సుల్తానాబాద్‌లో ఉద్రిక్తత
సుల్తానాబాద్: కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో ఎస్సారెస్సీ నీళ్ల కోసం టీడీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. టీడీపీ జిల్లా అధ్యక్షులు విజయరమణారావు ఆధ్వర్యంలో రైతులు, తెలుగు తమ్ముళ్లు రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడటానికి కాలువకు నీటిని విడుదల చేయాలని రెండు గంటలపాటు రాస్తారోకో చేయడంతో అధికారుల నుంచి స్పందన కనిపంచక పోవడంతో ఆగ్రహానికి గురైన తెలుగు తమ్ముళ్లు ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పాటు ఎస్సారెస్సీ సీఈ కార్యాలయం పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వసం చేశారు.