మూతపడనున్న నోకియా ప్లాంటు
చెన్నై: తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ లో ఉన్న నోకియా ప్లాంటు నవంబర్ ఒకటో తేదీ నుంచి మూత పడనుంది. మైక్రోసాఫ్ట్- నోకియా ఒప్పందంలో భాగంగా దీన్ని మూసివేయనున్నారు. దీంతో ఈ యూనిట్లో ఫోన్ల ఉత్పత్తి ఆగిపోనుంది.
2004లో తమిళనాడు ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు నోకియా ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించింది. శ్రీపెరుంబుదూర్ నోకియా ప్లాంటులో 8 వేల మంది ప్రత్యక్షంగా, 25 వేల మంది పరోక్షంగా పనిచేస్తున్నారు. బెసిక్ జీఎస్ఎం ఫోన్లను ఇక్కడ తయారుచేస్తున్నారు. శనివారం నుంచి ఇక్కడ అన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. నోకియాను మైక్రోసాఫ్ట్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే.