sri ramakrishna matam
-
Tirumala: నేడు రామకృష్ణ తీర్థ ముక్కోటి
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో12 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న మంగళవారం 65,991 మంది స్వామివారిని దర్శించుకోగా 21,959 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.57 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఏర్పాట్లు పూర్తి తిరుమలలో జనవరి 25న గురువారం ఉదయం 7.30 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళతారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. కాగా, అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లడానికి అనుమతి లేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరడమైనది. కాగా, గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఎపిఎస్ఆర్టీసీ దాదాపు 35 బస్సులను ఏర్పాటు చేస్తోంది. గురువారం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతిస్తారు. ఈ తీర్థానికి వెళ్లే యాత్రికులకు టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాలు, కాఫీ, పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. -
గోదావరీ తీరాన వివేక సూర్యోదయం
రాజమండ్రి కల్చరల్, న్యూస్‌లైన్ : భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని దిగంతాలవరకు చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడు. శ్రీరామకృష్ణ మఠం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలు 2011లో ప్రారంభమయ్యాయి. ఆ ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు రాజమండ్రి ప్రభుత్వ అటానమస్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. దానికోసం భారీగా ఏర్పాట్లు చే స్తున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేం దుకు దేశవ్యాప్తంగాగల శ్రీరామకృష్ణ మఠాలకు చెందిన స్వామీజీలు, పీఠాధిపతులు, మేధావులు రానున్నారు. వారందరూ ఆవేదికపై నుంచి ఉత్తేజకరంగా ప్రసంగాలు చేయనున్నారు. గోదావరితో వివేకానందునికి పరోక్ష అనుబంధం గోదావరీ తీరంతో స్వామి వివేకానందునికి పరోక్షంగా ప్రగాఢ అనుబంధం ఉంది. రాజమండ్రి వాసి ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావుకు స్వామి వివేకానందునితో ప్రత్యక్షంగా అనుబంధం ఉంది. అమెరికా, యూరోప్ దేశాలలో భారతీయ సనాతన ధర్మవాణిని ఎలుగెత్తి చాటాక 1897 ఫిబ్రవరిలో వివేకానందుడు భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయనకు ఘనస్వాగతం చెప్పడానికి మద్రాసుకు చెందిన హేమాహేమీలతో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీకి అధ్యక్షుడు న్యాపతి సుబ్బారావే. అంతేకాదు 1897 ఫిబ్రవరి 11, 14 తేదీల్లో మద్రాసు నగరంలోని విక్టోరియా హాల్లో స్వామి వివేకానందుడు ‘భారతదేశంలో సాధుపురుషులు’ , ‘భారతదేశం భవిత’ అనే అంశాలపై ప్రసంగించారు. ఆ రెండు సభలకు న్యాపతి సుబ్బారావే అధ్యక్షత వహించారు. తనకో జీవిత గమ్యాన్ని, లక్ష్యాన్ని అనుగ్రహించాల్సిందిగా న్యాపతి వివేకానందుని కోరారు. భగవద్గీతను ప్రచారం చేయాల్సిందిగా స్వామి ఆయనకు సూచించారు. ఆ క్రమంలో రాజమండ్రి టి.నగరులో హిందూ సమాజాన్ని న్యాపతి సుబ్బారావు స్థాపించడం వెనుక వివేకానందుని ప్రేరణ ఉంది. రామకృష్ణ మఠం సేవలు రాజమండ్రిలో రామకృష్ణ మఠం 1951లో ప్రారంభమైంది. మఠం ఆధ్వర్యంలో నగరంలో నిర్వహిస్తున్న ధర్మాసుపత్రి నామమాత్రపు రుసుముతో అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద వైద్యసేవలను చిరకాలంగా అందిస్తోంది. 30 ఏళ్లుగా రంపచోడవరం, చుట్టుపక్కల గ్రామాలలో రామకృష్ణమఠం వైద్యసేవలు అందిస్తోంది. సంచార వైద్యవాహనాల్లో రంపచోడవరం చుట్టుపక్కల నాలుగు మండలాల్లో గిరిజనులకు ఉచితంగా వైద్యసేవలు, మందులు అందజేస్తున్నారు.