Srivatsanka
-
శ్రీవాత్సంకకు కన్నీటి వీడ్కోలు
కేయూక్యాంపస్ : ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ సమీపంలోని ప్రగతినగర్‌కు చెందిన నల్లాని చక్రవర్తుల శ్రీవాత్సంక(24)కు తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇంజనీరింగ్‌లో రెండు నెలల క్రితమే ఎంఎస్ పూర్తిచేసిన ఆయన ఈ నెల 23న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నుంచి ఓ గ్రామానికి స్నేహితుడితో కలసి తన కారులో వెళ్తుండగా చెట్టుకు ఢీకొని శ్రీవాత్సంక మృతిచెందిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి మృతదేహం రాగా హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ప్రగతినగర్‌లోని నివాస గృహంలో ఉంచారు. మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ఉన్నతవిద్య ఆర్జేడీ బి.దర్జన్, కేడీసీ అధ్యాపకులు, రిటైర్డ్ అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్ల సంఘం బాధ్యులు, ప్రగతినగర్ కాలనీవాసులు పలువురు సందర్శించారు. నివాళులర్పించారు. శ్రీవాత్సంక తండ్రి కేడీసీ అధ్యాపకుడు అయిన డాక్టర్ ఎన్వీఎన్ చారిని పరామర్శిం చారు. శ్రీవాత్సంక మృతికి సంతాపం తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో యూ నివర్సిటీ సమీపంలోని పోచమ్మకుంటలోని స్మశాన వాటికలో శ్రీవాత్సంక అంత్యక్రియలు జరిపారు. -
కడసారి చూపు కోసం తల్లిదండ్రుల నిరీక్షణ
ఆస్ట్రేలియాలో మృతిచెందిన శ్రీవాత్సంక నేడు సిడ్నీ నుంచి మృతదేహం రాక 30న హన్మకొండలో అంత్యక్రియలు కేయూక్యాంపస్ : ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈనెల 23వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హన్మకొండకు చెందిన నల్లాని చక్రవర్తుల శ్రీవాత్సంక మృతదేహం గురువారం సిడ్నీ నుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకవచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ లెక్చరర్ డాక్టర్ ఎన్వీఎన్ చారీ కుమారుడైన శ్రీవాత్సంక రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీకి వెళ్లాడు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ సిడ్నీలో ఎంఎస్(ఎంటెక్) మెకానికల్ ఇంజినీరింగ్‌లో ప్రవేశంపొంది రెండు నెలల క్రితమే ఆ కోర్సును పూర్తి చేశాడు. పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఆయన ఈనెల 23న సిడ్నీ నుంచి పూజ కోసం ఓ గ్రామానికి స్నేహితుడితో కారులో వెళ్తూ చెట్టుకు డీకొన్న సంఘటనలో మృతిచెందిన విషయం విధితమే. ఉన్నత విద్య కోసం వెళ్లిన తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తల్లిదండ్రులకు కడపుకోత మిగిల్చింది. కడసారి చూపు కోసం తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్‌లో నిరీక్షిస్తున్నారు. సిడ్నీలో శ్రీవాత్సంక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఇక్కడికి తరలించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. ఈనెల 29న ఉదయం 10 గంటలకు సిడ్నీ నుంచి విమానంలో శ్రీవాత్సంక మృతదేహం హైదరాబాద్‌కు రానుంది. అదేరోజు అర్ధరాత్రి వరకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఈనెల 30వ తేదీ ఉదయం ఆరు గంటలకు హన్మకొండలోని తమ స్వగృహానికి మృతదేహాన్ని తీసుకరానున్నారు. ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరుపుతామని డాక్టర్ ఎన్వీఎన్ చారీ బుధవారం వెల్లడించారు. ఎంఎస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన శ్రీవాత్సంక హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ రెండోగేట్ సమీపంలో నివాసం ఉండే డాక్టర్ ఎన్వీఎన్ చారీ కుమారుడు ఎన్సీహెచ్ శ్రీవాత్సంక విద్యార్థి దశ నుంచి చదువులో ప్రతిభ కనపర్చేవాడు. హన్మకొండలోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు, 8, 9 తరగతులు రామన్ స్కూల్లో, పదో తరగతి తేజస్వినీ హైస్కూల్ విద్యను పూరి ్తచేశాడు. హైదరాబాద్‌లో శ్రీ చైతన్యలో ఇంటర్ ఎంపీసీ, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కిట్స్ కళాశాలలో 2013లో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేశాడు. ఆ తరువాత రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో ఇంజినీరింగ్‌లో ఎంఎస్ కోర్సు చదివేందుకు వెళ్లి ఆ కోర్సును కూడా రెండు నెలల క్రితం పూర్తిచేశాడు. మరో వైపు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఎంబీఏ డిప్లోమా కోర్సును కూడా చేసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. శ్రీవాత్సంక ఒకటి రెండు షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశాడు. -
ఆవిరైన కోటి ఆశలు..
ఆస్ట్రేలియాలో ఓరుగల్లు యువకుడి మృతి కారు చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసిన శ్రీవాత్సంక ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశానికి వెళ్లిన విద్యార్థి.. అర్ధంతరంగా తనువు చాలించాడు. హన్మకొండకు చెందిన నల్లాని చక్రవర్తుల శ్రీవాత్సంక(24) ఎంఎస్ చేసేందుకు రెండేళ్ల క్రితం సిడ్నీ వెళ్లాడు. ఆ కోర్సు పూర్తయాక అక్కడే పార్ట్‌టైం జాబ్ చేస్తూ ఎంబీఏ డిప్లొమాకు దరఖాస్తు చేసుకున్నాడు. దసరా రోజున మిత్రుడితో కలిసి పూజ కోసం వెళ్తుండగా.. కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాద సమయంలో శ్రీవాత్సంక కారు నడుపుతున్నట్లు, సుధీర్ గాయాలతో బయటపడినట్లు తెలిసింది. తండ్రితో మాట్లాడిన కొద్ది గంటలకే... శ్రీవాత్సంక హైదరాబాద్ లో ఇంటర్, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో బీటెక్ కోర్సు పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంఎస్ కోసం సిడ్నీ వెళ్లాడు. ఎప్పుడూ చురుగ్గా ఉండే అతడు...సొంతంగా ఒకటి, రెండు షార్ట్ ఫిల్మ్‌లు కూడా తీశాడు. ఈ ఏడాది జనవరిలో హన్మకొండలోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. తరచూ తల్లిదండ్రులతో మాట్లాడే శ్రీవాత్సంక....గురువారం తండ్రి చారితో మాట్లాడి పూజకు వెళుతున్నట్లు చెప్పాడు. కొద్ది గంటలకే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన శ్రీవాత్సంక కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతడి మృతదేహాన్ని బుధ లేదా గురువారం స్వస్థలానికి తీసుకు వచ్చే అవకాశం ఉంది.