ఎస్ఆర్ఐటీ అధ్యాపకురాలికి డాక్టరేట్
బుక్కరాయసముద్రం: రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం అధ్యాపకురాలు దీప్తికి జేఎన్టీయూ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి తెలిపారు. ‘మెషిన్ లర్నింగ్ అప్రోచ్ ఫర్ సూటబుల్ కెర్నల్ పంక్షన్ అండ్ అప్లికేషన్ ఆన్ ఇమేజస్’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ దీప్తిని కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి, సీఈఓ జగన్మోహన్రెడ్డి, సీఏఓ రంజిత్‌రెడ్డి, రీసెర్చ్ విభాగం అధిపతి అమర్నాథ్ అభినందించారు.