Sri Lanka Test
-
శ్రీలంక పర్యటనకు కోచ్‌గా ద్రవిడ్
ముంబై: భారత ‘ఎ’, అండర్–19 జట్లకు కోచ్‌గా యువ ఆటగాళ్లను తీర్చిదిద్దిన మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తొలి సారి సీనియర్ టీమ్‌తో కలిసి పని చేయనున్నాడు. వచ్చే జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. భారత ద్వితీయ శ్రేణి జట్టుగా గుర్తించబడుతున్న ఈ టీమ్‌లో పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌లు అయిన పలువురు యువ ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. టూర్లో భాగంగా భారత్, లంక మధ్య 3 వన్డేలు, 3 టి20లు మ్యాచ్‌లు జరుగుతాయి. అగ్రశ్రేణి ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్‌తో టెస్టుల్లో తలపడుతున్న సమయంలోనే ఈ సిరీస్ జరగనుంది. హెడ్ రవిశాస్త్రితో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా అక్కడే ఉంటారు. దాంతో మరో ప్రత్యామ్నాయం కోసం చూసిన బీసీసీఐ...ద్రవిడ్‌ను అందుకు సరైన వ్యక్తిగా గుర్తించింది. పైగా జట్టులో ఎంపికయ్యే అవకా శం ఉన్న యువ ఆటగాళ్లందరూ ఇప్పటి వరకు అండర్–19, ‘ఎ’ టీమ్ సభ్యులుగా ద్రవిడ్ మార్గనిర్దేశనంలోనే తమ ఆటను మెరుగపర్చుకున్నవారే. దాంతో జట్టు పని మరింత సులువవుతుందని బోర్డు భావించింది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్‌గా వ్యవహరిస్తున్న ద్రవిడ్... కొన్నాళ్ల క్రితమే అండర్–19, ‘ఎ’ టీమ్ బాధ్యతలనుంచి తప్పుకున్నాడు. శ్రీలంక పర్యటనకు భారత మాజీ పేసర్, యూత్ కోచ్ పారస్ మాంబ్రే బౌలింగ్ కోచ్‌గా వెళ్లే అవకాశం ఉంది. -
శ్రీలంక 169 ఆలౌట్
నార్త్‌సౌండ్: వెస్టిండీస్ మాజీ కెప్టెన్, పేస్ బౌలర్ జేసన్ హోల్డర్ (5/27) నిప్పులు చెరగడంతో శ్రీలంక బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. ఫలితంగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 69.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను తొలుత కీమర్ రోచ్ (3/47) దెబ్బ తీయగా... అనంతరం జేసన్ హోల్డర్ హడలెత్తించడంతో శ్రీలంక ఇన్నింగ్స్‌కు తెర పడింది. లహిరు తిరిమన్నే (70; 4 ఫోర్లు), డిక్వెల్లా (32; 2 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ రెండో రోజు కడపటి వార్తలు అందే సమయానికి 67 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి ఆధిక్యం సంపాదించే దిశగా సాగుతోంది. -
ఢిల్లీ టెస్ట్.. బీసీసీఐపై ఎన్జీటీ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఫిరోజ్ షా కోట్ల టెస్ట్ నిర్వహణపై దాఖలైన ఓ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తీవ్ర కాలుష్య కోరల్లో చిక్కుకున్న నగరంలో మ్యాచ్ నిర్వహణ ఏంటని బీసీసీఐని ప్రశ్నించిన ఎన్జీటీ.. తదుపరి విచారణలోపు వివరణ ఇవ్వాలంటూ కోరింది. కాగా, కాలుష్యం కారణంగా ఆడలేకపోతున్నామంటూ ఆదివారం మాస్కులు ధరించిన శ్రీలంక ఆటగాళ్లు మైదానంలోనే నాటకీయ పరిణామాలకు తెరలేపిన విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం తీరును కూడా ప్రభుత్వం ఆక్షేపించింది. కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంటూ ప్రశ్నించింది. -
మళ్లీ హఫీజ్ ‘చకింగ్’
శ్రీలంకతో టెస్టులో పాకిస్తాన్ ఆల్‌రౌండర్ హఫీజ్ బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉం దని అంపైర్లు నివేదిక ఇచ్చారు. గత నవంబరులో న్యూజిలాండ్‌తో టెస్టులో ‘చకింగ్’ చేశాడంటూ ఐసీసీ హఫీజ్ బౌలింగ్‌పై నిషేధం విధించింది. అయితే పరీక్షలకు వెళ్లి క్లియరెన్స్ తెచ్చుకున్నాడు. ఏడాది వ్యవధిలో రెండోసారి హఫీజ్‌పై మళ్లీ ‘చకింగ్’ ఆరోపణ వచ్చింది. ఈ నేపథ్యంలో అతనిపై ఏడాదిపాటు నిషేధించే అవకాశం ఉంది.