గాయకుడిగా మారిన అల్లు శిరీష్
సౌత్ హీరోలు గాయకులుగా కూడా సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా తమన్ సంగీత సారధ్యంలో చాల మంది హీరోలు తమ గొంతును సవరించుకుంటున్నారు. సింగర్ వాయిస్‌తో సంబందం లేకుండా టెక్నాలజీని ఉపయోగించి ప్రతీ ఒక్కరినీ గాయకులుగా మార్చేస్తున్నాడు తమన్. ఇప్పటికే ఎన్టీఆర్, రవితేజలతో పాటు ధనుష్, శింబు లాంటి తమిళ స్టార్లతో కూడా తెలుగు పాటలు పాడించాడు తమన్. అదే బాటలో మరో యంగ్ హీరోను సింగర్‌గా మార్చేశాడు.
ఇటీవల శ్రీరస్తు శుభమస్తు సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన అల్లు వారబ్బాయి శిరీష్‌తో ఓ పాట పాడించాడు తమన్. అయితే ఈ పాటను సినిమాలో యాడ్ చేయకపోయినా యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన తమన్, ఈ గాయకుడు ఎవరో గుర్తుపట్టమంటూ పజిల్ విసిరాడు. అయితే పాట పాడుతున్నప్పుడు అర్థం కాకపోయినా మధ్యలో వచ్చిన డైలాగ్స్‌లో మాత్రం అది శిరీష్ వాయిసే అని అర్ధమైపోతోంది. ఇదే జోష్‌లో తన నెక్ట్స్ సినిమాలో కూడా శిరీష్ పాటపాడేస్తాడేమో చూడాలి.
So! It was me who sang the cover version of 'Anu Anu' song. Here's the full version. Lemme know what you felt. https://t.co/vwfc76MUOo
— Allu Sirish (@AlluSirish) 17 August 2016