తిరుమల: ఉచిత దర్శనాలను పునరుద్ధరిస్తాం
సాక్షి, తిరుమల: నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నాన మహోత్సవ వైభవంగా ముగిసింది.. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, చక్రాతాళ్వార్కు ప్రత్యేక స్నపన తిరుమంజనం నిర్వహించారు. చక్రస్నానం మహోత్సవం అనంతరం టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం వైభవోపేతంగా నిర్వహించామని అన్నారు.
సాయంత్రం నిర్వహించే అధ్యాత్మిక కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయని చెప్పారు. స్వామి వారి సంకల్పంతోనే బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా ఏకాంతంగా జరిగాయని తెలిపారు. నవరాత్రి ఉత్సవాలలో ఎటువంటి ఆటంకం లేకుండా అర్చకులు, జీయర్ స్వాములు నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన టోకెన్ల పెంపుపై అధికారులతో సమీక్షించి, మరో రెండు రోజుల్లో తుది నిర్ణయం వెల్లడిస్తాంమని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు