ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటులో ఉద్రిక్తత
విజయవాడ : విజయవాడలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కాలేజీ మైదానంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు టీడీపీ నేతలు యత్నించారు.
దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ప్రభుత్వ కాలేజీలో రాజకీయ నేత విగ్రహ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో టీడీపీ కార్యకర్తలకు, విద్యార్థి సంఘాలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పలువురు విద్యార్థి సంఘం నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.