రాజన్న ఆలయంలో బయోమెట్రిక్
వేములవాడ : రాజన్న ఆలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చింది. గురువారం ఆలయ ఉద్యోగులు బయోమెట్రిక్ మిషన్ వద్ద హాజరు నమోదు చేసి విధులకు హాజరయ్యారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ అధికారులు ఉద్యోగుల వేలిముద్రలు సేకరించారు. ప్రధాన ఆలయంలో అర్చకులు, ఉద్యోగులకు విచారణ కార్యాలయం, ఎస్టాబ్లిష్మెంట్ కార్యాలయంలో మొత్తం మూడుచోట్ల బయోమెట్రిక్ మిషన్ ఏర్పాటు చేసినట్లు ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు. ఇప్పటి వరకు విధులకు గైర్హాజరవుతూ నిర్లక్ష్యం వహించిన సిబ్బంది కొందరికి ఈ విధానం మింగుడుపడడం లేదు.