లాడ్జిలో వ్యక్తి మృతి
లాడ్జీలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటన రైల్వేకోడూరులో గురువారం వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం స్థానిక ఎస్ఆర్కే లాడ్జీలో దిగిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండటాన్ని గుర్తించిన లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు మద్యం మత్తులో ఉన్నాడని అనుమానిస్తున్న పోలీసులు అతని స్వస్థలం బళ్లారి అని గుర్తించారు.