ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
మహబూబ్ నగర్: చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు నీట మునిగి మృతిచెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో ఆదివారం వెలుగుచూసింది. జిల్లాలోని కొత్తగూడెం మండలం ఎదళ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీచరణ్(6), శివ(6) చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.