ఆవిరైన కోటి ఆశలు.. | Orugallu young man death in Australia | Sakshi
Sakshi News home page

ఆవిరైన కోటి ఆశలు..

Published Sat, Oct 24 2015 1:48 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఆవిరైన కోటి ఆశలు.. - Sakshi

ఆవిరైన కోటి ఆశలు..

ఆస్ట్రేలియాలో ఓరుగల్లు యువకుడి మృతి
కారు చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం
ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసిన శ్రీవాత్సంక

 
ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశానికి వెళ్లిన విద్యార్థి.. అర్ధంతరంగా తనువు చాలించాడు. హన్మకొండకు చెందిన నల్లాని చక్రవర్తుల శ్రీవాత్సంక(24) ఎంఎస్ చేసేందుకు రెండేళ్ల క్రితం  సిడ్నీ వెళ్లాడు. ఆ కోర్సు పూర్తయాక అక్కడే పార్ట్‌టైం జాబ్ చేస్తూ ఎంబీఏ డిప్లొమాకు దరఖాస్తు చేసుకున్నాడు. దసరా రోజున మిత్రుడితో కలిసి పూజ కోసం వెళ్తుండగా.. కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాద సమయంలో శ్రీవాత్సంక కారు నడుపుతున్నట్లు, సుధీర్ గాయాలతో బయటపడినట్లు తెలిసింది.

తండ్రితో మాట్లాడిన కొద్ది గంటలకే...
శ్రీవాత్సంక హైదరాబాద్ లో ఇంటర్, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో బీటెక్ కోర్సు పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంఎస్ కోసం సిడ్నీ వెళ్లాడు. ఎప్పుడూ చురుగ్గా ఉండే అతడు...సొంతంగా ఒకటి, రెండు షార్ట్ ఫిల్మ్‌లు కూడా తీశాడు. ఈ ఏడాది జనవరిలో హన్మకొండలోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. తరచూ తల్లిదండ్రులతో మాట్లాడే శ్రీవాత్సంక....గురువారం తండ్రి చారితో మాట్లాడి పూజకు వెళుతున్నట్లు చెప్పాడు. కొద్ది గంటలకే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన శ్రీవాత్సంక కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతడి మృతదేహాన్ని బుధ లేదా గురువారం స్వస్థలానికి తీసుకు వచ్చే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement