వేములవాడ రాజన్న దశ మారేనా?
వేములవాడ అర్బన్ : పేదల దేవుడు, రాష్ట్రంలోనే అతిపెద్ద ఆలయం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి ఎమ్మెల్యే రమేశ్ చెన్నమనేని రూ.145 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రతిపాదనలు తయూరు చేశారు. వీటిని ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేసినట్లు తెలిసింది. ఇతర ఆలయూలకు రూ.కోట్లు వెచ్చిస్తున్న సీఎం కేసీఆర్.. ఎములాడ రాజన్నను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నారుు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని రాజన్న భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అధికారులతో కసరత్తు చేయించారు. పలు అభివృద్ధి పనులపై నివేదిక రూపొందించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించే అవకాశాలున్నట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే జర్మనీ పర్యటన ముగిశాక సీఎం పర్యటన తేదీ ఖరారవుతుందని అంటున్నారు.
కేసీఆర్పైనే ఆశలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.200 కోట్లు వెచ్చిస్తామని, రాజన్న భక్తుల సమస్యలు పరిష్కరిస్తామని, దేవస్థానాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పర్చుతామని 2012 వేములవాడ పర్యటనలో కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తొలి ప్రభుత్వం టీఆర్ఎస్ కావడం, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టడంతో రాజన్న ఆలయ అభివృద్ధికి చర్యలు తాసుకుంటారని పట్టణవాసులతో పాటు రాజన్న భక్తుల ఆశించారు.
తొలుత యాదగిరిగుట్టపై దృష్టి సారించిన సీఎం.. అక్కడి ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు ప్రకటించడమే కాకుండా ప్రతీ బడ్జెట్లో రూ.వందకోట్లు కేటాయిస్తున్నట్లు ప్రక టించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు రాజన్నకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల మధ్య రూ.145 కోట్ల వ్యయంతో దేవస్థానం అభివృద్ధికి ఎమ్మెల్యే నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి కార్యాలయంలో సమర్పించారు. దీంతో పనుల్లో కదలిక ప్రారంభమైనట్లు భక్తులు భావిస్తున్నారు. అరుుతే, వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు సీఎం కేసీఆర్ హాజరైతే స్పష్టత వస్తుందని వారు ఆశిస్తున్నారు.