పండ్ల ధరలకు రెక్కలు వచ్చాయి
బెంగళూరు, న్యూస్‌లైన్ : శ్రీ వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో పూలు, పండ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. నాలుగైదు రోజులతో పోల్చుకుంటే గురువారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. కిలో రూ.10 కంటే త క్కువ ధర ఉన్న చెండు పూలు ప్రస్తుతం రూ.100కు పెరిగింది. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ధరలు పెరగడానికి కారణమయ్యాయి. రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు పడి పూలు, పండ్ల పంటలు దెబ్బతిన్నాయి.
మరో పక్క వర్షాభావ పరిస్థితులు అనేక చోట్ల పంటలే పెట్టలేదు. వరలక్ష్మి వ్రతానికి పూలు, పండ్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. రైతుల వద్ద వ్యాపారులు ఉత్పత్తులన్నిటినీ కొనుగోలు చేయడంతో, ఇక వారు చెప్పిన ధరలనే వినియోగదారులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. శుక్రవారం ఈ ధర మరింతగా పెరగవచ్చని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
మల్లెపూల ధర కేజీ రూ.1,000, కనకాంబరాలను రూ.1,500 వరకు విక్రయించారు. మూడు రోజుల కిందటి వరకు మల్లెల ధర రూ.300, కనకాంబరాలు రూ.400-500 పలికేవి. పండ్ల ధరలు కూడా చుక్కలనంటుతుండడంతో వినియోగదారులు హాప్కామ్స్ను ఆశ్రయిస్తున్నారు. మార్కెట్లతో పోల్చుకుంటే హాప్‌కామ్స్‌లో ధర తక్కువగా ఉంటోంది. గురువారం సిటీ మార్కెట్లో పండ్లు, పూల ధరలు కింది విధంగా ఉన్నాయి.