Srinubabu Gedela
-
లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో అవకాశాలు అపారం : పల్సస్ సీఈవో
లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో ఇన్ఫ్యూజన్ ఇంజినీరింగ్, సాఫ్ట్‌స్కిల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయని పల్సస్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీనుబాబు అన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మసీ, ఇంజనీరింగ్, సాఫ్ట్ స్కిల్స్‌లోని అవకాశాలపై చర్చించేందుకు రఘు ఫార్మసీ కాలేజీ, ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్లు, విద్యార్థులు, ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్, ఫార్మసీ, ఇంజనీరింగ్, సాఫ్ట్ స్కిల్స్‌లో ప్రావిణ్యాల్ని పెంపొందించుకోవాలని తెలిపారు. తద్వారా అవకాశాల్ని అందింపుచ్చుకోవచ్చన్నారు. టెక్నాలజీలో చోటుచేసుకుంటున్న గణణీయమైన మార్పులపై దృష్టిసారించాలని .. ఫార్మాస్యూటికల్స్ , ఏఐ వ్యాప్తి, డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాల గురించి హైలైట్ చేశారు. ఇంజినీరింగ్ టెక్నిక్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇన్ లైఫ్ సైన్సెస్ ఇండియా, ఫార్మాస్యూటికల్ ఇన్నోవేషన్లు, ఉపాధి, గ్లోబల్ హెల్త్‌కేర్ సపోర్ట్ విభాగంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఖరీదైన మెడిసిన్ తయారు చేయడం ఖర్చతో కూడుకుంది. అయినప్పటికీ భారత్ ఫార్మా రంగంలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. -
ప్రధాని మోదీతో గేదెల శ్రీనుబాబు భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పల్సస్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీనుబాబు భేటీ అయ్యారు. బీసీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. గత రెండు దశాబ్దములలో ఉత్తరాంధ్ర నుండి 25 లక్షల మంది జీవనోపాధి కొరకు వలస పోయారని ప్రధానికి తెలిపారు. ముక్యంగా హైదరాబాద్ కు 15 లక్షల మంది వలస పోయారని వివరించారు. 2014 లో తెలంగాణ రాష్ట్రము విడిపోయిని తరువాత తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించిన ఉత్తరాంధ్ర మరియు ఆంధ్రకు చెందిన 26 కులాలను బీసీ జాబితాలో మరల వాటిని చేర్పించాలని, కేంద్రం ఓబీసీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరారు. శ్రీనుబాబు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. తెలంగాణ పర్యటనకి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీని హైదరాబాద్‌లో కలిసిన తెలుగు రాష్ట్రాల బీసీల నాయకుడు, పల్సస్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీనుబాబు బీసీల సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలుగా ఉన్న 26 కులాలను 2014 రాష్ట్ర విభజనతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలగించడంతో వీరంతా సామాజిక, ఆర్థిక అన్యాయానికి గురయ్యారని తెలిపారు. ఈ సమస్యను పునఃపరిశీలించి, సరిదిద్దేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు. ఈ 26 కులాలను తెలంగాణలోని వెనుకబడిన తరగతుల జాబితాలో మళ్లీ చేర్పించడం ద్వారా దాదాపు 30 లక్షల మందికి న్యాయం చేసిన వారవుతారని మోదీకి వివరించారు. బీసీల ఆశాజ్యోతి ప్రధానిగా ఉన్న మన దేశంలో బీసీలకి జరుగుతున్న అన్యాయంపై స్పందిస్తారనే భరోసా లభించిందని శ్రీనుబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీ జాబితాలో చేర్చడంతోపాటు కేంద్రం ఓబీసీలో చేర్చినప్పుడు ఈ 26 కులాలకి జరిగిన అన్యాయం సరిదిద్దినట్టు అవుతుందని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఏళ్లుగా పోరాడుతున్న ఈ 26 కులాలను తెలంగాణలో బీసీ, కేంద్రంలో ఓబీసీ జాబితాలో స్థానం కల్పిస్తే...అత్యంత వెనకబడి, వివక్షకి గురైన ఈ కులాలకు విద్య, విజ్ఞాన, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయని ప్రధాని మోదీకి శ్రీనుబాబు వివరించారు. -
పవన్‌కు గేదెల శ్రీనుబాబు ఝలక్
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనివాస్ అలియాస్ శ్రీనుబాబు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కాగా ఇటీవల పవన్ కల్యాణ్ లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలోనే గేదెల శ్రీనివాస్ పేరును ప్రకటించారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన వైఎస్సార్ సీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు టీడీపీ నెల్లూరు రూరల్ నుంచి టికెట్ ఖరారు అయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఇవాళ వైఎస్సార్ సీపీలో చేరిన విషయం తెలిసిందే. చదవండి.....(జనసేన తొలి జాబితా విడుదల)