‘గానకళ’ శ్రీరామమూర్తి కన్నుమూత
బోట్‌క్లబ్ (కాకినాడ) : ‘గానకళ’ సంపాదకుడు, సంగీత సభ వ్యవస్థాపక కార్యదర్శి మునుగంటి శ్రీరామమూర్తి సోమవారం రాత్రి మృతి చెందారు. ఆయన 1925లో జన్మించారు. 1962లో గానకళ పత్రిక ప్రారంభించి నేటికీ కొనసాగిస్తున్నారు. పదిరోజులు క్రితం స్థానిక ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోని సత్కళావాహిని వార్షిక మహోత్సవంలో సంగీత కచేరీ చేసి అందరినీ అబ్బురపరిచారు . ఆయన మరణం కాకినాడ నగరానికి తీరని లోటని సంగీత విద్వాంసులు సంతాపం వ్యక్తం చేశారు. వయస్సు మీద పడ్డా సంగీతం పట్ల ఆయనఎంతో మక్కువ కనబర్చేవారని పరివర్తన కార్యదర్శి వక్కలంక రామకృష్ణ తెలిపారు. ఆయన మృతికి సత్కళావాహిని కార్యదర్శి ఈవీ కృష్ణమాచార్యులు సంతాపం తెలిపారు.