యువతి కిడ్నాప్‌కు యత్నం: నిందితులకు దేహశుద్ధి
పశ్చిమగోదావరి జిల్లా టి. నరసాపురం మండలం శ్రీరామవరంలో ఈ రోజు తెల్లవారుజామున కొంత మంది యువకులు ఓ యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అయితే ఆ యువతి బిగ్గరగా అరవడంతో స్థానికులు వెంటనే స్పందించి కిడ్నాప్‌నకు యత్నించిన యువకులను పట్టుకున్నారు.
అనంతరం స్థానికులు యువకులను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అలాగే యువకుల చెందిన వాహనాలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.