‘అడల్ట్’కు ఓకే!
సినిమాలో ఉండాలి గాని మజా సెన్సార్ వాళ్లు ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తే ఏంటి అనుకున్నట్టున్నాడు బాలీవుడ్ దర్శకుడు శ్రీరామ్‌రాఘవన్! రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న తన ‘బదలాపూర్’ సినిమాలో కొన్ని సీన్లు కట్ చేయమని సెన్సార్ బోర్డు ఇచ్చిన సలహా మనోడికి అస్సలు ఎక్కలేదట.
కట్ల ప్రసక్తే లేదని బోర్డుకు తెగేసి చెప్పాడట. ‘యూఏ’ సర్టిఫికెట్ కావాలంటే చెప్పిన సన్నివేశాలు తొలగించాల్సిందేనని అంతే గట్టిగా చెప్పిందట బోర్డు. లేదంటే ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేస్తామందట. రెండో ఆలోచన లేకుండా శ్రీరామ్... ‘అయితే అడల్ట్ సర్టిఫికెట్ ఇచ్చేసేయండి’ అంటూ ఠక్కున సెలవిచ్చాడట బోర్డుకు!
బాగా అడ్వాన్స్డ్గా ఉన్న కొన్ని రొమాంటిక్, గ్రాఫిక్స్‌లో చూపిన వయోలెన్స్ సన్నివేశాలను బోర్డు తొలగించమందనేది ‘ముంబై మిర్రర్’ కథనం. వరుణ్‌ధావన్, హ్యూమా కురేషి, యామీ గౌతమ్,
రాధికా ఆప్టే తారాగణం.