శ్రీవాత్సంకకు కన్నీటి వీడ్కోలు | Srivatsanka to the tearful goodbye | Sakshi
Sakshi News home page

శ్రీవాత్సంకకు కన్నీటి వీడ్కోలు

Published Sat, Oct 31 2015 1:38 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

శ్రీవాత్సంకకు కన్నీటి వీడ్కోలు - Sakshi

శ్రీవాత్సంకకు కన్నీటి వీడ్కోలు

కేయూక్యాంపస్ : ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ సమీపంలోని ప్రగతినగర్‌కు చెందిన నల్లాని చక్రవర్తుల శ్రీవాత్సంక(24)కు తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇంజనీరింగ్‌లో రెండు నెలల క్రితమే ఎంఎస్ పూర్తిచేసిన ఆయన ఈ నెల 23న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నుంచి ఓ గ్రామానికి స్నేహితుడితో కలసి తన కారులో వెళ్తుండగా చెట్టుకు ఢీకొని శ్రీవాత్సంక మృతిచెందిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి మృతదేహం రాగా హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ప్రగతినగర్‌లోని నివాస గృహంలో ఉంచారు.

మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ఉన్నతవిద్య ఆర్జేడీ బి.దర్జన్, కేడీసీ అధ్యాపకులు, రిటైర్డ్ అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్ల సంఘం బాధ్యులు, ప్రగతినగర్ కాలనీవాసులు పలువురు సందర్శించారు. నివాళులర్పించారు. శ్రీవాత్సంక తండ్రి కేడీసీ అధ్యాపకుడు అయిన డాక్టర్ ఎన్‌వీఎన్ చారిని పరామర్శిం చారు. శ్రీవాత్సంక మృతికి సంతాపం తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో యూ నివర్సిటీ సమీపంలోని పోచమ్మకుంటలోని స్మశాన వాటికలో శ్రీవాత్సంక అంత్యక్రియలు జరిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement