నిందితులను కఠినంగా శిక్షించాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్: జంటహత్యల కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని లంబాడ హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి శ్రీరాములు నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసుల వైఫల్యం వల్లే హత్యలు జరిగాయన్నారు. అంతేకాకుండా సంఘటన జరిగి 10 రోజులవుతున్నా, పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారన్నారు.
సమావేశంలో అఖిల భారత బంజారాల జాతీయ అధ్యక్షుడు ఎస్కే కేశవ నాయక్, బంజారా క్రాంతిద⌠రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే మహేష్ నాయక్, జీవీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు శివశంకర నాయక్, కృష్ణనాయక్, శ్రీరాములు నాయక్, మల్లేష్ నాయక్, వెంకటేష్ నాయక్, అశోక్ నాయక్ పాల్గొన్నారు.