ప్రమాదవశాత్తూ కార్మికుడి మృతి
హైదరాబాద్ సిటీ: జీడిమెట్లలోని శ్రీపతి ఫార్మా కంపెనీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదవశాత్తూ సునీల్ కుమార్ (24) అనే కార్మికుడు ఒకటో అంతస్తు మీది నుంచి కింద పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కుటుంబసభ్యులు, తోటి కార్మికుల ఆందోళనతో బాధిత కుటుంబానికి యాజమాన్యం రూ.7 లక్షల నష్ట పరిహారం చెల్లించింది. బిహార్‌కు చెందిన సునీల్ ప్రస్తుతం రామిరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.