప్రిల్ 11న పంజాబ్ కింగ్స్‌తో న్యూ చండీగఢ్‌లో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సన్‌రైజర్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి విడత షెడ్యూల్లో భాగంగా మూడు మ్యాచ్‌లు సొంత మైదానం వెలుపల ఆడటం తలనొప్పిగా మారుతుందన్నాడు.సన్‌రైజర్స్‌కు కష్టమే!‘‘గుజరాత్ టైటాన్స్‌తో పాటు సన్‌రైజర్స్ తొలి నాలుగు మ్యాచ్‌లలో మూడు సొంత మైదానంలో కాకుండా.. ఇతర వేదికలపై ఆడాల్సి ఉంది. నాకైతే సన్‌రైజర్స్ గురించే బాధంతా!వాళ్లకు ఫ్లాట్ పిచ్‌లు కావాలి. కానీ ఆయా వేదికల్లో వీరి కోసం ఎవరూ ఇలాంటి పిచ్‌ను తయారు చేయలేరు. సొంత మైదానంలో ఒకే ఒక్క మ్యాచ్.. అది కూడా మధ్యాహ్నం షెడ్యూల్ చేశారు. నిజానికి సన్‌రైజర్స్‌కు హోం గ్రౌండ్లో సీజన్ ఆరంభించడమే మంచిది.అక్కడైతే వారు శుభారంభం అందుకోగలరు. వారి విజయాలు, ఆత్మవిశ్వాసంపై ఇది కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా సన్‌రైజర్స్‌లో అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర వీరులు ఉన్న విషయం తెలిసిందే. చదవండి: IPL 2026: సన్‌రైజర్స్ షెడ్యూల్ ఇదే..!


