SRIT College
-
ఆయకట్టు దారులంటే నిర్లక్ష్యమా?
– శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత ఆలూరి సాంబశివారెడ్డి అనంతపురం : ఆయకట్టు దారుల పట్ల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత ఆలూరి సాంబశివారెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఎస్ఆర్ఐటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హెచ్ఎల్సీ కింద శింగనమల నియోజకవర్గం పరిధిలో సుమారు 55 వేల ఎకరాలు సాగు చేస్తున్నారన్నారు. గతేడాది నీరు ఇవ్వకపోవడంతో భూములన్నీ బీళ్లుగా మారాయన్నారు. ఈసారి అదే పరిస్థితి ఉందని, నీళ్లు అందుబాటులో ఉన్నా ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆయకట్టుదారులతో కలిసి కలెక్టరేట్ ఎదుట గత నెలలో ధర్నా కూడా చేశామని గుర్తు చేశారు. తుంగభద్ర కాకుండా శ్రీశైలం నుంచి కష్ణాజలాలు కూడా హంద్రీ–నీవా ద్వారా దాదాపు 6 టీఎంసీలు నీళ్లు అదనంగా వచ్చాయన్నారు. ఆ నీటిని వదిలినా ఆయకట్టు రైతులు పంటలు సాగుచేసుకునేందుకు వీలవుతుందన్నారు. కష్ణా జలాలు మరో 10 టీఎంసీలు జిల్లాకు వస్తాయని ప్రజాప్రతినిధులు చెబుతున్నారని, మరి అందుబాటులో ఉన్న 6 టీఎంసీల నీళ్లు ఎందుకు నిల్వ ఉంచారని ప్రశ్నించారు. మొత్తం నీటిని స్టోరేజీ చేసి కుప్పం తరలించేందుకు కుట్ర పన్నారా? అనే అనుమానాలను వ్యక్తం చేశారు. హక్కుగా రావాల్సిన నీటిని ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు నాగలింగారెడ్డి, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు జయరామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండన్న, మాజీ సర్పంచు నారాయణస్వామి, యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఎస్‌ఆర్‌ఐటీలో సినీతారల సందడి
బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో సినీతారలు సందడి చేశారు. ఎస్ఆర్ఐటీ కాలేజీ చైర్మన్ జొన్నలగడ్డ పద్మావతి, కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి కుమారుడు విరాట్ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలను నిర్వహించారు. ఫౌండర్ ఆఫ్ వైబ్రంట్ లివింగ్ ఫుడ్స్ ప్రతినిధి శ్రీదేవి జాస్తి, ఇంటర్నేషన్ ఫేస్ యోగా ట్రైనర్ మన్సీ గులాటి, ప్రముఖ సినీనటి అర్చన, యువ హీరో దిలీప్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మొక్కలు నాటారు. -
ఎస్‌ఆర్‌ఐటీకి యూజీసీ గుర్తింపు
జేఎన్టీయూ/బుక్కరాయసముద్రం: శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల (ఎస్ఆర్ఐటీ)కి అరుదైన గుర్తింపు లభించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) 12–బీ స్థాయి నైపుణ్యాలున్న కళాశాలగా గుర్తించింది. జిల్లాలో యూజీసీ గుర్తింపు ఉన్న ఏకైక కళాశాలగా ఎస్ఆర్ఐటీ ఆవిర్భవించింది. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో 118 జేఎన్టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రమాణాలు, నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నట్లు యూజీసీ 33 కళాశాలలను గుర్తించింది. ఈ జాబితాలో ఎస్ఆర్ఐటీ చేరినట్లయింది. నాణ్యమైన విద్యా బోధనతో గుర్తింపు : రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడారు. ఎస్ఆర్ఐటీ కళాశాలలో విద్యార్థులకు అధునాతన సౌకర్యాలు కల్పనతో పాటు అత్యుత్తమ విద్యా భోదన అందిస్తున్నామన్నారు. ప్రతి ఏటా వందలాది మందికి క్యాంపస్ ఇంటర్వూల్లో ఎంపికవుతున్నారన్నారు. కార్యక్రమంలో కళాశాల సీఈఓ జగన్మోçßæన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.